BigTV English
Advertisement

Bigg Boss 8 Telugu: వెళ్లిపోయే ముందు నిఖిల్‌పై ప్రేమను బయటపెట్టిన సీత.. అందరి ముందు డైరెక్ట్ ప్రపోజల్

Bigg Boss 8 Telugu: వెళ్లిపోయే ముందు నిఖిల్‌పై ప్రేమను బయటపెట్టిన సీత.. అందరి ముందు డైరెక్ట్ ప్రపోజల్

Bigg Boss 8 Telugu Elimination: బిగ్ బాస్ సీజన్ 8 తెలుగులో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వచ్చిన తర్వాత మొదటి వారం పూర్తయ్యింది. ఎనిమిది మంది వైల్డ్ కార్డ్స్, ఎనిమిది మంది పాత కంటెస్టెంట్స్ హౌస్‌లో ఉండగా.. అందులో నుండి ఒకరు ఎలిమినేట్ అయ్యారు. తనే కిర్రాక్ సీత. అసలు సీత ఎలిమినేట్ అవుతుందని చాలామంది ఊహించలేదు. కొందరు కంటెస్టెంట్స్‌తో పోలిస్తే సీతకు బయట అంతగా నెగిటివిటీ లేదు. కానీ చీఫ్ అవ్వడం వల్ల తన ఆటతీరే మారిపోయింది. అదే బయట ప్రేక్షకులకు తనపై ఉన్న అభిప్రాయాన్ని చాలావరకు మార్చేసింది. మొత్తానికి హౌస్‌లో నుండి వెళ్లిపోతూ నిఖిల్‌పై తనకు ఉన్న ప్రేమను డైరెక్ట్ ప్రపోజల్‌తో బయటపెట్టింది సీత.


నిఖిల్ అంటే ఇష్టం

ముందుగా ఒక యూట్యూబర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది సీత. అలా తన పేరు సీత నుండి కిర్రాక్ సీతగా మారింది. బోల్డ్ కంటెంట్‌తో యూట్యూబ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. మెల్లగా తనకు సినిమాల్లో కూడా అవకాశాలు రావడం మొదలయ్యింది. ‘బేబీ’ సినిమాలో విలన్‌గా నటించడంతో తన లైఫే టర్న్ అయిపోయింది. దానివల్లే తనకు ఇప్పుడు బిగ్ బాస్ అవకాశం కూడా వచ్చింది. బిగ్ బాస్ సీజన్ 8లో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన తర్వాత అసలు సీత అంటే ఎలా ఉంటుందో అందరికీ తెలిసింది. శేఖర్ భాషా, అభయ్ లాంటి వాళ్లను తన సొంత అన్నయ్యలు అనుకున్న సీత.. నిఖిల్‌పై మాత్రం ప్రత్యేకమైన ఇష్టాన్ని పెంచుకుంది.


Also Read: ‘బిగ్ బాస్’ నుండి గాడిద ఎలిమినేట్.. మొత్తానికి వారి పంతం నెగ్గిందిగా!

అలాంటి ప్రేమ దొరకాలి

నిఖిల్‌పై సీతకు ప్రత్యేకమైన ఇష్టం ఉంది అనేది బిగ్ బాస్ హౌస్‌లో అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్. అయితే బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయ్యే సమయంలో నిఖిల్‌కు వైట్ హార్ట్ ఇచ్చి తను ఒక పర్ఫెక్ట్ హస్బెండ్ మెటీరియల్ అని చెప్పింది సీత. చివర్లో ఐ లవ్ యూ అని కూడా చెప్పేసింది. ఇక సీత వెళ్లిపోతుందని హౌస్‌లో తన బెస్ట్ ఫ్రెండ్ అయిన విష్ణుప్రియా ఏడవడం మొదలుపెట్టింది. ‘‘మీ అమ్మను మర్చిపోయే ప్రేమ నీకు దొరకాలి అని నేను కోరుకుంటున్నాను. ఈరోజు ఆ కృష్ణుడే నాతో ఈ మాటలు మాట్లాడిస్తున్నాడు’’ అంటూ విష్ణుప్రియా కోరిక తీరాలంటూ కోరుకుంది సీత. బిగ్ బాస్ అంటే రియాలిటీ షో అని, ఇందులో రియల్‌గా ఉండే వ్యక్తులే గెలవాలని, తాను నబీల్ గెలవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని చెప్పింది.

నువ్వే ఎక్కువ ఏడుస్తున్నావు

బిగ్ బాస్ 8లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా వచ్చినవారిలో అవినాష్ కూడా ఒకడు. అవినాష్ వచ్చిన తర్వాత తనలో జోష్ వచ్చిందని, హౌస్‌కు కూడా పాజిటివ్ వైబ్స్ వచ్చాయని ప్రశంసించింది సీత. ఇక నయని పావని గురించి మాట్లాడుతూ.. ‘‘నన్ను క్రై బేబీ అని నామినేట్ చేశావు. కానీ ఈవారం రోజుల్లో నువ్వే ఎక్కువగా ఏడ్చావు. నీకు గెలవాలనే ఉత్సాహం చాలా ఉంది. దాంతోనే ముందుకు వెళ్లు. గత సీజన్ కంటే ఎక్కువ రోజులు నువ్వు ఈ హౌస్‌లో ఉండాలని కోరుకుంటున్నాను’’ అని సలహా ఇచ్చింది. మొత్తానికి అందరి చేత గుడ్ అనిపించుకునే బయటికి వెళ్లిపోయింది సీత. తను చీఫ్‌గా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాల వల్లే తాను ఎలిమినేట్ అయ్యిందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.

Related News

Bigg Boss 9: ఏడుపుగొట్టు చెత్తను బయటకు తోసేయండి, లైవ్ చూడలేకపోతున్నాం

Bigg Boss 9: ఇన్ సెక్యూరిటీ లోకి పోయి గేమ్ పాడు చేసుకుంటున్నా ఇమ్మానియేల్

Bigg Boss 9 Telugu Day 61 : రీతూ బంగారంరా… తనూజాపై అంత కక్షగట్టేశావ్ ఏంటి దివ్య? నక్కతోక తొక్కిన ఇమ్మూ

Bigg Boss 9 Telugu : ఇమ్మూనా మజాకా? బిగ్ బాస్ చరిత్రలోనే బిగ్గెస్ట్ రికార్డ్… కానీ ఆ బుర్ర తక్కువ పనే మైనస్ మావా

Bigg Boss 9: చివరిలో చేజారిన తనూజ కెప్టెన్సీ.. అతడే కొత్త కెప్టెన్!

Bigg Boss 9 Telugu : బిగ్ బాస్ లో ఉండటం ఆ కంటెస్టెంట్ కు ఇష్టం లేదా..? ఈ వారం ఇతనే ఎలిమినేట్..?

Bigg Boss 9 Promo: రీతూ Vs దివ్య.. చిచ్చుపెట్టిన సాయి!

Bigg Boss 9 Telugu : గౌరవ్ కు గట్టిదెబ్బ… ఇదేందయ్యా ఇదీ… కట్టప్ప కన్నా తనూజా – ఇమ్మాన్యుయేల్ వెన్నుపోటే దారుణం

Big Stories

×