Ramayana Movie: బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ దర్శకులలో ఒకరు నితేష్ తివారీ. దర్శకత్వంలో వచ్చిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి.. కొన్ని సినిమాలో ఏకంగా అవార్డులను అందుకున్నాయి. అలాంటి ఈ డైరెక్టర్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘రామాయణ్ ‘.. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తోంది. కన్నడ సూపర్ స్టార్ యశ్ రావణుడిగా కనిపించనున్నాడు. రవి దుబే.. లక్మణుడిగా, సన్నీ డియోల్.. హనుమంతుడిగా, సంగీతం హన్స్ జిమ్మర్, ఏఆర్ రెహమాన్. రచయితా శ్రీధర్ రాఘవన్, దర్శకత్వం నితేశ్ తివారీ. అంటూ వీడియోతో పాత్రలతో క్లారిటీ ఇచ్చారు. అలాగే కాజల్ అగర్వాల్ మండోదరి పాత్రను పోషించనుందని సమచారం. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుండగా, మొదటి భాగం షూటింగ్ పూర్తయినట్లు సమాచారం. ఈ సినిమా కోసం ఫాన్స్ ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీ నుంచి గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేశారు. ఆ వీడియో ఎలా ఉందో చూద్దాం..
‘రామాయణ్ ‘ గ్లింప్స్ వీడియో..
బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న లేటెస్ట్ ఫ్యాన్ ఇండియా చిత్రం రామాయణ్.. గతంలో ఎన్నడు లేని విధంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ వచ్చే ఏడాది థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేశారు.. ఆ వీడియోలో అద్భుతమైన సన్నివేశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమా విజువల్ వండర్ గా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఈ వీడియోని చూస్తే అర్థమవుతుంది. కేవలం రాముడు, రావణుడు ఎలా ఉంటారో విజువల్స్ ద్వారా చూపించారు. మొత్తానికి ఈ మూవీతో మరోసారి రామాయణం గురించి ప్రేక్షకులు తెలుసుకోబోతున్నారు.. ఇప్పటివరకు ఈ మూవీ నుంచి పోస్టర్లు రిలీజ్ అయ్యాయి. తాజాగా రిలీజ్ అయిన వీడియో సినిమాపై భారీ ఎక్స్పెక్టేషన్స్ని క్రియేట్ చేస్తుంది. ఈ సినిమా కోసం రణబీర్ ఫాన్స్, అటు సాయి పల్లవి ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. ఇటీవల బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి రిలీజ్ అవుతున్న సినిమాలు మంచి టాక్ని సొంతం చేసుకుంటున్నాయి. మరి ఈ సినిమా ఏ విధంగా ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి..
Also Read:ఇంకా విషమంగానే ఫిష్ వెంకట్… డాక్టర్ ఏం అన్నారంటే ?
సినిమా రిలీజ్ ఎప్పుడంటే..?
బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం రామాయణ్.. పాన్ ఇండియాలోని అన్ని భాషలలో విడుదల కానుంది. ఇది తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ వంటి వివిధ భాషలల్లోనూతెరకెక్కనుంది. ఈ చిత్రం మొదటి భాగం షూటింగ్ పూర్తయింది. 2026 లో దీపావళి పండుగ సందర్భంగారామయాణ్ పార్ట్ 1 ను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారట.. అలాగే ఈ సినిమా రెండవ భాగాన్ని 2027 దీపావళికి విడుదల చేస్తామని చిత్రబృందం ఇప్పటికే ప్రకటించడం గమనార్హం. ఈ సినిమా మొదటి భాగం షూటింగ్ పూర్తయినందున సినిమాపై అంచనాలను పెంచేందుకు వరుసగా అప్డేట్లను రిలీజ్ చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీలో టాక్..