Telugu Anchors : బుల్లితెరపై పలు కార్యక్రమాలు సక్సెస్ఫుల్గా రన్నవ్వాలంటే ఆ షో కి యాంకర్స్ చాలా ముఖ్యం. యాంకర్స్ మాట తీరు వాళ్ళు చేసే ప్రజెంటేషన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటేనే షో హిట్ అవుతుంది లేదంటే విమర్శలు అందుకుంటుంది.. కేవలం బుల్లితెరపై వచ్చే షోలు మాత్రమే కాదు అటు వెండి ధరపై రిలీజ్ అవుతున్న సినిమాలకు ముందుగా ప్రమోషన్స్ చేయాల్సింది యాంకర్స్.. యాంకర్స్ చెప్పే ఇంట్లో మీదే సినిమా ఈవెంట్లు ఆధారపడి ఉంటాయి. ఇండస్ట్రీలో ఏమో కానీ తెలుగు ఇండస్ట్రీలో మాత్రం యాంకర్స్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఏ వేడుకలో నైనా సరే అందర్నీ ఆకర్షించే విధంగా తమ అందంతో పాటు చలాకీ మాటలతో ఆకట్టుకుంటూ ఉంటారు.. తెలుగు యాంకర్స్ ఏజ్ మరియు ఫ్యామిలీ గురించి తెలుసుకోవాలని అందరు అనుకుంటారు.. మనం తెలుగులోని టాప్ ఫీమెల్ యాంకర్స్ ఏజ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
సుమ..
తెలుగు బుల్లితెరపై టాప్ యాంకర్లలో ఎక్కువగా వినిపించే పేరు యాంకర్ సుమ.. కేరళ బ్యూటీ అయిన ఈమె తెలుగు చక్కగా మాట్లాడుతుంది. అదే ఆమెకు ప్లస్ అయింది. చలాకితనం అందరినీ ఆకట్టుకుంటుంది. ఆమె వేసి పంచులు ఫ్యామిలీ ఆడియన్స్ లు కూడా ఆకట్టుకుంటాయి అందుకే ఆమె చేసిన ప్రతి షో సూపర్ హిట్ టాక్ ను అందుకుంటుంది.. ఎంత వయసొచ్చినా ఆమె ఇంకా యంగ్ గానే కనిపిస్తుంది ఇంతకీ ఆమె వయసెంత అనే డౌటు అందరికీ రావచ్చు. సుమ 1975 వ సంవత్సరం మార్చి 25న జన్మించింది.. ప్రస్తుతం ఆమె వయస్సు 49 సంవత్సరాలు..
శ్రీముఖి..
బుల్లితెరపై సుమ తర్వాత వినిపిస్తున్న పేరు యాంకర్ శ్రీముఖి.. పటాస్ షో ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె ఆ తర్వాత వరుసగా షోలను చేసుకుంటూ యూత్ ఫాలోయింగ్ పెంచుకుంది. ఈమె చేసే షోల కోసం యూత్ ఆసక్తి చూపిస్తుంటారు.. మే 10 1993లో జన్మించిన శ్రీముఖి వయసు 31 సంవత్సరాలు. త్వరలోనే ఈ అమ్మడు పెళ్లి పీటలు ఎక్కనుందని టాక్..
రష్మీ గౌతమ్..
సినిమాల నుంచి యాంకరింగ్ కి వచ్చి యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రష్మీ గౌతమ్ గురించి అందరు తెలుసు.. ఈమె ఎప్పుడో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత టర్న్ తీసుకొని యాంకరింగ్ లో బిజీ అయిపోయింది. రష్మి 1988వ సంవత్సరం ఏప్రిల్ 27న జన్మించింది. ప్రస్తుతం ఈమె వయస్సు 36 సంవత్సరాలు అని తెలుస్తుంది..
అనసూయ..
బుల్లితెరపై ఒకప్పుడు జబర్దస్త్ షోలో అనసూయ పేరు ఎక్కువగా వినిపించేది. యాంకరింగ్ తో పాటు ఆమె వేసే డ్రెస్సులు యూత్ ని బాగా ఆకట్టుకున్నాయి. అడ్రస్లలో అనసూయ అందం యువతని చూపు తిప్పుకునేవ్వకుండా చేసింది అందుకే ఆమె క్రేజ్ ఇప్పుడు సినిమాల వరకు వెళ్ళింది. ప్రస్తుతం ఆమె సినిమాలతో బిజీగా ఉంది. ఇక అనసూయ మే 15, 1985లో జన్మించగా ప్రస్తుత వయస్సు 39..
వీళ్ళతోపాటు చాలామంది యాంకర్స్ ఏ ఉన్నారు అందులో ఉదయభాను ఆమె వయసు ప్రస్తుతం 51 సంవత్సరాలు, విష్ణు ప్రియ 34 సంవత్సరాలు, అలాగే ఝాన్సీ వయసు 49 సంవత్సరాలు.. వీరితో పాటుగా చాలామంది యాంకర్స్ షోలు చేసి పాపులారిటీని సొంతం చేసుకున్నారు.. ప్రస్తుతం కొంతమంది బుల్లితెర షోలకు దూరంగా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం హైపర్ యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను సెండ్ చేస్తూ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నారు..