BigTV English
Advertisement

Bigg Boss 8 Promo: సోనియా అయినా ఐ డోన్ట్ కేర్.. ఇలా షాకిచ్చేవంటి నిఖిల్ భయ్యా – రంగులు గట్టిగానే పడ్డాయిగా!

Bigg Boss 8 Promo: సోనియా అయినా ఐ డోన్ట్ కేర్.. ఇలా షాకిచ్చేవంటి నిఖిల్ భయ్యా – రంగులు గట్టిగానే పడ్డాయిగా!

Bigg Boss 8 Telugu Latest Promo: బిగ్ బాస్ సీజన్ 8లో మొదటివారం నుండే నామినేషన్స్ చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగుతున్నాయి. మొదటివారంలో ఒకరితో ఒకరికి పెద్దగా పరిచయం లేకపోయినా కూడా చిన్న చిన్న కారణాలతో నామినేట్ చేసుకొని మనస్పర్థలు పెంచుకున్నారు. ఇక రెండోవారం వచ్చేసరికి చీఫ్స్ చేతిలోకి హౌజ్ వెళ్లి, వారు టీమ్స్‌ను సెలక్ట్ చేసుకొని, వారి మధ్య పోటీ జరిగి.. ఇలా చాలా జరిగాయి. అందుకే రెండోవారం నామినేషన్స్ కూడా రెండురోజులు ప్రసారం కావాల్సి వచ్చింది. ఇప్పటికే నామినేషన్స్‌కు సంబంధించిన ఫస్ట్ హాఫ్ పూర్తి కాగా సెకండ్ హాఫ్‌కు సంబంధించిన మొదటి ప్రోమో తాజాగా విడుదలయ్యింది.


డిక్టేటర్ కాదు

తాజాగా విడుదలయిన ప్రోమోలో ముందుగా పృథ్విరాజ్ వచ్చి నాగ మణికంఠను నామినేట్ చేశాడు. ‘‘సర్వైవల్ కోసం నైనికా దగ్గరకు వెళ్లి మీ టీమ్‌లోకి నన్ను తీసుకోండి అని చెప్పావు. మీ చీఫ్‌కు వెన్నుపోటు పొడిచావని అనిపించింది’’ అంటూ తన కారణాన్ని వివరించాడు. ‘‘ఈ గేమ్ మొత్తం సర్వైవల్ గురించే’’ అంటూ తన అభిప్రాయం వ్యక్తం చేశాడు మణికంఠ. ఆ తర్వాత ప్రేరణ వచ్చి నిఖిల్‌ను నామినేట్ చేసింది. ‘‘ఉదయం బ్రేక్‌ఫాస్ట్ మీ టీమ్ ఎందుకు చేయలేదు’’ అని ప్రశ్నించింది. ‘‘ఆ ఒక్కరోజు గురించే నువ్వు మాట్లాడుతున్నావు. దానికి ముందు నుండి కిచెన్ నేనే చూసుకుంటున్నాను. అప్పుడు ఎవరు ఆకలి అనలేదు. నేను డిక్టేటర్ కాదు’’ అని గట్టిగా సమాధానమిచ్చాడు నిఖిల్.


Also Read: నామినేషన్స్‌లో శేఖర్ భాషా, ఆదిత్య ఓం గొడవ.. అతడి మాస్క్ తొలగిపోయినట్టేనా?

