BigTV English

Bigg Boss 8 Telugu Promo: బిగ్ బాస్‌లో మరోసారి అదే టాస్క్.. ఇంకా ఎన్ని సీజన్స్ ఇదే గోల!

Bigg Boss 8 Telugu Promo: బిగ్ బాస్‌లో మరోసారి అదే టాస్క్.. ఇంకా ఎన్ని సీజన్స్ ఇదే గోల!

Bigg Boss 8 Telugu Latest Promo: బిగ్ బాస్ రియాలిటీ షో అనేది ప్రతీ ఏడాది ఒక కొత్త సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. కానీ ప్రతీ సీజన్‌లో బిగ్ బాస్ హోటల్ టాస్క్ అనేది కామన్‌గా ఉంటోంది. ఇటీవల ప్రారంభమయిన బిగ్ బాస్ సీజన్ 8లో ఇదే టాస్క్ జరగనుంది. దానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలయ్యింది. బిగ్ బాస్ హోటల్ టాస్క్‌లో కంటెస్టెంట్స్‌లో కొందరు గెస్టులుగా రావడం, మరికొందరు వర్కర్స్‌గా మారి వారికి సేవలు చేయడం అంతా కామన్‌గా జరిగేదే. ఎక్కువశాతం ఈ బిగ్ బాస్ హోటల్ టాస్క్‌లోనే కంటెస్టెంట్స్‌కు మరో సీక్రెట్ టాస్క్ కూడా ఇస్తారు. ఈ ప్రోమో చూస్తుంటే ఆ సీక్రెట్ టాస్క్ ఏదో రోహిణికే వచ్చినట్టు అనిపిస్తోంది.


సీక్రెట్ లవర్స్

‘‘ఈరోజు బిగ్ బాస్ ఇల్లు.. విలాసవంతమైన హోటల్‌గా మారబోతోంది’’ అని బిగ్ బాస్ చెప్పడంతో ప్రోమో మొదలవుతోంది. ఈ టాస్క్‌లో గంగవ్వ.. రాజవంశానికి చెందిన మహారాణి. అవినాష్, తన గర్ల్‌ఫ్రెండ్ అయిన రోహిణితో సీక్రెట్ ట్రిప్‌కు వస్తాడు. ‘‘బీబీ హోటల్‌కు స్వాగతం’’ అంటూ హోటల్ స్టాఫ్‌లో ఒక వ్యక్తిగా గెస్టులు పలకరిస్తుంది విష్ణుప్రియా. గౌతమ్ గెస్ట్‌గా రాగానే తనను ఇంప్రెస్ చేయడం మొదలుపెడుతుంది యష్మీ. పృథ్వి కూడా హరితేజతో పులిహోర కలుపుతాడు. ఇదంతా చూసి ‘గెస్ట్ కీపింగ్ కాదు రూమ్ కీపింగ్ చేయండి’ అంటూ వారిని ఆదేశిస్తుంది ప్రేరణ. రోహిణి తన లవర్‌గా ఉన్నా కూడా అవినాష్ సైతం హోటల్ స్టాఫ్‌తో ఫ్లర్ట్ చేస్తుంటాడు.


Also Read: మెహబూబ్ రేంజే వేరయా.. ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా?

యష్మీపై ఫోకస్

గౌతమ్‌ను పెళ్లి చేసుకుంటావా అని యష్మీని అడిగింది గంగవ్వ. పక్కా కమర్షియల్‌గా ఆలోచించిన యష్మీ.. డబ్బులు ఇస్తేనే చేసుకుంటానని చెప్తుంది. టాస్క్ మధ్యలో సందర్భం లేకుండా పృథ్విని ముద్దుపెట్టుకుంటుంది విష్ణుప్రియా. అలా గెస్టులుగా మారిన కంటెస్టెంట్స్ అంతా.. హోటల్ స్టాఫ్‌గా ఉన్న కంటెస్టెంట్స్‌తో తమకు నచ్చిన పనులు చేయించుకుంటారు. యష్మీపై అయితే ఫుల్‌గా ఫోకస్ చేయాలని అవినాష్, రోహిణి, గౌతమ్ నిర్ణయించుకుంటారు. ముందుగా యష్మీతో డ్యాన్స్ చేయిస్తాడు అవినాష్. ఫన్నీ డ్యాన్స్ చేసి అవినాష్‌ను ఇంప్రెస్ చేసి టిప్ కొట్టేస్తుంది యష్మీ. ఆ తర్వాత గౌతమ్‌కు మసాజ్ చేసి తనను కూడా ఇంప్రెస్ చేసి టిప్ సాధిస్తుంది.

ఫన్నీ కాదు

రోహిణిని ఇంప్రెస్ చేసి టిప్ కొట్టేయడం కోసం పోల్ డ్యాన్స్ కూడా చేస్తాడు పృథ్వి. ఆ తర్వాత ‘‘ఎవరూ తన పర్సనల్ ఒపినీయన్‌ను పట్టించుకోవడం లేదు’’ అంటూ హోటల్ స్టాఫ్‌పై మండిపడుతుంది రోహిణి. ‘‘నువ్వు మాడిపోయిన కందిపప్పు. మీ ఆయన పెసరపప్పు’’ అంటూ కామెడీ చేసే ప్రయత్నం చేస్తాడు మణికంఠ. అది రోహిణికి నచ్చదు. ‘‘ఇది చాలా సీరియస్. నువ్వు నీ క్యారెక్టర్‌లో నుండి బయటికి వచ్చి నీకు నచ్చినట్టు మాట్లాడడానికి ఇది ఫన్నీ కాదు’’ అని సీరియస్‌గా రియాక్ట్ అవుతుంది. అది చూసి రోహిణి ఎందుకు సడెన్‌గా ఇలా మాట్లాడుతుందని ఇతర కంటెస్టెంట్స్ సైతం షాకవుతారు. కానీ అది సీక్రెట్ టాస్క్ అయ్యిండవచ్చని ప్రేక్షకులు గెస్ చేస్తున్నారు.

Related News

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Mallika Sherawat: బిగ్ బాస్‌లోకి హాట్ బ్యూటి మల్లికా షెరావత్.. అబ్బాయిలు ఇక టీవీ వదలరేమో!

Big Stories

×