BigTV English

Bigg Boss 8 Telugu : ఏంటి విష్ణు తండ్రితో ఆ మాటలు.. ప్రేరణకు షాకిచ్చిన భర్త.. ఇది కదా ట్విస్ట్..

Bigg Boss 8 Telugu : ఏంటి విష్ణు తండ్రితో ఆ మాటలు.. ప్రేరణకు షాకిచ్చిన భర్త.. ఇది కదా ట్విస్ట్..

Bigg Boss 8 Telugu : వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటి షో బిగ్ బాస్ గురించి ఎంత చెప్పిన తక్కువే.. తెలుగు ప్రస్తుతం 8 వ సీజన్ ప్రసారం అవుతుంది. ఇప్పటికే 10 వారాలు పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు 11 వారం నామీనేషన్ ప్రక్రియను పూర్తి చేసుకుంది. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారా అని ఆడియన్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. అయితే ఈ వారం ఫ్యామిలీ వీక్ సందడి బిగ్ బాస్ లో కొనసాగితుంది. హౌస్ లోని హౌస్ మేట్స్ ఒక్కొక్కరికి సంబందించిన ఫ్యామిలీ మెంబర్స్ బిగ్ బాస్ లోకి వచ్చి సందడి చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది వచ్చారు. నిన్నటి ఎపిసోడ్ లో ఎవరి పేరెంట్స్ వచ్చారో ఇప్పుడు తెలుసుకుందాం..


బిగ్ బాస్ సీజన్ 8 ఫ్యామిలీ వీక్‌లో భాగంగా నిన్నటి ఎపిసోడ్ లో ముగ్గురు గెస్టులు హౌస్‌లోకి అడుగుపెట్టారు. ముందుగా విష్ణుప్రియ తండ్రి మోహన్ హౌస్‌ లోకి వచ్చారు. చాలా పద్ధతిగా, నీటిగా సూటిగా ఆయన మాట్లాడిన మాటలు గుండెలకి హత్తుకునేలా ఉన్నాయి. అయితే ఎవరు ఎన్ని చెప్పినా వినేవాడికి వినే ఆసక్తి లేకపోతే ఎవరూ ఏం చేయలేరు అన్నట్లుగా తయారైంది విష్ణుప్రియ. బయట అంత ఫ్యాన్ బేస్ ఉంచుకొని.. హౌస్‌లో కి వచ్చింది కప్పు కోసం అనే దృష్టి కూడా లేకుండా పృథ్వీయే సర్వశ్వం అంటూ పృథ్వీ అంటే ఎంత పిచ్చి అన్నది తండ్రితో డైరెక్ట్ గా చెప్పేసింది. అది విన్న ఆమె ఫాదర్ సైతం షాక్ అయ్యారు.

ఆ తర్వాత ఒంటరిగా మాట్లాడిన విష్ణు ఫాదర్ ఇండైరెక్ట్ గా పృథ్విని వదిలేసి నీ ఆటను ఆడు అని సలహా ఇస్తాడు. కానీ విష్ణు మాత్రం వినలేదు.. ఇక హౌస్ మేట్స్ అందరితో ఆయన ముచ్చటించారు. మా అమ్మాయి చూసుకున్నా ఇక్కడ జరిగేవన్నీ ఊరికే.. కామన్ ఇవన్నీ ఉండవుకదా.. అంటూ హౌస్‌లో లవ్ ట్రాక్‌ గురించి అన్నారు. దీనికి తెలీదు చెప్పలేం.. అంటూ విష్ణు అంటే అయితే ఓకే.. మీకు ఏం ప్రాబ్లమ్ లేకపోతే నాకు ఓకే అంటూ చెప్పారు. మొత్తానికి ఫాదర్ అండ్ డాటర్ బాండింగ్ అనేది ఆకట్టుకుంది.


ఇక చివరగా.. ప్రేరణ తన భర్త వస్తాడని బాగా రెడీ అయ్యి ఉంటుంది. దాదాపు అందరి ఫ్యామిలీ వచ్చేశారు.. ఇక తన భర్త శ్రీపద్ వస్తాడంటూ ఎదురూచూసింది. ఇంతలో టీవీలో వీడియో ప్లే చేశాడు బిగ్‌బాస్. అందులో ప్రేరణ భర్త వీడియోలో మాట్లాడారు. హై పుట్టు ఎలా ఉన్నావ్.. రెండు నెలలు అయిపొయింది. నీకోసం హౌస్ లోకి ఎప్పుడు వద్దామని అనుకున్న కూడా ఏదొక పని పడుతుంది. నువ్వు ట్రోపీ అందుకునే సమయానికి అయితే నేను వచ్చేస్తాను మాట ఇస్తున్నా అని అంటాడు. దానికి ప్రేరణ తిట్టుకుంటుంది. రేపటి ఎపిసోడ్ లో ఎవరు వచ్చి సందడి చేస్తారో చూడాలి.. ఏది ఏమైన ఈ వీక్ లో ఫ్యామిలీ వీక్ కాన్సెఫ్ట్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

Tags

Related News

Bigg Boss 9 Telugu: డబుల్ హౌస్.. డబుల్ డోస్..బిగ్ ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్

Monal Gajjar : బిగ్ బాస్ బ్యూటీ మోనాల్ గుర్తుందా.? ఇప్పుడేం చేస్తుందో తెలుసా..?

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Big Stories

×