BigTV English

Bigg Boss 8 Telugu Promo: అవినాష్ వయసు బయటపెట్టిన టేస్టీ తేజ.. పృథ్వి, అవినాష్ ఓవరాక్షన్‌పై నాగ్ కౌంటర్

Bigg Boss 8 Telugu Promo: అవినాష్ వయసు బయటపెట్టిన టేస్టీ తేజ.. పృథ్వి, అవినాష్ ఓవరాక్షన్‌పై నాగ్ కౌంటర్

Bigg Boss 8 Telugu Latest Promo: బిగ్ బాస్ 8లో మరో సండే ఫన్‌డే మరో మూవీ థీమ్ గేమ్స్‌తో కంటెస్టెంట్స్‌తో పాటు ఆడియన్స్‌ను కూడా ఎంటర్‌టైన్ చేయడానికి సిద్ధమయ్యారు నాగార్జున. ఇప్పటికే సినిమా పేరు ఏంటో గెస్ చేయమంటూ ఆడించిన ఆటకు సంబంధించిన ప్రోమో విడుదల అయ్యింది. తాజాగా డైలాగ్స్ డెడికేషన్‌కు సంబంధించిన ప్రోమో కూడా బయటికొచ్చింది. ఇందులో ఒక డైలాగ్‌ను ఎంపిక చేసుకొని ఆ డైలాగ్‌ను ఎవరికి డెడికేట్ చేయాలని అనుకుంటున్నారో చెప్పాలి కంటెస్టెంట్స్. అది కరెక్టా కాదా అని బిగ్ బాస్ స్టేజ్ దగ్గర ఉన్న ప్రేక్షకులు చప్పట్లతో చెప్పాలి. అయితే ఈ గేమ్‌ను కంటెస్టెంట్స్ కంటే ప్రేక్షకులే ఎక్కువగా ఎంజాయ్ చేసినట్టుగా అనిపిస్తోంది.


ఆడియన్స్ ఒప్పుకున్నారు

‘‘డైలాగ్ డెడికేషన్.. నీకు చేతికి అందిన డైలాగ్ తీసి ఈ హౌస్‌లో ఎవరికి, ఎందుకు డెడికేట్ చేస్తావో చెప్పు’’ అని నాగార్జున చెప్పడంతో ఈ ప్రోమో మొదలవుతుంది. ముందుగా నిఖిల్ వచ్చి ‘నువ్వు ఊరుకోమ్మ. అన్నింటికి తు.. తు.. తు అంటావ్’ అనే డైలాగ్‌ను తీసుకొని ప్రేరణకు డెడికేట్ చేశాడు. అది ఆడియన్స్‌కు నచ్చి అందరూ చప్పట్లు కొట్టారు. దీంతో వాళ్లంతా చాలా కరెక్ట్ అని ఫీలవుతున్నారని నాగార్జున అన్నారు. ‘వాడిని అలా వదిలేయకండ్రా. ఎవరికైనా చూపించండ్రా’ అనే డైలాగ్‌ను మణికంఠకు డెడికేట్ చేసింది హరితేజ. ‘‘ఎవరికి చూపించినా వీడు మారడమ్మా. అలాగే ఉంటాడు’’ అని ఆయన అభిప్రాయాన్ని బయటెపెట్టారు నాగార్జున.


Also Read: బిగ్ బాస్ హిస్టరీలో తక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న కంటెస్టెంట్ ఇతనే..!

