E-Paper
Advertisement

Bigg Boss 8 Telugu: ‘బిగ్ బాస్’ హౌజ్‌లో దొంగ ఏడుపులు.. విష్ణుప్రియా చీప్, మరోసారి నోరుజారిన సోనియా

Bigg Boss 8 Telugu: ‘బిగ్ బాస్’ హౌజ్‌లో దొంగ ఏడుపులు.. విష్ణుప్రియా చీప్, మరోసారి నోరుజారిన సోనియా
Advertisement

Bigg Boss 8 Telugu Latest Updates: బిగ్ బాస్ రియాలిటీ షోలో కంటెస్టెంట్స్ మధ్య ఏర్పడే కనెక్షన్స్ నిజమని నమ్మడం ప్రేక్షకులకు చాలా కష్టం. ఆ హౌజ్‌లో గొడవలు ఉన్నంత నేచురల్‌గా కనెక్షన్స్ అనిపించవు. అలా తాజాగా ప్రసారమయిన ఎపిసోడ్‌లో ఒకరు కాదు, ఇద్దరు కాదు.. హౌజ్ అంతా కలిసికట్టుగా ఇద్దరు మనుషుల గురించి బాధపడడం నమ్మశక్యంగా అనిపించలేదు. పైగా తిండి కోసం హౌజ్‌లో దొంగతనాలు మొదలయ్యాయి. కడుపునిండా తిండి ఉన్నా కూడా వేరే టీమ్స్ సంపాదించుకున్న రేషన్‌పై కన్నేయడం మాత్రమే కాకుండా కక్కుర్తి గేమ్ ఆడడం మొదలుపెట్టారు. అంతే కాకుండా మరోసారి సోనియా మొసలి కన్నీళ్లు కార్చడంతో పాటు విష్ణుప్రియా గురించి నోరుజారింది.

టీమ్ మార్చింది

Advertisement

బిగ్ బాస్ 8లో నైనికా, యష్మీ, నిఖిల్ టీమ్స్ మధ్య రేషన్ కోసం పోటీ మొదలయ్యింది. నైనికా, యష్మీ టీమ్స్‌కు న్యాయం జరిగినా నిఖిల్ టీమ్‌కే రేషన్‌ విషయంలో అన్యాయం జరిగింది. నిఖిల్, నాగ మణికంఠకు కనీసం ఫుడ్ ఇవ్వకుండా వారం రోజుల పాటు రాగి జావా, పచ్చి కూరగాయలు తింటూ బ్రతకమని ఆదేశించారు బిగ్ బాస్. దీంతో వారికి అన్యాయం జరిగిందని ముందుగా సోనియా ఫీల్ అయ్యి ఏడుపు మొదలుపెట్టింది. తన కన్నీళ్లకు కరిగిపోయిన నిఖిల్, పృథ్వి.. ఒకరి తర్వాత ఒకరు వచ్చి తనను ఓదార్చడం మొదలుపెట్టారు. రేషన్ రానందుకు తామే ఫీల్ అవ్వడం లేదని నిఖిల్ అన్నాడు. ఎప్పుడూ నిఖిల్‌తో క్లోజ్‌గా ఉండే సోనియా.. పార్టీ మార్చి పృథ్విరాజ్‌తో పులిహోర కలపడం మొదలుపెట్టింది.

Also Read: నిఖిల్‌ను ఎమోషనల్ ఫూల్ చేసిన సోనియా.. మధ్యలో మణికంఠ బలి, వారమంతా అదే తిని బ్రతకాలా?

Advertisement

అందరి ఏడుపు

రేషన్ కోసం రెండో రౌండ్ పోటీ ముగిసిన తర్వాత కూడా నిఖిల్ టీమ్‌కు అన్యాయమే జరిగింది. సంచాలకురాలిగా వ్యవహరించిన యష్మీ.. నైనికా టీమ్ గెలిచినట్టుగా ప్రకటించింది. ఆ తర్వాత తన నిర్ణయానికి తానే ఫీల్ అయ్యి మణికంఠను పట్టుకొని ఏడ్చేసింది. సీత కూడా రేషన్‌ను పంచుకుంటామని ఏడుస్తూ బిగ్ బాస్‌ను ప్రాధేయపడింది. అలా తాజాగా ప్రసారమయిన ఎపిసోడ్‌లో కంటెస్టెంట్స్ అంతా దొంగ ఏడుపులు ఏడ్చారు. అంతా ముగిసిన తర్వాత గెలిచినా కూడా యష్మీ, నైనికా టీమ్స్ పోటాపోటీగా దొంగతనాలు చేయడం మొదలుపెట్టాయి. చికెన్, టీ పౌడర్, చక్కెర.. ఇలా అన్నింటిని ఒక టీమ్ నుండి మరొక టీమ్ దొంగతనం చేశాయి.

రెచ్చగొడతారు

రేషన్ కోసం జరిగిన టాస్కుల్లో నైనికా టీమ్‌కు కూడా కొన్ని జ్యూస్ బాటిల్స్ దక్కాయి. యష్మీ టీమ్‌ను ఏడిపించడం కోసం ఒక జ్యూస్ బాటిల్ తీసుకొని వారి ముందే తిరుగుతూ తనకు దిష్టి తాకకూడదు అంటూ వ్యంగ్యంగా మట్లాడింది విష్ణుప్రియా. దీంతో యష్మీ, ప్రేరణ కలిసి తన వెంటపడ్డారు. వారిని తప్పించుకొని బెడ్‌రూమ్‌లోకి వెళ్లి డోర్ పెట్టుకొని జ్యూస్ తాగడం మొదలుపెట్టింది విష్ణుప్రియా. ఇదంతా గమనిస్తున్న అభయ్, సోనియా.. దీని గురించే మాట్లాడుకున్నారు. ప్రేరణ, విష్ణుప్రియా.. ఇద్దరూ మనుషులను రెచ్చగొట్టడంలో నిపుణులు అని సోనియా చెప్పింది. అయితే ప్రేరణ మాత్రం కొంచెం తెలివైనదని, విష్ణుప్రియా మాత్రం మనుషులను చీప్‌గా రెచ్చగొడుతుందని మరోసారి తనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసింది.

Related News

బిగ్ బాస్10 హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ తనేనా?

బిగ్ బాస్ హౌస్ లోకి గుండెనిండా గుడి గంటలు హీరో.. ఈ ట్విస్ట్ ఏందీ బాలు..వీడియో వైరల్!

బిగ్ బాస్ 10 లాంచింగ్ ఎపిసోడ్… చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో!

న్యూ చాప్టర్ బిగిన్స్.. బిగ్ బాస్ 10 ఎంట్రీ పై జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ!

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

Big Stories

Advertisement
×