E-Paper
Advertisement

Bigg Boss 8 Day 26 Promo 1: గెస్ ద సౌండ్స్.. కడుపు నింపుకోవడానికి ఎన్ని తిప్పలో..!

Bigg Boss 8 Day 26 Promo 1: గెస్ ద సౌండ్స్.. కడుపు నింపుకోవడానికి ఎన్ని తిప్పలో..!
Advertisement

Bigg Boss 8 Day 26 Promo 1.. బిగ్ బాస్ (Bigg Boss).. 26వ రోజుకు సంబంధించి తాజాగా ప్రోమోను విడుదల చేశారు షో నిర్వాహకులు. ఈ ప్రోమో చూస్తుంటే కడుపు నింపుకోవడానికి కంటెస్టెంట్స్ ఎన్ని తిప్పలు పడుతున్నారో అంటూ ప్రతి ఒక్కరూ కామెంట్ చేస్తున్నారు. మరి ఈ ప్రోమోలో ఏముంది..? తాజాగా బిగ్ బాస్ తీసుకొచ్చిన ఆ కొత్త ఛాలెంజ్ ఏంటి..? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.

గెస్ ది సౌండ్స్..

Advertisement

ప్రోమో విషయానికి వస్తే.. మీరు ఆహారం నిలువ చేసుకునే సమయం వచ్చేసింది. ఎవరు ఎంత ఎక్కువగా నిలువ చేసుకోగలరు అనేది.. మీరు ఎంత బాగా పెర్ఫామ్ చేస్తారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది అంటూ బిగ్ బాస్ తెలిపారు. బిగ్ బాస్ మీకు వినిపించే సౌండ్స్ ని వరుస క్రమంలో గుర్తుపెట్టుకుని , అదే వరుస క్రమంలో రాయండి అంటూ తెలిపారు బిగ్ బాస్.

రేషన్ కోసం తప్పని తిప్పలు..

Advertisement

ఇక అందరూ కూడా ప్యాడ్ , పెన్ తో సిద్ధమైపోయారు. టాస్క్ లో భాగంగా మొదట ప్రేరణ వర్సెస్ మణికంఠ.. శక్తి క్లాన్ నుంచి మణికంఠ , కాంతార క్లాన్ నుంచి ప్రేరణ ముందుకు వచ్చారు. సంచాలక్ గా నబీల్ వ్యవహరించారు. బిగ్ బాస్ సౌండ్స్ వినిపించడం మొదలుపెట్టారు. రూస్టర్, ఫైర్ వర్క్, ఎలిఫెంట్, మేక చేసే అరుపులను వినిపించారు. ప్రేరణ మణికంఠతో పాటు నైనిక , నిఖిల్ కూడా ఈ టాస్క్ లో పాల్గొన్నారు. అయితే నిఖిల్ అక్కడ ఏం సౌండ్స్ వినిపించాయో అర్థం చేసుకోలేక పక్క చూపులు చూడడం అందరికీ నవ్వు తెప్పించింది. ఆ తర్వాత బోర్డు అటువైపు తిప్పుకో అంటూ నబీల్ మధ్యలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత రూస్టర్ తాను కరెక్ట్ గా రాసానంటూ ఎగిరి గంతేస్తుంది ప్రేరణ. అయితే అక్కడ ఫైర్ వర్క్ రాయకుండా ప్రేరణ గన్ అని రాయడంతో అటు మణికంఠ , ఇటు ప్రేరణ ఇద్దరికీ కూడా జీరో ఇచ్చేశాడు సంచాలక్ నబీల్.

మణికంఠను గాడిద అంటూ కామెంట్ చేసిన కంటెస్టెంట్స్..

ఆ తర్వాత సోనియా వర్సెస్ విష్ణు ప్రియ, అలాగే సీత వర్సెస్ యష్మీ కి కూడా సౌండ్స్ వినిపించారు. ఆ తర్వాత బిగ్ బాస్ సీతతో మాట్లాడుతూ.. సీత మంకీ, గాడిద ఎలా అరుస్తాయో చెప్పు అంటూ అడిగాడు. దీంతో సీత కొన్ని సౌండ్స్ చేసి నా వాయిస్ కూడా గాడిద వాయిస్ లాగే ఉంటుంది బిగ్ బాస్ అంటూ కామెంట్ చేసింది. ఆ తర్వాత మణికంఠ అచ్చం గాడిదలాగే సౌండ్ చేసి అందర్నీ నవ్వించారు. ఇక నువ్వు గాడిదే అంటూ ప్రేరణ, విష్ణు ప్రియ మణికంఠను ఆటపట్టించారు. మొత్తానికి అయితే ప్రోమో నవ్వులు అరుపులతో బాగా క్లిక్ అయిందని చెప్పాలి. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ గా మారుతోంది. మరి ఎవరు ఎంత రేషన్ సొంతం చేసుకున్నారో తెలియాలంటే ఎపిసోడ్ వరకు ఎదురు చూడాల్సిందే.

Related News

బిగ్ బాస్10 హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ తనేనా?

బిగ్ బాస్ హౌస్ లోకి గుండెనిండా గుడి గంటలు హీరో.. ఈ ట్విస్ట్ ఏందీ బాలు..వీడియో వైరల్!

బిగ్ బాస్ 10 లాంచింగ్ ఎపిసోడ్… చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో!

న్యూ చాప్టర్ బిగిన్స్.. బిగ్ బాస్ 10 ఎంట్రీ పై జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ!

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

Big Stories

Advertisement
×