BigTV English

Bigg Boss 8 Day 25 Promo 2: క్లాన్ వర్సెస్ క్లాన్.. కాంతారా రూట్ తొలగినట్లేనా..?

Bigg Boss 8 Day 25 Promo 2: క్లాన్ వర్సెస్ క్లాన్.. కాంతారా రూట్ తొలగినట్లేనా..?

Bigg Boss 8 Day 25 Promo 2.. తాజాగా బిగ్ బాస్ (Bigg Boss) హౌస్ లోకి ఏకంగా 12 మంది సెలబ్రిటీలు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు.. అయితే మీరు బిగ్ బాస్ ఇచ్చే ఛాలెంజ్ గెలిచి, వారిని హౌస్ లోకి రాకుండా ఆపవచ్చు అంటూ ఒక మెలిక పెట్టి వదిలేశారు బిగ్ బాస్. ఇక తాజాగా కంటెస్టెంట్స్ ఛాలెంజ్ చేస్తూ.. హౌస్ లోకి వచ్చే వైల్డ్ కార్డు ఎంట్రీస్ ని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇది ఛాలెంజ్ కారణంగా హౌస్ మెంబర్స్ వర్సెస్ వైల్డ్ కార్డు ఎంట్రీ మెంబర్స్ అన్నట్టుగా కాకుండా క్లాన్ వర్సెస్ క్లాన్ లాగా మారిపోయింది.


నబీల్ ను తొలగించిన శక్తి క్లాన్..

అసలు విషయంలోకి వెళ్తే.. శక్తి క్లాన్ మెంబర్స్ తీసుకున్న నిర్ణయానికి కాంతారా క్లాన్ రూట్ కోల్పోయిందని చెప్పవచ్చు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.” గట్టిగా పట్టుకో.. లేదంటే పగిలిపోతుంది”.. ఛాలెంజ్ పూర్తి చేసిన తర్వాత బిగ్ బాస్ మరో నిర్ణయాన్ని తీసుకున్నారు. బిగ్ బాస్ మాట్లాడుతూ.. కాంతారా క్లాన్. మీ క్లాన్ నుంచి సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ ఛాలెంజ్ కి అనర్హులైన ఒక సభ్యుడిని ఛాలెంజ్ నుంచి తప్పించాల్సి ఉంటుంది. కానీ ఆ అనర్హుడు ఎవరు అనేది శక్తి క్లాన్ సభ్యులు నిర్ణయిస్తారు అంటూ ట్విస్ట్ పెట్టాడు బిగ్ బాస్. దీంతో శక్తి క్లాన్ చీఫ్ నిఖిల్ మాట్లాడుతూ నబీల్ పేరు చెప్పగానే అందరూ ఆశ్చర్యపోయారు. నిజానికి కాంతారా క్లాన్ కి నబీల్ రూట్ గా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి రూట్ ను తొలగించి , పెకిలించేశారని కాంతారా క్లాన్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.


శక్తి క్లాన్ పై కాంతారా క్లాన్ సభ్యులు ఫైర్..

దీంతో కోపం తెచ్చుకున్న విష్ణు ప్రియ నీలో రెండు ముఖాలు ఉన్నాయని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నిఖిల్ అంటూ ఫైర్ అయ్యింది. మరొకవైపు ప్రేరణ కూడా మణి పేరు మీరు ఎందుకు తీశారు అంటూ శక్తి క్లాన్ సభ్యులను ప్రశ్నించగా.. మణి నే వెళ్లిపోతానని చెప్పాడు అంటూ శక్తి క్లాన్ సభ్యులు తెలిపారు. దీనితో ప్రేరణ నేనే వెళ్ళిపోతాను తొలగించండి అంటూ అడిగాడా అంటూ మరొకసారి కోపంగా ప్రశ్నించింది. అవును మణికంఠ వెళ్ళిపోతానని చెప్పాడు అంటూ శక్తి క్లాన్ సభ్యులు తెలిపారు. ఆ తర్వాత శక్తి క్లాస్ సభ్యులకు మణికంఠకు మధ్య వాగ్వాదం జరిగింది. ఇక ఆ తర్వాత మణి కోపంతో మైకు విసిరేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సోనియా, యష్మీ, పృథ్వి, నిఖిల్ నలుగురు బలవంతం పెట్టి మణికంఠను తొలగించారు అంటూ ప్రేరణ కామెంట్ చేసింది.

క్లాన్ వర్సెస్ క్లాన్..
స్ట్రాంగ్ ఉన్నవాళ్లు ఆడాలి.. గెలిపించాలి.. వైల్డ్ కార్డు ఎంట్రీలను ఆపాలనే కదా ఇక్కడ టాస్క్.. కానీ ఇక్కడ క్లాన్ వర్సెస్ క్లాన్ అయిపోయింది అంటూ సీత కామెంట్ చేసింది. మొత్తానికైతే కంటెస్టెంట్స్ మధ్య బిగ్ బాస్ భారీగానే గొడవపెట్టాడు అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.

Related News

Bigg Boss 9 Promo: మైండ్ దొబ్బిందా.. రీతూకి హోస్ట్ స్ట్రాంగ్ కౌంటర్!

Bigg Boss 9 Promo : భరణి గెట్ అవుట్ ఫ్రం హౌస్… హీటెక్కిన వీకెండ్ ఎపిసోడ్

Bigg Boss 9: సుమన్ శెట్టి ఫైర్, కొత్త కెప్టెన్ గా కామనర్, హౌస్ మేట్స్ పై రెచ్చిపోయిన తనూజ

Bigg Boss 9 Wildcard Entry: 6 గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్… యాడ దొరికిన సంతరా ఇది.. అంతా స్క్రాపే

Bigg Boss 9 New Captain: భరణికి చెక్ పెట్టిన కళ్యాణ్.. హౌజ్‌ కొత్త కెప్టెన్‌ అతడే!

Bigg Boss 9 Promo: అదిరిపోయిన కెప్టెన్సీ టాస్క్.. అతి నమ్మకం పనికిరాదు పాపా!

Bigg Boss 9 Promo: పొట్టిగా ఉండడం ఆయన చేసిన తప్పా.. ఏంటమ్మా ఫ్లోరా?

BB 9 Wild Card: వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వబోతున్న కాంట్రవర్సీ క్వీన్.. రచ్చ మాములుగా ఉండదు మరి..!

Big Stories

×