BigTV English

Bigg Boss Sonia: ఆర్జీవీ పార్టీలో తాగిపడిపోయిన ‘బిగ్ బాస్’ సోనియా.. ఆ రోజు ఏం జరిగింది?

Bigg Boss Sonia: ఆర్జీవీ పార్టీలో తాగిపడిపోయిన ‘బిగ్ బాస్’ సోనియా.. ఆ రోజు ఏం జరిగింది?

Bigg Boss 8 Sonia Akula: ఇప్పటివరకు గడిచిన ప్రతీ బిగ్ బాస్ తెలుగు సీజన్‌లో రామ్ గోపాల్ వర్మతో సాన్నిహిత్యం ఉన్న అమ్మాయిలు కచ్చితంగా ఉంటున్నారు. అలా ప్రతీ సీజన్‌లో ఒక కంటెస్టెంట్‌ను రంగంలోకి దించుతున్నారు మేకర్స్. ఇక బిగ్ బాస్ సీజన్ 8లో రామ్ గోపాల్ వర్మతో సాన్నిహిత్యం ఉన్న కంటెస్టెంట్ సోనియా. ఇప్పటికే సోనియా ఎవరో చాలామందికి తెలియకపోయినా తనను కేవలం బిగ్ బాస్ హౌస్‌లో చూసి ద్వేషం పెంచుకుంటున్న ప్రేక్షకులు చాలామంది ఉన్నారు. బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా సోనియా ఫేమస్ అవ్వడంతో తన పాత ఇంటర్వ్యూ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


మందు తాగారా?

రామ్ గోపాల్ వర్మ నిర్మించిన ‘ఆశ ఎన్‌కౌంటర్’ అనే మూవీలో లీడ్ రోల్‌లో నటించింది సోనియా. ఆ మూవీ ప్రమోషన్స్ సమయంలో తన ఇంటర్వ్యూ ఒకటి ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అందులో మొదటిసారి ఎప్పుడు తాగారు అనే ప్రశ్నకు.. తాను ఇప్పటివరకు అసలు మందు ముట్టలేదు అని సమాధానమిచ్చింది సోనియా. రామ్ గోపాల్ వర్మతో సినిమా చేశారు కాబట్టి, ఆయనకు పార్టీలు అంటే ఇష్టం కాబట్టి ఆయనతో కలిసి ఎప్పుడూ పార్టీలో తాగలేదా అనే ప్రశ్న సోనియాకు ఎదురయ్యింది. దాంతో తనకు నిజంగానే ఒక ఎక్స్‌పీరియన్స్ ఉందని, అదేంటో చెప్పమని తనపై ఒత్తిడి తీసుకొచ్చాడు ఆ మూవీ హీరో. దీంతో సోనియా నవ్వుతూ అసలు ఏం జరిగిందో చెప్పింది.


Also Read: బిగ్ బాస్ సోనియా పై నెటిజన్స్ ఫైర్.. కా ***తో రగిలిపోతున్నావా?

ఏమైనా కలిపారా

‘‘మేము చేసుకున్న పార్టీలో మాక్‌టెయిల్ తీసుకున్నాను. అదే ఎక్కువయిపోయింది. చాలా ఎంజాయ్ చేశాను. అందులో మందు ఏముండదు కానీ హై ఇచ్చింది’’ అని చెప్పుకొచ్చింది సోనియా. దీంతో అసలు ఆ పార్టీలో ఏమైందో హీరో వివరించాడు. ‘‘ఆ పార్టీలో అసలు ఏమైందో తెలియదు. అందులో ఏమైనా మందు కలిపారా అని సోనియా అడిగింది. వాళ్లేమో ఏం లేదని చెప్పారు. ఆర్జీవీ ఉండడం వల్ల అలా జరిగిందేమో’’ అని అన్నాడు. అసలు రామ్ గోపాల్ వర్మతో తన పరిచయం ఎలా ఉంది అని కూడా ఈ ఇంటర్వ్యూలో షేర్ చేసుకుంది సోనియా. ఆరోజు పార్టీలో తనతో ఆయన ప్రవర్తన గురించి గుర్తుచేసుకుంది.

ఆర్జీవీ ఎమోషనల్

‘‘ఆరోజు ఆర్జీవీ చాలా ఎమోషనల్ అయ్యారు. అందరి దగ్గర ఆయన ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకున్నారు. నీ దగ్గర ఇది నచ్చింది, అది నచ్చింది అనుకుంటూ అందరితో మాట్లాడారు. ఆరోజు అందరం చాలా ఎంజాయ్ చేశాం. లాక్‌డౌన్ తర్వాత చాలారోజుల తర్వాత ఆయనను కలిశాం. అది నాకు మంచి మూమెంట్. ఆరోజు మందు కూడా ట్రై చేద్దామనుకున్నా. కానీ మాక్‌టెయిల్‌కే ఎక్కువయిపోయింది అని ఊరుకున్నా’’ అంటూ వివరించింది సోనియా. మొత్తానికి మునుపటి బిగ్ బాస్ సీజన్స్‌లో అరియానా, అషులాగా సోనియాకు కూడా రామ్ గోపాల్ వర్మతో మంచి సాన్నిహిత్యం ఉందని ఈ ఇంటర్వ్యూ చూసిన ప్రేక్షకులు అనుకుంటున్నారు.

Related News

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Mallika Sherawat: బిగ్ బాస్‌లోకి హాట్ బ్యూటి మల్లికా షెరావత్.. అబ్బాయిలు ఇక టీవీ వదలరేమో!

Big Stories

×