Bigg Boss 8 Telugu Latest Updates: బిగ్ బాస్ సీజన్ 8లో రెండోవారం నామినేషన్స్ మొదలయ్యాయి. మొదటివారంలో హౌజ్‌లోని కొందరు కంటెస్టెంట్స్‌కు చీఫ్స్‌గా అర్హత రావడం, మరికొందరు ఆ చీఫ్స్‌ను ఎంచుకొని టీమ్స్‌గా ఫార్మ్ అవ్వడం.. ఇదంతా జరగడంతో ఆ విషయాలను గుర్తుపెట్టుకొని కొందరు కంటెస్టెంట్స్.. ఇతర కంటెస్టెంట్స్‌పై కోపం పెంచుకున్నారు. ఎలాగైనా వారిని నామినేట్ చేయాలని ఫిక్స్ అయ్యారు. నిఖిల్, యష్మీ, నైనికా చీఫ్స్ కావడంతో మొదటివారం నామినేషన్స్ నుండి సేవ్ అయ్యారు. ఈసారి అలా జరగలేదు. యష్మీ టీమ్‌లో ఎక్కువమంది కంటెస్టెంట్స్ ఉండడంతో తను మాత్రమే నామినేషన్స్ నుండి సేవ్ అయ్యింది.
మాస్క్ తొలగింది
ముందుగా సీత వచ్చి నిఖిల్, ప్రేరణను నామినేట్ చేసింది.డ విష్ణుప్రియా సోనియాను నామినేట్ చేస్తూ పాత గొడవను మళ్లీ తెరపైకి తీసుకొచ్చింద. దీంతో ఇద్దరి మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత వచ్చిన అభయ్.. విష్ణుప్రియాను నాగార్జున ఫ్లాప్ చేయడం తనకు ఆశ్చర్యం కలిగించిందని, ఇకపై అలా జరగకుండా ఆటను మెరుగుపరచుకోవడం కోసం నామినేట్ చేస్తున్నానని చెప్పాడు. ఆ తర్వాత ఆదిత్య ఓంను నామినేట్ చేస్తూ తను హౌజ్‌లో యాక్టివ్‌గా లేడని వ్యాఖ్యలు చేశాడు. అయితే తాను ఎలాంటివాడో, ఎలా ఉంటాడో తన ఫ్యామిలీకి తెలుసని మొదటిసారి నోరు తెరిచి గట్టిగా మాట్లాడాడు ఆదిత్య ఓం. ఆ తర్వాత పలువురు ఇదే విషయంపై తనను నామినేట్ చేయగా.. ఇన్నిరోజులు బిగ్ బాస్ హౌజ్‌లో తాను పెట్టుకున్న మాస్క్ తొలగిపోయి మామూలుగా మాట్లాడాడు.
Also Read: పృథ్వితో సోనియా పర్సనల్ ముచ్చట్లు.. మూడు నెలలు నన్ను ప్రేమించు అంటూ విష్ణుప్రియా డైరెక్ట్ ప్రపోజల్
ఫ్రెండ్స్ అయినా కూడా
నాగ మణికంఠ వచ్చి కూడా ఆదిత్య ఓంనే నామినేట్ చేశాడు. ఇప్పటివరకు తను హౌజ్‌లో అందరితో మంచిగా ఉంటున్నాడని, ఎవరి దగ్గర నెగిటివ్‌గా మాట్లాడడం లేదని చెప్తూనే.. ఇదంతా తన నిజమైన పర్సనాలిటీ కాకపోయిండొచ్చని అన్నాడు. ఇదంతా విన్న ఆదిత్య ఓం.. మంచిగా ఉన్నానని చెప్పడం వల్ల తనకు మంచి ప్రమోషన్ జరిగిందని, ఇదంతా తనకు ప్రోమోలాగా ఉందని వ్యంగ్యంగా సమాధానమిచ్చాడు. ఆ తర్వాత తాను వచ్చి అభయ్, శేఖర్ భాషాను నామినేట్ చేశాడు. శేఖర్ భాషా, ఆదిత్య ఓం.. హౌజ్‌లో చాలా క్లోజ్‌గా ఉంటారు. ఎప్పుడూ ఒకరినొకరు ఫ్రెండ్స్ అనుకుంటూ ఉంటారు. అయినా ఆదిత్య ఓం మాత్రం సందర్భం వచ్చిన ప్రతీసారి శేఖర్ భాషా గురించి నెగిటివ్‌గానే మాట్లాడుతున్నాడు.
డబ్బు కావాలి
నామినేషన్స్‌లో శేఖర్ భాషా పేరు చెప్పిన ఆదిత్య ఓం.. తను చాలా అజాగ్రత్తగా ఉంటున్నాడని, నిర్లక్ష్యంగా ఉంటున్నాడని కారణాలు చెప్పాడు. అసలు తనకు బిగ్ బాస్ అంటే గౌరవమే లేదన్నట్టు మాట్లాడాడు. అయినా కూడా శేఖర్ భాషా పెద్దగా వాదించలేదు. తర్వాత తానే వచ్చి ఆదిత్య ఓంను నామినేట్ చేశాడు. తనతో మంచి ఉంటూ వెన్నుపోటు పొడిస్తే ఆడియన్స్‌లో తను చెడ్డపేరు వస్తుందని ఆదిత్యకు సలహా ఇచ్చాడు. అయినా అది వినిపించుకోని ఆదిత్య.. తనకు 48 ఏళ్లు అని, ఆ వయసులో తన ఫ్యామిలీని వదిలేసి వచ్చానని, బిగ్ బాస్ ప్రైజ్ మనీ తన ఫ్యామిలీకి, తను చేసే సమాజ సేవకు ఉపయోగపడుతుందని చెప్పుకొచ్చాడు. నామినేషన్స్ తర్వాత శేఖర్ భాషాను ఆదిత్య ఓం హగ్ చేసుకొని ముద్దు కూడా పెట్టుకున్నాడు.