BigTV English

Bigg Boss 8 Promo: ఆమె చేసిన తప్పుకు నైనికా బలి.. బొక్కలో క్లారిటీ అంటూ సోనియాతో సీత పిచ్చి మాటలు

Bigg Boss 8 Promo: ఆమె చేసిన తప్పుకు నైనికా బలి.. బొక్కలో క్లారిటీ అంటూ సోనియాతో సీత పిచ్చి మాటలు

Bigg Boss 8 Latest Promo: బిగ్ బాస్ సీజన్ 8లో రెండోవారం నామినేషన్స్ మరింత ఇంట్రెస్టింగ్‌గా సాగనున్నాయి. దానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలయ్యింది. మొదటి వారంలో చీఫ్స్ గెలవడం, కంటెస్టెంట్స్‌ను వారు టీమ్స్‌గా విభజించడం, ఆ టీమ్స్ పోటాపోటీగా టాస్కులు ఆడడం.. ఇవన్నీ జరిగాయి. అదే సమయంలో యష్మీ, నైనికా టీమ్స్‌కు మధ్య ఎన్నో మనస్పర్థలు వచ్చాయి. గొడవలు కూడా జరిగాయి. ఆ గొడవలన్నీ మరోసారి నామినేషన్స్‌కు గుర్తుచేసుకుంటున్నారు కంటెస్టెంట్స్. అసలు ఈవారం నామినేషన్స్ ఎలా జరిగాయో ప్రోమో చూస్తే అర్థమవుతోంది.


క్యారెక్టర్‌ను అనలేదు

ప్రతీ కంటెస్టెంట్.. ఇద్దరు కంటెస్టెంట్స్‌ను నామినేట్ చేసి వారి తలపై పెయింట్ నీళ్లు పోయాలని బిగ్ బాస్ ఆదేశించడంతో ప్రోమో మొదలవుతుంది. ముందుగా సీత వచ్చి ప్రేరణను నామినేట్ చేస్తున్నట్టుగా తెలిపింది. యష్మీతో ప్రేరణకు బయట ఉన్న ఫ్రెండ్‌షిప్ గురించి సీత వ్యాఖ్యలు చేయగా అవి ప్రేరణ ఖండించింది. ‘‘బయట నుండి ఫ్రెండ్‌షిప్ అనే మాటలు మొదటి నుండి వస్తున్నాయి. అది కొంచెం ఆపేయండి’’ అంటూ వార్నింగ్ ఇచ్చింది. మధ్యలో సీత జోక్యం చేసుకొని ‘‘నీ క్యారెక్టర్‌ను నేను ఏమీ అనలేదు. తప్పుగా మాట్లాడకు’’ అనగా ప్రేరణ మరింత రెచ్చిపోయింది. ‘‘నేను మాట్లాడొచ్చా? తనకు ఎవరైనా చెప్తారా? మధ్యలో మాట్లాడొద్దని నువ్వే చెప్పినప్పుడు నీ మాటకు నువ్వు విలువ ఇవ్వు’’ అని సీరియస్ అయ్యింది.


Also Read: సోనియా, నిఖిల్ మాత్రమే కాదు.. బిగ్ బాస్ హౌజ్‌లో మరో ప్రేమకథ? షో తర్వాత ఆ ఇద్దరు హాలిడేకు ప్లాన్

యాక్టివ్‌గా లేరు

‘‘నీ మాట నాకు నచ్చకపోతే నేను మధ్యలో మాట్లాడతాను’’ అని కూల్‌గా సమాధానమిచ్చింది సీత. మరోసారి వారిద్దరి మధ్య జరిగిన చెత్తకుప్ప గొడవ గురించి గుర్తుచేస్తూ ‘‘చెత్తకుప్ప నీట్‌గా ఉందని అందులో వెళ్లి దూకము కదా’’ అంటూ ప్రేరణను నామినేట్ చేసింది. అభయ్ నవీన్ వచ్చి యాక్టివ్‌గా ఉండడం లేదనే కారణంతో ఆదిత్య ఓంను నామినేట్ చేయగా.. తనను తాను నాగ మణికంఠతో పోల్చుకుంటూ తనకంటే తక్కువ యాక్టివ్‌గా ఉన్నానా అని రివర్స్ ప్రశ్నలు వేశాడు. ‘‘మణికంఠకంటే తక్కువ కాదు.. నా దృష్టిలో మీ ఇద్దరు ఉన్నారు’’ అని అభయ్ సమాధానం చెప్తుండగానే మధ్యలో జోక్యం చేసుకున్న ఆదిత్య.. ‘‘అందరికీ అర్థమయ్యింది’’ అంటూ సైలెంట్ అయిపోయాడు.

మెచ్యురిటీ లేదు

ఆ తర్వాత సోనియా వచ్చి నైనికాను నామినేట్ చేసింది. ‘‘చెత్తకుండి నుండి తీసినా, ఎక్కడ నుండి తీసినా నువ్వు క్లీనింగ్ చేయాల్సిందే’’ అంటూ సీత విషయంలో జరిగినదానికి నైనికాను నామినేట్ చేసింది సోనియా. ‘‘అలా నేను అరవలేదు’’ అని నైనికా చెప్తుండగానే.. ‘‘నువ్వు, నీ టీమ్ ఒక్కటే కదా’’ అని స్టేట్‌మెంట్ ఇచ్చింది. తర్వాత సీతను నామినేట్ చేస్తూ.. ‘‘గేమ్‌కు, పర్సనాలిటీకి సంబంధం లేదంటే అది నీ పర్సనాలిటీ ప్రాబ్లమ్. అది నువ్వు ఇంకా మెరుగుపరుచుకోవాలి. ఆ మెచ్యురిటీ నీకు రావాలి’’ అని భారీ డైలాగులు కొట్టింది సోనియా. అది నచ్చని సీత.. ‘‘నాకు క్లారిటీ ఉందో లేదో నాకు తెలుసు. ముందు నువ్వు గేమ్‌ను అర్థం చేసుకొని ఆ తర్వాత వచ్చి నాకు వివరించు. నీకే క్లారిటీ లేదు’’ అంటూ తనపై అరవడం మొదలుపెట్టింది. ‘బొక్కలో క్లారిటీ’ అనుకుంటూ ముందుకొచ్చింది. అది నచ్చని సోనియా.. ‘‘పిచ్చి మాటలు మాట్లాడకు’’ అంటూ వార్నింగ్ ఇచ్చింది.

Related News

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Mallika Sherawat: బిగ్ బాస్‌లోకి హాట్ బ్యూటి మల్లికా షెరావత్.. అబ్బాయిలు ఇక టీవీ వదలరేమో!

Big Stories

×