చెత్తకుండి గొడవ

మరోసారి చెత్తకుండి విషయాన్ని ప్రస్తావిస్తూ సీతను నామినేట్ చేసింది ప్రేరణ. ‘‘ఊరికే డస్ట్‌బిన్ అంటున్నావు. కానీ అది క్లీన్ ఉంది. అందులో నేను చేయి పెట్టాను. దానిని అంత పెద్ద పాయింట్‌గా చేయడం కరెక్ట్ కాదు’’ అని సీరియస్ అయ్యింది. ‘‘మొన్న మీ టవల్ ఆదిత్య వాడినప్పుడు అదే టవల్ మీరు ఉతుక్కొని వాడుకోవచ్చు కదా. ఎందుకు తన దగ్గరకు వచ్చి అంత గొడవ చేశారు’’ అని కూల్‌గా కౌంటర్ ఇచ్చింది సీత. ‘‘100 మంది నా ముందుకు వచ్చి నువ్వు తప్పు అన్నా కూడా నా హార్ట్‌కు రైట్ అనిపిస్తే అది రైటే’’ అని చెప్పింది. అలా ఇప్పటికీ ప్రేరణ, సీత మధ్య చెత్తకుండి గొడవ ముగిసిపోలేదని నామినేషన్స్ చూస్తే అర్థమవుతోంది.

పర్సనల్స్ ఉంటాయి

ఆ తర్వాత నబీల్ వచ్చి నిఖిల్‌ను చీఫ్‌గా ఫెయిల్ అయ్యావంటూ నామినేట్ చేశాడు. ‘‘ఎంత చీఫ్ అయినా వాళ్ల పర్సనల్స్ వాళ్లకు ఉంటాయి. ఇప్పుడు నాకు, సోనియాకు ఏదో ఉందని వచ్చింది. రేపు ఇంకొకరితో అదే మాట వస్తుంది. నాకు తెలుసు కానీ ఐ డోన్ట్ కేర్’’ అన్నాడు నిఖిల్. ఈ స్టేట్‌మెంట్‌తో సోనియాతో తన క్లోజ్‌నెస్ గురించి ఇతర హౌజ్‌మేట్స్ మాట్లాడుతున్న మాటలకు సమాధానమిచ్చాడు. నైనికా కూడా చీఫ్‌గా ఫెయిల్ అయ్యిందంటూ పృథ్వి తనను నామినేట్ చేశాడు. కానీ తను చీఫ్‌గా చెప్పింది చేశానని నైనికా వాదించింది. మొత్తానికి టాస్కులు గెలిచి ఎక్కువమంది టీమ్‌మేట్స్‌ను సాధించిన యష్మీ మాత్రం రెండోవారం నామినేషన్స్ నుండి కూడా తప్పించుకుంది.

Related News

Bigg Boss 9 Telugu : గౌరవ్ కు గట్టిదెబ్బ… ఇదేందయ్యా ఇదీ… కట్టప్ప కన్నా తనూజా – ఇమ్మాన్యుయేల్ వెన్నుపోటే దారుణం

Bigg Boss 9 Telugu Day 60 : ఇమ్మూను బోల్తా కొట్టించిన రీతూ… తనూజా వల్ల గౌరవ్ కు తీరని అన్యాయం… దివ్య దిక్కుమాలిన ప్లాన్ సక్సెస్

Bigg Boss 9 Madhuri: వాళ్లు రెమ్యునరేషన్‌ ఇచ్చేదేంటి.. నాకే నెలకు కోటి వస్తుంది.. దివ్వెల మాధురి

Bigg Boss 9 Promo: కెప్టెన్సీ వార్‌.. హీటెక్కిన ఆరేంజ్‌ టీం డిస్కషన్‌, తగ్గేదే లే అంటున్న గౌరవ్!

Bigg Boss 9 Promo: సీక్రెట్ టాస్క్.. అడ్డంగా బుక్కైన ఇమ్మూ !

Bigg Boss 9 Telugu : దారుణంగా పడిపోయిన బిగ్ బాస్ ఓటింగ్ రిజల్ట్.. అతనే విన్నర్..?

Bigg Boss Telugu 9 : ఇమ్మూ బట్టతలపై బిగ్ బాస్ పంచులు… ఈ గుడ్డులో గోల ఏందయ్యా మాకు ?

Bigg Boss 9 : ఈ సీజన్ లో అలాంటి వాడు లేడు, కెప్టెన్ కి ఇచ్చి పడేసాడు 

Big Stories

×