BigTV English

NBK 109: బాలయ్య ఫ్యాన్స్ కు దసరా ట్రీట్ రెడీ.. ఫ్యాన్స్ కు పండగే..

NBK 109: బాలయ్య ఫ్యాన్స్ కు దసరా ట్రీట్ రెడీ.. ఫ్యాన్స్ కు పండగే..

NBK 109 : టాలీవుడ్ హీరో నందమూరి నటసింహం బాలయ్య ఇటీవల వరుస హిట్ సినిమాల్లో నటిస్తున్నాడు. గతంలో వచ్చిన ‘భగవంత్ కేసరి’ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు 109 వ సినిమా లో నటిస్తున్నాడు. ఈ మూవీ గురించి అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. కొల్లి బాబి డైరెక్షన్లో ఈ సినిమా రాబోతుందన్న విషయం తెలిసిందే. ఈ మూవీకి ఇప్పటివరకు ఎటువంటి టైటిల్ ను ఫిక్స్ చెయ్యలేదు. కానీ ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ఆ పోస్టర్ లో బాలయ్య రౌద్రంగా కనిపిస్తున్నారు.. ఆ లుక్ ఎంతగా వైరల్ అయ్యిందో తెలిసిందే. తాజాగా ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఈ మూవీ నుంచి దసరా ట్రీట్ రాబోతుందని టాక్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది..


బాలయ్య గత కొన్నేళ్లుగా ఒక సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నట్లు తెలుస్తుంది. ముందుగా గ్లింప్స్, టీజర్ రిలీజ్ చేసి.. ఆ తర్వాత టైటిల్ అనౌన్స్ చేస్తు వస్తున్నారు. ఈ సినిమాలన్నీ హిట్ అవడంతో.. రాను రాను బాలయ్య కు ఇదొక సెంటిమెంట్‌గా మారిపోయేలా ఉంది. ప్రస్తుతం నటిస్తున్న సినిమాకు కూడా ఇప్పటి వరకు టైటిల్ అనౌన్స్ చేయలేదు. కానీ గ్లింప్స్ మాత్రం రిలీజ్ చేశారు.. భగవంత్ కేసరి తర్వాత బాలయ్య 109 వ సినిమాను బాబీ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉన్నాడు. దీని అప్డేట్స్ విషయంలో కాస్తఫ్యాన్స్ కు నిరాశ తప్పలేదని తెలుస్తుంది.

గతంలో ఈ మూవీని దసరాకే రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినిపించాయి. కానీ ఏపీ అసెంబ్లీ ఎన్నికల కారణంగా షూటింగ్‌కు కాస్త్ బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. రిలీజ్ సంగతి పక్కనబెడితే.. అప్డేట్స్ మాత్రం అదిగో.. ఇదిగో అంటూ ఊరిస్తూ వస్తున్నారు డైరెక్టర్ బాబీ.. ఇప్పటివరకు సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి సాలిడ్ అప్డేట్ రాలేదు. ఇక ఈ దసరా కానుకగా ఈ మూవీ నుంచి టైటిల్ ను రీవిల్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఎలాంటి టైటిల్ ను ఫిక్స్ చేస్తారో అని నందమూరి ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణకు జంటగా ఇద్దరు హీరోయిన్లు కనిపిస్తున్నారంటూ వార్తలు వినిపించాయి. తర్వాత ఈ సినిమా లో ఊర్వశి రౌతెలా కూడా నటిస్తుందని.. ప్రగ్యా జైస్వాల్, నాని హీరోయిన్ శ్రద్దా శ్రీనాధ్ కూడా నటిస్తున్నారని వార్త ఫిలిం ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. . ఈ సినిమా కూడా భారీ విజయాన్ని అందుకోవడం పక్కా అని బాలయ్య ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు.  గ్లింప్స్ వీడియో తో ఈ మూవీ పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.. ఇకపోతే సినిమాల తో పాటుగా అన్ స్టాపబుల్ సీజన్ 4 కూడా చేస్తున్న సంగతి తెలిసిందే.. ఆ సీజన్ కు గెస్టుగా ఇప్పుడు అల్లు అర్జున్ రాబోతున్నట్లు అనౌన్స్ చేశారు. దసరా సందర్బంగా ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం..


Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×