BigTV English

Mangalavaram : పాయల్ మూవీకి తగ్గని క్రేజ్.. మరోసారి అక్కడ రిలీజ్..

Mangalavaram : పాయల్ మూవీకి తగ్గని క్రేజ్.. మరోసారి అక్కడ రిలీజ్..

Mangalavaram : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎటువంటి అంచనాలు లేకుండా థియేటర్లలోకి వచ్చి సరికొత్త రికార్డ్ ను సొంతం చేసుకున్న మూవీ ఆరెక్స్ 100.. డైరెక్టర్ అజయ్ భాపతి.. మొదటి సినిమాతోనే టాలీవుడ్‌లో ఓ సంచలనం సృష్టించాడు డైరెక్టర్. ఆ సినిమా ఒక్కసారిగా యూత్ ఫెవరెట్ అయ్యింది. బాక్సాఫీస్ రికార్డులు బ్రేక్ చేస్తూ మంచి వసూళ్లను అందుకుంది. పాయల్ రాజ్ పుత్ కు ఒక్క సినిమాతో మంచి క్రేజ్ ను అందుకుంది. ఇక ఆ చిత్ర డైరెక్టర్ ఆ తర్వాత తెరకెక్కించిన ‘మహా సముద్రం’ ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా మంచి మార్కులు పడ్డాయి.. ఆ సినిమా తర్వాత వరుస సినిమాలు లైన్లో పెట్టాడు కానీ ఒక్క సినిమా కూడా సెట్స్ మీదకు వెళ్లలేదు. రీసెంట్ గా మంగళవారం సినిమాతో హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ మూవీ వచ్చి ఏడాది అయ్యింది. కానీ ఇప్పటికి ఈ మూవీ క్రేజ్ అయితే తగ్గలేదు అని తెలుస్తుంది. మరోసారి ఓటీటిలోకి ఎంట్రీ ఇవ్వబోతుందని సమాచారం..


గతేడాదిలో విడుదలైన ‘మంగళవారం’ మూవీ విమర్శకుల ప్రశంసలతో పాటు పలు అవార్డులను సొంతం చేసుకుంది.. ఈ మూవీ గతేడాది డిసెంబర్‌లోనే ఐదు భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్‍కు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరో భాషలో మరో ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చేసింది. తాజాగా ఈ మూవీ మరో ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు రాబోతుంది. జియో సినిమా ఓటీటీలో రాబోతుంది. 11 నెలల తర్వాత హిందీ వర్షన్ అందుబాటులోకి వచ్చింది. దీంతో బాలీవుడ్ ప్రేక్షకులకు సైతం మంగళవారం మూవీ చూసే ఛాన్స్ దక్కింది. తెలుగులో బ్లాక్‌ బస్టర్ హిట్‌గా నిలిచిన మంగళవారం మూవీ హిందీ ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాల్సిందే.

ఇక ఈ మూవీలో పాయల్ రాజ్‍పుత్‍తో పాటు అజ్మల్ అమీర్, నందిత శ్వేత, రవీంద్ర విజయ్, దివ్య పిళ్లై, అజయ్ ఘోష్, కృష్ణ చైతన్య కీలకపాత్రలు పోషించారు.. ఇక పాయల్ కు తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. ఇక వేరే భాషల్లో ఈ అమ్మడు వరుస సినిమాల్లో బిజీగా సినిమాలు చేస్తుంది. ఇక మంగళవారం 2 ను అనౌన్స్ చేసిన డైరెక్టర్ అజయ్ భూపతి మరో సినిమాను లైన్లో పెట్టుకున్నాడు. ధృవ్ విక్రమ్ ఓ భారీ సినిమా చేయనున్నారు. తెలుగుతో పాటు తమిళ భాషల్లో ఈ సినిమా తెరకెక్కనుంది.. ఆ మూవీ తర్వాత ఈ మూవీని సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు డైరెక్టర్ అజయ్ భూపతి.. ఈ మంగళవారం 2 లో ప్రముఖ స్టార్స్ ను దించబోతున్నారని టాక్.. మరి ఎవరిని దించబోతున్నారో, ఎప్పుడు సినిమా స్టార్ట్ అవుతుంది? ఎప్పుడు రిలీజ్ అవ్వబోతుందో చూడాలి…


 

Related News

OTT Movie : భార్యకు తెలియకుండా మరో అమ్మాయితో… కూతురు కూడా తండ్రితో చేతులు కలిపి ఇదేం దిక్కుమాలిన పనిరా అయ్యా ?

OTT Movie : వదిన మీద కన్నేసే మరిది… ఈ క్రైమ్ డ్రామాలో అలాంటి సీన్లే హైలెట్ మావా… సింగిల్ గా చూడాల్సిన సిరీస్

OTT Movie : రాయల్ ఫ్యామిలీ అని మాయ చేసే కేటుగాడు… నిజాం రింగ్ చుట్టూ తిరిగే స్టోరీ… తెలుగులోనే స్ట్రీమింగ్

OTT Movie : వరుసగా 9 హత్యలు… చంపి గోడలపై వింత రాతలు… హింట్ ఇస్తూ పోలీసులను పరుగులు పెట్టించే సైకో

OTT Movies : శుక్రవారం ఓటీటీలోకి 18 సినిమాలు.. వాటిని మిస్ చెయ్యకండి..

OTT Movie : ఇంట్లోనే శవమై కన్పించే జడ్జ్… ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్… ఊహించని మలుపులున్న ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్

Big Stories

×