BigTV English

Bigg Boss 8 Telugu Promo: వేస్ట్ కంటెస్టెంట్స్.. పృథ్వి vs మణికంఠ

Bigg Boss 8 Telugu Promo: వేస్ట్ కంటెస్టెంట్స్.. పృథ్వి vs మణికంఠ

Bigg Boss 8 Telugu Latest Promo: బిగ్ బాస్ సీజన్ 8లో ప్రస్తుతం ఓవర్ స్మార్ట్ ఛార్జర్స్ వర్సెస్ ఓవర్ స్మార్ట్ ఫోన్స్ అనే టాస్క్ నడుస్తోంది. అందులో ఓజీ టీమ్ అంతా ఓవర్ స్మార్ట్ ఛార్జర్స్ పాత్ర పోషిస్తుండగా.. రాయల్స్ టీమ్ అంతా ఓవర్ స్మార్ట్ ఫోన్స్‌లాగా మారిపోయారు. ఈ టాస్క్ ప్రారంభమయ్యి ఇప్పటికీ ఒకరోజు పూర్తయ్యింది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ మొత్తం రాయల్స్ ఆధీనంలో ఉంది. కేవలం గార్డెన్ ఏరియా మాత్రమే ఓజీ టీమ్‌కు ఇచ్చారు బిగ్ బాస్. దీంతో ఓజీ టీమ్ అంతా అక్కడే పడుకోవడానికి సిద్ధపడ్డారు. అదే సమయంలో ఒక్కసారిగా పృథ్వి, మణికంఠ మధ్య గొడవ మొదలయ్యింది. పృథ్విపై ఉన్న కోపం అంతా ఒకేసారిగా బయటపెట్టేశాడు మణికంఠ.


తేజ ఆఫర్

టేస్టీ తేజ నిమ్మకాయ పులిహోరను తీసుకొచ్చి ఓజీ టీమ్‌కు నోరూరించే ప్రయత్నం చేయడంతో బిగ్ బాస్ ప్రోమో మొదలవుతుంది. ‘‘టేస్టీ తేజ చేసిన నిమ్మకాయ పులిహోర. ఇది కేవలం మూడు పాయింట్స్ మాత్రమే’’ అని ఆఫర్ ఇచ్చాడు తేజ ‘‘3 పాయింట్స్‌తో పాటు బాత్రూమ్ యాక్సెస్ కూడా ఇవ్వాలి’’ అని బేరం మొదలుపెట్టాడు నిఖిల్. దానికి రాయల్స్ ఒప్పుకోకపోవడంతో వద్దులే అని సైలెంట్ అయిపోయాడు. ‘‘నాకు తెలిసిన కంటెస్టెంట్స్‌లో వేస్ట్ వీళ్లే. అసలు ఆడరేంటి?’’ అంటూ మెహబూబ్.. తన టీమ్‌మేట్స్‌తో జోకులు వేసుకున్నాడు. అప్పుడే గార్డెన్ ఏరియాలో మణికంఠకు, పృథ్వికి మధ్య డిస్కషన్ మొదలయ్యింది.


Also Read: బిగ్ బాస్‌లో ఉన్నంత వరకు ఆ పని చేయను.. కంటెస్టెంట్స్ కోసం నబీల్ త్యాగం

పైనుండి దిగొచ్చావా

‘‘మెచ్యుర్‌గా ఉండమని చెప్పావు. దాని అర్థమేంటి’’ అంటూ టాపిక్ మొదలుపెట్టాడు పృథ్వి. ‘‘నాకు గొడవపెట్టుకోవాలని లేదు’’ అంటూ టాపిక్‌ను మొదట్లోనే ఆపేద్దామనుకున్నాడు మణికంఠ. తనకు కూడా గొడవపెట్టుకోవాలని లేదని కానీ అసలు ఆ మాట ఎందుకు అన్నావో చెప్పమని ఒత్తిడి తీసుకొచ్చాడు పృథ్వి. ‘‘ఎన్నిసార్లు చెప్పాలి నీకు?’’ అంటూ గట్టిగా మాట్లాడడం మొదలుపెట్టాడు మణికంఠ. అలా మాట్లాడొద్దని మెల్లగానే చెప్పాడు పృథ్వి. ‘‘నువ్వు ఎవ్వడివి? నీకెందుకు నేను మెల్లగా చెప్పాలి? నువ్వేమైనా డాన్‌వా? పైనుండి దిగొచ్చావా? ఈరోజు ఉదయం కూడా గ్లాస్‌లో నీళ్లు తీసుకురమ్మని చెప్పినప్పుడు నీ యాటిట్యూడ్ గమనించాను’’ అంటూ ఫ్లోలో చెప్పుకుంటూ వెళ్లిపోయాడు మణికంఠ.

యాటిట్యూడ్ తగ్గించుకో

‘‘నువ్వు ఇక్కడ రా, అక్కడ పో అంటే నేను వినను’’ అని తన వర్షన్ చెప్తూనే ఉన్నాడు మణికంఠ. అది విన్న తర్వాత పృథ్వికి కూడా కోపం వచ్చింది. ఎక్స్‌ట్రాలు మాట్లాడకు అంటూ సీరియస్ అయ్యాడు. ‘‘నువ్వు ముందు నీ యాటిట్యూడ్ తగ్గించుకో’’ అని వార్నింగ్ ఇచ్చాడు మణి. ‘‘నా యాటిట్యూడ్ ఇదే’’ అని పృథ్వి అనగానే ‘‘మడిచి నీ దగ్గరే పెట్టుకో’’ అంటూ కౌంటర్ ఇచ్చాడు. ఎలా ఉండాలో తనకు చెప్పొద్దని పృథ్వి అన్నాడు. ‘‘ఎవరితో ఎలా ఉండాలో నీకు తెలియదు. నీకు ఫిల్టర్ లేదు’’ అని అరిచాడు మణి. కోపంతో పృథ్వి చిటికెలు వేసి మాట్లాడుతుంటే నువ్వెవరు నా మీద చిటికెలు వేయడానికి అంటూ కంట్రోల్ కోల్పోయాడు మణి. దీంతో మిగతా కంటెస్టెంట్స్ వచ్చి మణికంఠను అక్కడి నుండి తీసుకెళ్లిపోయారు.

Related News

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Big Stories

×