BigTV English

Bigg Boss 8 Day 35 Promo 1: ఎంటర్టైన్మెంట్ కి లిమిటే లేదు.. హౌస్ లో రచ్చ మొదలెట్టిన వైల్డ్ కార్డ్స్..!

Bigg Boss 8 Day 35 Promo 1: ఎంటర్టైన్మెంట్ కి లిమిటే లేదు.. హౌస్ లో రచ్చ మొదలెట్టిన వైల్డ్ కార్డ్స్..!

Bigg Boss 8 Day 35 Promo 1.. బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి బిగ్ బాస్ 8వ సీజన్ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఎనిమిదవ సీజన్లో భాగంగా ఐదు వారాలు పూర్తయిన విషయం తెలిసిందే. బెజవాడ బేబక్క, ఆర్.జే.శేఖర్ బాషా, అభయ్ నవీన్, సోనియా ఆకుల, ఆదిత్య ఓం, నైనిక, యశ్మీ, మణికంఠ, నిఖిల్, పృథ్వీరాజ్ శెట్టి, విష్ణు ప్రియ, సీత, ప్రేరణ, నబీల్ ఇలా మొత్తం 14 మంది హౌస్ లోకి అడుగుపెట్టగా.. అందులో ఆరుగురు ఐదు వారాలకు గాను ఎలిమినేట్ అయిపోయారు. ప్రస్తుతం హౌస్ లో 8 మంది మాత్రమే ఉన్నారు. ఈ ఎనిమిది మందిని ఒక క్లాన్ గా చేర్చారు బిగ్ బాస్.


వైల్డ్ కార్డు ఎంట్రీస్..

దీనికి తోడు మరొకవైపు బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్లను వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి పంపించారు బిగ్బాస్. అలా ఏకంగా 8 మంది ఈ వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టి వీరంతా ఒక క్లాన్ గా ఏర్పడ్డారు. రోహిణి, హరితేజ, నయనీపావని , ముక్కు అవినాష్ , గంగవ్వ, మెహబూబ్, టేస్టీ తేజ, గౌతమ్ కృష్ణ ఇలా మొత్తం ఎనిమిది మంది వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చారు. ఇక వైల్డ్ కార్డు ఎంట్రీస్ అడుగుపెట్టడంతోనే మణికంఠ ముఖం ఒక వెలుగు వెలుగుతోంది. నిన్నటి వరకు ఒంటరిగా ఫీలయ్యారేమో తెలియదు కానీ ఇప్పుడు వైల్డ్ కార్డు ఎంట్రీస్ తో బాగా కలసిపోయి ఆటలాడుతూ వారితో తెగ సందడి చేసేస్తున్నారు.


ఫుల్ ఎంటర్టైన్మెంట్ పక్కా..

ఇదిలో ఉండగా తాజాగా 35వ రోజుకు సంబంధించి తాజా ప్రోమో ను బిగ్ బాస్ నిర్వహకులు విడుదల చేశారు.. ఇందులో ముక్కు అవినాష్ మొదటి రోజే బుక్ అయినట్టు తెలుస్తోంది. ప్రోమో విషయానికి వస్తే.. గంగవ్వ, రోహిణి, పృథ్వీ, నిఖిల్, నబిల్, యష్మీ వీరంతా ఒకచోట చేరి ముచ్చట్లు పెట్టారు. ఇక్కడ టీ పెట్టుకోవడానికి పాలు కూడా లేవబ్బా అంటూ రోహిణి కామెంట్ చేయగానే.. నాలుగు ప్యాకెట్లు తీసుకొచ్చేవాళ్లం కదా అంటూ గంగవ్వ కామెడీ చేసింది. అందరికీ ఇస్తారు కదా అని రోహిణి అడిగితే.. దాచుకుంటారా మరి అంటూ మరోసారి కామెడీ చేసింది గంగవ్వ. నేను కొంచెం పెద్ద మనిషిని అంటూ గంగవ్వ కామెంట్ చేయగా.. రోహిణి కూడా నేను కూడా పెద్దమనిషినే అంటూ హౌస్ లో నువ్వులు పూయించారు.

మొదటి రోజే బుక్ అయిన ముక్కు అవినాష్..

ఇక తర్వాత మణికంఠ, ముక్కు అవినాష్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ అక్కడ పాత్రలు ఉంటాయి.. ఇద్దరూ కలిసి షేర్ చేసుకుని శుభ్రం చేయవచ్చు అని చెబుతాడు మణికంఠ ..దీంతో ముక్కు అవినాష్ మాట్లాడుతూ.. మీరు ఎక్కువ వంట చేసుకుని ఎక్కువ పాత్రలేస్తే అవన్నీ మేము తోమాల అంటూ అద్భుతమైన ఎక్స్ప్రెషన్ తో అందర్నీ నవ్వించారు. డిసైడ్ చేసిన వాళ్లు పాత్రలు క్లీన్ చేస్తారు అంటూ హరితేజ చెప్పగా.. ఇప్పటినుంచి క్లీన్ చేయమంటున్నారు అంటూ ముక్కు అవినాష్ తెలిపారు. అలా చివరికి చంద్రముఖిలోని పాట పాడుతూ హరితేజ, ముక్కు అవినాష్, మణికంఠ పాత్రలు క్లీన్ చేసేసారు. మొత్తానికి అయితే హౌస్ మొత్తం సందడి సందడిగా సాగింది.

Related News

Bigg Boss 9 Telugu: డబుల్ హౌస్.. డబుల్ డోస్..బిగ్ ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్

Monal Gajjar : బిగ్ బాస్ బ్యూటీ మోనాల్ గుర్తుందా.? ఇప్పుడేం చేస్తుందో తెలుసా..?

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Big Stories

×