BigTV English
Advertisement

Bigg Boss 8 Promo: ‘బిగ్ బాస్’లో ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. అది మానేస్తే చాలు నువ్వేం అడిగినా చేస్తానంటూ నిఖిల్‌కు సోనియా ఆఫర్

Bigg Boss 8 Promo: ‘బిగ్ బాస్’లో ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. అది మానేస్తే చాలు నువ్వేం అడిగినా చేస్తానంటూ నిఖిల్‌కు సోనియా ఆఫర్

Bigg Boss 8 Latest Promo: బిగ్ బాస్ రియాలిటీ షోలో అడుగుపెట్టిన రెండురోజులకే కొందరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోతారు. అలా కొన్ని టీమ్స్ కూడా ఫార్మ్ అయిపోతారు. బిగ్ బాస్ 8లో కూడా అలా టీమ్స్ ఫార్మ్ అయినా అవి ఏంటి అని విషయం ప్రేక్షకులకు ఇంకా క్లారిటీ లేదు. మండే అంటే నామినేషన్స్ డే కావడంతో నామినేషన్స్‌కు సంబంధించిన ప్రోమో ఇప్పటికే విడుదలయ్యింది. ఇక నామినేషన్స్‌కు ముందు, తర్వాత కొందరు కంటెస్టెంట్స్ విడివిడిగా హౌజ్‌లో ఇతరుల గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. దానికి సంబంధించిన ప్రోమో కూడా తాజాగా విడుదలయ్యింది. అందులో నిఖిల్, సోనియా కెమిస్ట్రీ హైలెట్‌గా నిలిచింది.


ఆమె వెళ్లిపోతుంది అనుకున్నాను

బిగ్ బాస్ 8 మొదటివారం ఎలిమినేషన్‌లోనే బేబక్క బయటికి వెళ్లిపోతుందని చాలామంది కంటెస్టెంట్స్ ఊహించలేదు. అందుకే విష్ణుప్రియా, ప్రేరణ, నైనికా కలిసి ఈ విషయంపై చర్చించడం మొదలుపెట్టారు. ‘‘అసలైతే అక్క వెళ్లిపోతుందని ఊహించలేదు’’ అని ప్రేరణ చెప్పగా.. తాను సోనియా వెళ్లిపోతుందని అనుకున్నానని విష్ణుప్రియా ఇన్‌డైరెక్ట్‌గా చెప్పింది. అసలు ఆమె వెళ్లిపోతుందని ఎలా అనుకున్నావు అని ప్రేరణ ఆశ్చర్యపోగా.. అది పట్టించుకోకుండా ఇప్పుడు ఆమెకు సొంతంగా టీమ్ కూడా తయారయ్యింది అని విష్ణుప్రియా చెప్పింది. ఇదంతా వింటున్న నైనికా.. ‘‘చీఫ్ కూడా అవుతుంది, పెద్ద టీమ్, లగ్జరీ కూడా వస్తుంది చూడు’’ అని అభిప్రాయం వ్యక్తం చేసింది.


Also Read: ఆమె చేసిన తప్పుకు నైనికా బలి.. బొక్కలో క్లారిటీ అంటూ సోనియాతో సీత పిచ్చి మాటలు

మణికంఠకు మోటివేషన్

సోనియా గురించి నైనికా చెప్పిన మాటలు విన్న ఆదిత్య ఓం.. ‘‘మా చీఫే వేరే చీఫ్‌ను గ్రేట్ అంటే.. ఈ భజనమండలి, ఫ్యాన్ క్లబ్‌లో ఉండడానికి నేను రాలేదు’’ అని సీతకు చెప్తూ ఫైర్ అయ్యాడు. ఆ తర్వాత ప్రేరణ, యష్మీ మధ్య నామినేషన్స్ గురించి కాసేపు చర్చలు నడిచాయి. మరోవైపు నబీల్, నాగ మణికంఠ కలిసి బిగ్ బాస్ హౌజ్‌లో ఏర్పాటైన టీమ్స్ గురించి మాట్లాడుకున్నారు. ఆపై నాగ మణికంఠకు కాసేపు మోటివేషన్ ఇవ్వడానికి ప్రయత్నించింది యష్మీ. ‘‘హౌజ్‌మేట్స్ ఎవ్వరూ నీకేం కారు. ఇక్కడ ప్రతీ ఒక్కరు కంటెస్టెంట్సే. కేవలం బిగ్ బాస్ మాట మాత్రమే వినాలి’’ అంటూ సలహాలు ఇచ్చింది.

ప్రేమలో స్వేచ్ఛ ఉండాలి

డైనింగ్ టేబుల్ దగ్గర సోనియా, పృథ్విరాజ్ క్లోజ్‌గా మాట్లాడుతూ కనిపించారు. అది చూసి ‘‘నిజమైన ప్రేమలో స్వేచ్ఛ ఉండాలి. పర్వాలేదు పృథ్వి ఎంతమందికైనా ప్రేమను పంచొచ్చు’’ అని కౌంటర్ వేసింది విష్ణుప్రియా. తాను ఏం చేసినా అందరూ ప్రాబ్లమ్ అంటున్నారంటూ నాగ మణికంఠతో తన బాధలు చెప్పుకున్నాడు నిఖిల్. ఆ తర్వాత నిఖిల్, సోనియా ఒంటరిగా ఉన్నప్పుడు ‘‘సిగరెట్ తాగకుండా ఉండు నువ్వేం అడిగినా చేస్తా’’ అని నిఖిల్‌కు ఆఫర్ ఇచ్చింది సోనియా. అది అర్థం కాని నిఖిల్ షాక్‌లో చూశాడు. వాళ్లిద్దరూ ప్రైవేట్‌గా మాట్లాడుకుంటున్నప్పుడు ఇతర హౌజ్‌మేట్స్ వారిపై కౌంటర్లు వేశారు.

Related News

Bigg Boss 9 Telugu : గౌరవ్ కు గట్టిదెబ్బ… ఇదేందయ్యా ఇదీ… కట్టప్ప కన్నా తనూజా – ఇమ్మాన్యుయేల్ వెన్నుపోటే దారుణం

Bigg Boss 9 Telugu Day 60 : ఇమ్మూను బోల్తా కొట్టించిన రీతూ… తనూజా వల్ల గౌరవ్ కు తీరని అన్యాయం… దివ్య దిక్కుమాలిన ప్లాన్ సక్సెస్

Bigg Boss 9 Madhuri: వాళ్లు రెమ్యునరేషన్‌ ఇచ్చేదేంటి.. నాకే నెలకు కోటి వస్తుంది.. దివ్వెల మాధురి

Bigg Boss 9 Promo: కెప్టెన్సీ వార్‌.. హీటెక్కిన ఆరేంజ్‌ టీం డిస్కషన్‌, తగ్గేదే లే అంటున్న గౌరవ్!

Bigg Boss 9 Promo: సీక్రెట్ టాస్క్.. అడ్డంగా బుక్కైన ఇమ్మూ !

Bigg Boss 9 Telugu : దారుణంగా పడిపోయిన బిగ్ బాస్ ఓటింగ్ రిజల్ట్.. అతనే విన్నర్..?

Bigg Boss Telugu 9 : ఇమ్మూ బట్టతలపై బిగ్ బాస్ పంచులు… ఈ గుడ్డులో గోల ఏందయ్యా మాకు ?

Bigg Boss 9 : ఈ సీజన్ లో అలాంటి వాడు లేడు, కెప్టెన్ కి ఇచ్చి పడేసాడు 

Big Stories

×