BigTV English

Bigg Boss 8 Telugu Finale: షేర్ ఓడిపోయింది.. పల్లవి ప్రశాంత్ రికార్డ్ బ్రేక్ చేయలేకపోయిన నబీల్

Bigg Boss 8 Telugu Finale: షేర్ ఓడిపోయింది.. పల్లవి ప్రశాంత్ రికార్డ్ బ్రేక్ చేయలేకపోయిన నబీల్

Bigg Boss 8 Telugu Finale: బిగ్ బాస్ సీజన్ 8లోకి ఒక కామన్ మ్యాన్‌గా అడుగుపెట్టాడు నబీల్. తను ఒక యూట్యూబర్ అయినా కూడా చాలామంది ప్రేక్షకులకు నబీల్ ఎవరో తెలియదు. అయినా కూడా బిగ్ బాస్ హౌస్‌లో అడుగుపెట్టినప్పటి నుండి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకున్నాడు. తన స్పీడ్ చూసి పల్లవి ప్రశాంత్‌లాగా ఒక కామన్ మ్యాన్‌లాగా హౌస్‌లోకి వచ్చి విన్నర్ అవుతాడేమో అని చాలామంది ప్రేక్షకులు అనుకున్నారు. తను ఎవరో తెలియకపోయినా కూడా ఎన్నిసార్లు నామినేషన్స్‌లోకి వచ్చినా తనను సపోర్ట్ చేశారు. కానీ గత కొన్ని వారాలుగా లెక్కలు మారాయి. అలా టాప్ 5కు చేరుకున్న నబీల్.. టాప్ 3వ కంటెస్టెంట్‌గా బయటికి వచ్చేశాడు.


వారితో పోటీ

బిగ్ బాస్ 8లో శారీరికంగా బలంగా ఉన్న కంటెస్టెంట్ ఎవరు అంటే చాలామందికి నిఖిల్, పృథ్వి పేరే ముందుగా గుర్తొస్తుంది. కానీ వాళ్లను కూడా పలు టాస్కుల్లో ఓడించాడు నబీల్. అలా నబీల్ సత్తా ఏంటో ప్రేక్షకులకు తెలిసింది. పైగా ఎవరితో అయినా మాట్లాడుతున్నప్పుడు కూడా బెదరని తన మనస్తత్వం చాలామందికి నచ్చింది. అలా నబీల్‌కు మొదట్లో చాలానే ఓట్లు పడ్డాయి. కానీ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ బిగ్ బాస్‌లోకి ఎంటర్ అయిన తర్వాత నబీల్ ప్రవర్తన మారిపోయింది. తన ఆటతీరులో మార్పు వచ్చింది. మెల్లగా ఓట్ల విషయంలో కింద పడిపోతూ వచ్చాడు. అయినా కూడా సక్సెస్‌ఫుల్‌గా టాప్ 5 వరకు చేరుకోగలిగాడు నబీల్.


Also Read: బిగ్ బాస్ ఫినాలే ఇప్పుడు లేనట్టే.. మరో రెండు వారాలు హౌస్‌లోనే..

అయినా గ్రేటే

కంటెస్టెంట్స్ అందరి సపోర్ట్‌తో నబీల్‌కు ఎలిమినేషన్ షీల్డ్ వచ్చింది. దానిని కూడా తను అవినాష్‌కే ఇచ్చేశాడు. తాను హౌస్‌లో నుండి ఎలిమినేట్ అవుతానని నబీల్ ఎప్పుడూ భయపడలేదు. ముఖ్యంగా నామినేషన్స్‌లో తను వాదించే తీరు చాలామందిని ఇంప్రెస్ చేసింది. మొదట్లో ఆడినట్టుగానే తన ఆటను నబీల్ కంటిన్యూ చేసుకుంటే కచ్చితంగా పల్లవి ప్రశాంత్‌లాగానే మరొక కామన్ మ్యాన్ బిగ్ బాస్ విన్నర్ అయ్యిండేవాడు. ఆ రికార్డును బ్రేక్ చేసేవాడు. కానీ అలా జరగలేదు. అయినా తన ఆటతీరుతో ఒక కామన్ మ్యాన్‌గా వచ్చిన నబీల్.. టాప్ 5కు చేరుకోవడం కూడా గ్రేటే అని తన ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. బిగ్ బాస్ నుండి బయటికి వచ్చిన తర్వాత నబీల్ కూడా అదే మాట చెప్పాడు.

డబ్బు వద్దు

టాప్ 3 కంటెస్టెంట్స్‌కు ఒక సూట్‌కేస్ చూపించి అందులో ఎంత డబ్బు ఉన్న తమకే అని, అది తీసుకొని బయటికి వెళ్లిపోతారా అంటూ అడిగారు నాగార్జున. కానీ అది తీసుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేరు. నబీల్‌ను తీసుకుంటావా అని అడిగినప్పుడు కూడా తాను అదే సమాధానం చెప్పాడు. ఆ సూట్‌కేస్ తీసుకోనందుకు తనకు ఏం బాధగా లేదని, తాను డబ్బు కోసం రాలేదన్నాడు నబీల్. రెండు తెలుగు రాష్ట్ర ప్రజల ప్రేమ కోసమే బిగ్ బాస్‌లోకి వచ్చానని, అలా తనకు గుర్తింపు లభించిందని సంతోషం వ్యక్తం చేశాడు. మొత్తానికి ఒక మామూలు యూట్యూబర్‌గా బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన నబీల్.. ఎంతో ఫ్యాన్ బేస్ సంపాదించుకొని తిరిగి వెళ్తున్నాడు.

Related News

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Big Stories

×