BigTV English

Bigg Boss 18: బిగ్ బాస్ విన్నర్ వారే.. ప్రైజ్ మనీ ఎంతో తెలిస్తే షాక్..!

Bigg Boss 18: బిగ్ బాస్ విన్నర్ వారే.. ప్రైజ్ మనీ ఎంతో తెలిస్తే షాక్..!

Bigg Boss 18:వరల్డ్ బిగ్గెస్ట్ రియాల్టీ షో గా గుర్తింపు తెచ్చుకున్న బిగ్ బాస్ (Bigg boss ) ఎక్కడో పాశ్చాత్య దేశాలలో బిగ్ బ్రదర్ (Bigg Brother ) గా ప్రారంభమై, తొలిసారి హిందీ లో బిగ్ బాస్ పేరిట అందరిని ఆకట్టుకుంది. అలా 2006 నవంబర్ 3వ తేదీన మొదటి సీజన్ ప్రారంభం అయింది. 2007 జనవరి 26న ముగిసిన ఈ షోలో మొదటి విజేతగా రాహుల్ రాయ్ (Rahul rai ) నిలిచారు. కరోల్ గ్రాసియాస్ రన్నరప్ గా నిలిచారు. మొత్తం 86 రోజులపాటు కొనసాగిన ఈ కార్యక్రమానికి అర్షద్ వార్సీ(Arshad varsi) హోస్ట్ గా వ్యవహరించారు. అంతేకాదు మొత్తం 15 మంది కంటెస్టెంట్లు ఇందులో పాల్గొన్నారు.


బిగ్ బాస్ 18 విజేతగా కరణ్..

ఇక అప్పటినుంచి ఇప్పటివరకు మొత్తం 17 సీజన్లు పూర్తి చేసుకుంది హిందీ బిగ్ బాస్. ఇక నిన్నటితో బిగ్ బాస్ సీజన్ 18 కూడా పూర్తయింది. సల్మాన్ ఖాన్ (Salman khan ) హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ సీజన్లో విజేతగా కరణ్ వీర్ మెహ్రా(Karan veer mehra )నిలిచారు. ఆడియన్స్ ఓట్ల ఆధారంగా విజేతను ప్రకటించారు. 46 సంవత్సరాల వయసున్న కరణ్ వీర్ మెహ్రా విజేతగా నిలవడంతో అభిమానులు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. ఇకపోతే విజేతగా నిలిచిన కరణ్ వీర్ మెహ్రా ఈ షో ద్వారా రూ.50 లక్షల ప్రైజ్ మనీని గెలుచుకున్నారు. ఇక ఈయన తర్వాత మొదటి రన్నరప్ గా వివియన్ ద్సేనా నిలవగా.. రెండవ రన్నరప్ గా యూట్యూబర్ రజత్ దలాల్ నిలిచారు.


శుభాకాంక్షల వెల్లువ..

ఇకపోతే ఈ సీజన్ 18లో గట్టి పోటీ ఎదురైనప్పటికీ ఫైనల్ గా బిగ్ బాస్ కప్పుతో కరణ్ ఇంటికి వెళ్లారు. ముఖ్యంగా కరణ్ కు ఈ సందర్భంగా అటు అభిమానులు, బుల్లితెర ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మొత్తానికి అయితే ఎన్నో కష్టాలు, పోటీలు, అవమానాలు అన్నీ ఎదుర్కొని నేడు విజేతగా నిలవడంతో ఆయన కష్టానికి ప్రతిఫలం లభించిందని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

కరణ్ వీర్ మెహ్రా సినిమాలు, షో లు..

ఇక ఈయన బిగ్ బాస్ షో కి వెళ్ళకముందు పవిత్ర రిష్తా, యే రిష్తా క్యా కెహ్లాతా, పరి హూన్ మైన్, పోలీస్ అండ్ క్రైమ్, భడే అచ్చే లాగ్తే హాన్, ససురల్ సిమర్ కా వంటి టీవీ సీరియల్స్ తో భారీ పాపులారిటీ అందుకున్నాడు. ఆ క్రేజ్ తోనే బిగ్ బాస్ లోకి అడుగు పెట్టాడు. 2005లో రీమిక్స్ షో తో తన కెరీర్ ను ప్రారంభించిన సోనీ ఎస్ ఏ బి టీవీ, బీవీ ఔర్ మెయిన్ లో కీలక పాత్రలు పోషించాడు. బ్లడ్ మనీ, రాగిణి ఎంఎంఎస్ 2, మేరే డాడ్ కి మారుతి,ఆమెన్, బద్మ షియాన్ వంటి బాలీవుడ్ సినిమాలలో కూడా నటించాడు. ఇక మొత్తానికైతే బిగ్ బాస్ షో ద్వారా విజేతగా నిలిచిన ఈయనకు మరిన్ని సినిమాలలో, షోలలో అవకాశాలు రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి ఏ మేరకు ఈయన కెరియర్ కు బిగ్ బాస్ ఉపయోగపడుతుందో చూడాలి.

Related News

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Big Stories

×