గంగవ్వ తర్వాత ఆయనే

‘అది అంతా అప్పుడండి ఇప్పుడు నేను మారిపోయాను’ అనే డైలాగ్ ట్యాగ్‌ను అవినాష్ మెడలో వేశాడు టేస్టీ తేజ. ‘‘అప్పట్లో కుర్ర వయసులో అలా దూకాడు’’ అంటూ అవినాష్ గురించి నాగార్జునకు చెప్తున్న సమయంలో కుర్రవయసు ఏంటి అని అవినాష్ సీరియస్ అయ్యాడు. హౌస్‌లోకి వచ్చినప్పటి నుండి తనను పెద్దాయన అంటున్నాడని ఫీలయ్యాడు. ‘‘హౌస్‌లో గంగవ్వ తర్వాత పెద్దయాన ఈయనే’’ అని క్లారిటీ ఇచ్చాడు తేజ. ‘‘సరేసరేలే ఎన్నెన్నో అనుకుంటాం. అన్నీ అవుతాయా ఏంటి’’ అనే డైలాగ్‌ను విష్ణుప్రియాకు డెడికేట్ చేసింది రోహిణి. ‘‘ఇది గుర్తుపెట్టుకో తర్వాత మాట్లాడుకుందాం’’ అనే డైలాగ్‌ను గౌతమ్‌కు నబీల్ డెడికేట్ చేశాడా లేదా ఇన్‌డైరెక్ట్‌గా వార్నింగ్ ఇచ్చాడా అని ప్రేక్షకులే కన్‌ఫ్యూజ్ అయ్యారు.

ఇద్దరిదీ ఓవరాక్షన్

‘‘ఓవరాక్షన్ చేస్తున్నావేంట్రా ఓవరాక్షన్’’ అనే డైలాగ్‌ను పృథ్వికి డెడికేట్ చేశాడు అవినాష్. అయితే పృథ్వినే తిరిగి ఆ డైలాగ్‌ను అవినాష్‌కు డెడికేట్ చేయాలనుకుంటున్నానని కారణం చెప్పాడు. నామినేషన్స్‌లో ఒరేయ్ అనకు అని ఓవరాక్షన్ చేశాడని గుర్తుచేశాడు. ‘‘ఆ విషయంలో మీ ఇద్దరిదీ ఓవరాక్షనే’’ అని నాగార్జున అనగా.. ఇద్దరం ఆ డైలాగ్ తీసుకుంటామని అవినాష్ అన్నాడు. ఇది కూడా ఓవరాక్షన్ అంటూ చిన్న నవ్వు నవ్వారు నాగ్. మొత్తానికి ఈ డైలాగ్ డెడికేషన్ గేమ్ అంతా చాలా ఫన్నీగా సాగిందని ప్రోమో చూస్తేనే అర్థమవుతోంది. దీనిని ఆడియన్స్ కూడా బాగా ఎంజాయ్ చేశారని తెలుస్తోంది.

Related News

Bigg Boss 9: చెప్పినా వినలేదు.. ప్రియా శెట్టి పేరెంట్స్ ఆవేదన.. ఏమైందంటే?

Bigg Boss 9 Promo: ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు.. సందిగ్ధంలో కంటెస్టెంట్స్!

Bigg Boss 9: బిగ్ బాస్ ఎంట్రీ.. కంటెస్టెంట్స్ ని ఆటాడుకున్న బాస్, ఇదేవరూ ఊహించలేదు భయ్యా!

Bigg Boss 9 Promo: ఇట్స్ ఎమోషన్స్ టైం.. దుఃఖంలో కూడా త్యాగం చేసిన ఇమ్ము!

Bigg Boss 9 Promo: హౌస్ లో మరో కొత్త లవ్ ట్రాక్.. ఒక్కొక్కరు ఇద్దరేసి!

Bigg Boss 9: గౌతమి ఎఫెక్ట్.. రీతూపై భారీ వేటు పడనుందా?

Bigg Boss 9 Telugu: రీతూకి డిమోన్ వెన్నుపోటు.. ల*త్కో*ర్ పనులంటూ.. శ్రీజ సేవ్, నామినేషన్ లో ఉన్నదేవరంటే..

Divvela Madhuri: నా రాజాను వదిలి ఉండలేను.. కానీ, వైల్డ్ కార్డ్ ఎంట్రీ పై మాధురి క్లారిటీ!

Big Stories

×