BigTV English

Big Tv Exclusive: హౌస్ నుండి అభయ్ ఎలిమినేట్..

Big Tv Exclusive: హౌస్ నుండి అభయ్ ఎలిమినేట్..

Big Tv Exclusive: బిగ్ బాస్ సీజన్ 8లో మూడోవారం ఎలిమినేషన్‌కు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయ్యింది. బిగ్ బాస్ సెట్ నుండి వచ్చిన ఎక్స్‌క్లూజివ్ సమాచారం ఇది. ఈ తాజా సమాచారం ప్రకారం అభయ్.. హౌస్ నుండి ఎలిమినేట్ అయిపోయి బయటికి వచ్చేశాడు. మొదటి రెండువారాలు పర్వాలేదు అనే ఆట కనబరిచిన అభయ్.. మూడోవారంలో మోనార్క్‌లాగా మారిపోయాడు. తాను చెప్పిందే వేదం అన్నట్టుగా నచ్చిన టాస్క్‌ను ఆడుకుంటూ, ఓడిపోతాడని తెలిస్తే లైట్ తీసుకుంటూ ముందుకు సాగాడు. దీంతో ప్రేక్షకులు కూడా అభయ్ ప్రవర్తనను భరించలేక బయటికి పంపించేసినట్టు సమాచారం.


రూల్స్‌ను ఎదిరించాడు

అభయ్ నవీన్.. సినిమాల్లో కామెడియన్‌గా ప్రేక్షకులను అలరించాడు. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘పెళ్లిచూపులు’ సినిమాతో కామెడియన్‌గా అభయ్‌కు మంచి గుర్తింపు వచ్చింది. కానీ దాని తర్వాత తనకు బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు గానీ, నటించిన సినిమాల నుండి ఫేమ్ గానీ లభించలేదు. దీంతో బిగ్ బాస్ ఆఫర్‌కు వెంటనే ఓకే చెప్పాడు. బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంటర్ అయిన మొదట్లో అభయ్‌పై ప్రేక్షకుల్లో అంతగా నెగిటివ్ అభిప్రాయం ఉండేది కాదు. కానీ చీఫ్‌గా అధికారం వచ్చిన తర్వాత నుండి తనలో చాలా మార్పులను గమనించారు. ఇప్పటివరకు ఎవరూ చేయని విధంగా ఏకంగా బిగ్ బాస్ రూల్స్‌నే ఎదిరించి మాట్లాడాడు అభయ్.


Also Read: పెళ్లాం పై కోపంతో బిగ్ బాస్.. అభయ్ ను బయటకు గెంటేసిన నాగార్జున..!

ఎలిమినేట్ చేసేయండి

చీఫ్‌గా మారిన తర్వాత ముందుగా రేషన్ టాస్కుల్లో నిఖిల్ టీమ్‌తో తలపడ్డాడు అభయ్. నిఖిల్ టీమ్.. గెలవాలి అనే కసితో ఆడడంతో వారు కొన్ని తప్పులు చేసి అయినా ముందుకు సాగి గెలిచారు. కానీ అభయ్ టీమ్ అలా చేయలేదు. ఓడిపోతున్నామని తెలియగానే అభయ్ పక్కకు తప్పుకున్నాడు. అంతే కాకుండా తప్పుడు మార్గాల్లో గెలవాలి అనుకున్నాడు. అప్పటినుండి ప్రేక్షకుల్లో తనపై నెగిటివ్ అభిప్రాయం ఏర్పడింది. ముఖ్యంగా చివరి రేషన్ టాస్కులో అభయ్.. రూల్స్ ప్రకారం ఆడలేదు. అయినా కూడా తాను గెలిచానని, తనను విన్నర్ అని చెప్పకపోతే ఇప్పటినుండి ఏ టాస్కులు ఆడనని, కావాలంటే తనను ఎలిమినేట్ చేయవచ్చని ప్రేక్షకులకే ఛాలెంజ్ చేశాడు. ఆ ఛాలెంజ్‌ను ప్రేక్షకులు సీరియస్‌గా తీసుకున్నారు.

మేకర్స్‌పై కామెంట్స్

రేషన్ టాస్క్ ఓడిపోవడంతో పాటు కిచెన్‌కు కూడా లిమిట్స్ పెట్టారు బిగ్ బాస్. ఇకపై విచ్చలవిడిగా కిచెన్‌ను ఉపయోగించే అవకాశం లేదని, కేవలం వారంలో 14 గంటలు మాత్రమే ఉపయోగించాలని కఠినమైన రూల్స్‌ను ప్రవేశపెట్టారు. దీంతో అభయ్‌కు కోపం వచ్చింది. బిగ్ బాస్ రూల్స్ రాసేవారికి బ్రెయిన్ లేదా అంటూ వ్యాఖ్యలు చేశాడు. అంతే కాకుండా బిగ్ బాస్ షో గురించి, బిగ్ బాస్ మేకర్స్ గురించి హౌస్‌లోనే నెగిటివ్‌గా మాట్లాడాడు. దీంతో నాగార్జున సైతం తనపై కోప్పడ్డాడు. తాజాగా విడుదలయిన ప్రోమోలో కూడా అభయ్‌కు నాగార్జున రెడ్ కార్డ్ చూపించి గేట్లు ఓపెన్ చేసి వెళ్లిపోమన్నట్టుగా చూపించారు. మొత్తానికి అదే నిజమయ్యింది.

Related News

Monal Gajjar : బిగ్ బాస్ బ్యూటీ మోనాల్ గుర్తుందా.? ఇప్పుడేం చేస్తుందో తెలుసా..?

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Big Stories

×