E-Paper
Advertisement

Nagarjuna replace: బాలకృష్ణ బిగ్ బాస్ హోస్ట్ గా రాబోతున్నాడా? నాగ్ అభిమానుల్లో టెన్షన్

Nagarjuna replace: బాలకృష్ణ బిగ్ బాస్ హోస్ట్ గా రాబోతున్నాడా? నాగ్ అభిమానుల్లో టెన్షన్
Advertisement

Big boss reality show host Nagarjuna replace.. Balakrishna name observe: తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఈ మధ్య కాలంలో విశేషంగా ఆకట్టుకుంటున్న రియాలిటీ షో ఏదంటే బిగ్ బాస్ అని యునానిమస్ గా చెప్పేస్తారు అంతా. ఈ షో పై విమర్శలు ఎన్ని వచ్చినా టీఆర్పీ రేటింగ్ మాత్రం బాగానే పెరుగుతూ వస్తోంది. ఎన్టీఆర్, నాని కూడా బిగ్ బాస్ కు హోస్ట్ లుకా వ్యవహరించారు. కానీ నాగార్జున గత మూడు సీజన్లుగా అలరిస్తూ వస్తున్నారు.ఈ సారి బిగ్ బాస్ 8 కూడా నాగార్జునే హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. సెప్టెంబర్ 1న లాంచ్ కాబోతోంది. ఇప్పటికే ప్రోమోలతో ఈ షోపై ఆసక్తిని కలుగజేశారు నిర్వాహకులు. అయితే నాగార్జున తన నటనానుభవంతో..చలాకీ మాటలతో కంటెస్టెంట్లను హుషారు చేస్తూ..మధ్య మధ్యలో వారికి క్లాసులు పీకుతూ మొత్తానికి బాగానే నెట్టుకొస్తున్నారు.

ఎన్ కన్వెన్షన్ ఎఫెక్ట్

Advertisement

ఇప్పటి దాకా చేసిన సీజన్లు ఒక ఎత్తు అయితే..ఈ సారి చెయ్యబోయే సీజన్ 8 మరొక ఎత్తు. ఎందుకంటే ఇటీవల నాగార్జున ఎన్ కన్వెన్షన్ పై హైడ్రా అధికారులు అక్రమ కట్డడాలను కూల్చేయడం జరిగింది. దీనిపై నాగ్ కోర్టుకు కూడా వెళ్లారు. అయితే ఇప్పడు ఇండస్ట్రీలో నాగ్ అక్రమ కట్టడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. నాగార్జున సైతం పబ్లిక్ మీటింగులకు హాజరవ్వడానికి ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. మీడియా సమావేశాలకు కూడా దూరంగా ఉంటున్నారు.ఇప్పటికే సోషల్ మీడియాలో కొందరు నాగార్జునపై ట్రోలింగులు మొదలు పెట్టారు. ఇన్నాళ్లూ నాగార్జున ఎంతో ఆదర్శవంతంగా,నిజాయితీగా సంపాదించుకుంటున్నారని అనుకుంటే ఇలా అక్రమంగా చెరువులను కబ్జా చేయడం ఏమిటని బాహాటంగానే విమర్శిస్తున్నారు. బాబు గోగినేని అయితే నాగార్జున బిగ్ బాస్ హోస్ట్ కు పనికిరాడంటూ స్టేట్ మెంట్లు ఇస్తున్నారు.

బాలయ్య పేరు తెరపై..

Advertisement

ఇలాంటి విపత్కర పరిస్థితిలో బిగ్ బాస్ నిర్వహిస్తున్న స్టార్ మా కూడా బిగ్ ఆలోచనలో పడిందని సమాచారం. ఎన్ కన్వెన్షన్ వ్యవహారంతో నాగార్జునకు వచ్చిన చెడ్డ పేరు ఎక్కడ బిగ్ బాస్ సీజన్ 8 పై పడుతుందో అని కంగారు పడుతున్నారట స్టార్ మా. ఒక వేళ రేటింగ్ పడిపోయినా అది నాగార్జున వల్లే అని భావించాల్సి వస్తుంది. అందుకే స్టార్ మా మైండ్ లో నందమూరి బాలకృష్ణను హోస్ట్ గా తీసుకుంటే ఎలా ఉంటుందనే ఆలోచన మొదలయింది. బాలకృష్ణ కూడా గతంలో ఆహా ఓటీటీ స్క్రీన్ పై నిర్వహించిన రియాలిటీ షో అన్ స్టాపబుల్ విత్ బాలయ్య సూపర్ డూపర్ హిట్ అయింది. ప్రత్యేకంగా ఈ షో వీక్షించడానికే ఆహా సభ్యత్వం తీసుకున్నారంటే ఆశ్చర్యం కలగక మానదు.

రేటింగ్ తగ్గితే..

చంద్రబాబు నాయుడు, ప్రభాస్, విజయ్ దేవరకొండ, సిద్ధూ జొన్నలగడ్డ, గోపీచంద్ వంటి అగ్ర హీరోలతో బాలయ్య చేసిన అన్ స్టాపబుల్ షో కి మంచి రేటింగ్ వచ్చింది. అయితే ఇప్పటికిప్పుడు నాగార్జునను మార్చకపోయినా ఒక వేళ రేటింగ్ తక్కినట్లయితే అప్పుడైనా బాలకృష్ణ ను తీసుకుంటే ఎలా ఉంటుందనే ఆలోచనలో స్టార్ మా యాజమాన్యం ఉన్నట్లు సమాచారం. అయితే ఈ విషయంపై ఇప్పటిదాకా ఎలాంటి క్లారిటీ రాలేదు. ఒక వేళ నాగ్ కూడా మానసికంగా సిద్ధంగా లేకపోయినట్లయితే బిగ్ బాస్ షో హోస్ట్ గా బాలయ్య పేరు సజెస్ట్ చేయవచ్చని సమాచారం. అటు రాజకీయాలలో ఇటు సినిమాలలో బిజీగా ఉండే బాలకృష్ణ ఈ ప్రతిపాదనకు ఎంతవరకూ ఒప్పుకుంటారో చూడాలి.

Related News

బిగ్ బాస్10 హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ తనేనా?

బిగ్ బాస్ హౌస్ లోకి గుండెనిండా గుడి గంటలు హీరో.. ఈ ట్విస్ట్ ఏందీ బాలు..వీడియో వైరల్!

బిగ్ బాస్ 10 లాంచింగ్ ఎపిసోడ్… చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో!

న్యూ చాప్టర్ బిగిన్స్.. బిగ్ బాస్ 10 ఎంట్రీ పై జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ!

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

Big Stories

Advertisement
×