BigTV English

Bigg Boss 8 Telugu Promo: అవినాష్ సీక్రెట్ బయటపెట్టిన నబీల్.. డేంజర్ జోన్‌లో హరితేజ, నయని పావని

Bigg Boss 8 Telugu Promo: అవినాష్ సీక్రెట్ బయటపెట్టిన నబీల్.. డేంజర్ జోన్‌లో హరితేజ, నయని పావని

Bigg Boss 8 Telugu Latest Promo: బిగ్ బాస్ రియాలిటీ షోలో సండే అంటేనే ఫన్‌డే. వారమంతా కంటెస్టెంట్స్ ఆటతీరు, వారి ప్రవర్తనను చూసిన నాగార్జున.. శనివారం వచ్చి వారి పర్ఫార్మెన్స్‌కు రివ్యూ ఇస్తారు. దీంతో కంటెస్టెంట్స్ బ్రెయిన్ అంతా హీటెక్కిపోతుంది. దానిని కూల్ చేయడం కోసమే సండే ఫన్‌డే అంటూ వస్తారు. ఇక తాజాగా ఈ సండే ఫన్‌డేలో సరదా ఆటలకు సంబంధించిన ప్రోమో బయటికొచ్చింది. ఈ సండే ఫన్‌డే జరిగే సరదా టాస్కుల్లో ఒక గేమ్‌లో అమ్మాయిలు ముందంజలో ఉంటే మరొక గేమ్‌లో వెనకబడ్డారని ప్రోమో చూస్తే తెలుస్తోంది. ఇక సరదా ఆటలతో పాటు ఒక ఎలిమినేషన్ కూడా జరగనుంది. ఇద్దరు లేడీ కంటెస్టెంట్స్ డేంజర్ జోన్‌లోకి ఎంటర్ అయ్యారు.


ఆరోగ్యం కోసమే

‘‘హెల్తీ వైబ్ ఉన్న హెల్తీ స్కిన్ లాగా అందరి స్కిన్ బాగుండాలని అన్ని హెల్తీ వస్తువులు మీకోసం తీసుకొచ్చేశాం. అక్కడ 8 రకాల జ్యూస్‌లు ఉన్నాయి. ఇందులో రెండు జ్యూస్‌లు కలిపి ఒక్కరికి ఇవ్వాలి’’ అంటూ టాస్క్ గురించి నాగార్జున వివరించడంతో ఈ ప్రోమో మొదలవుతుంది. నబీల్.. కాకరకాయ జ్యూస్‌ను మరొక జ్యూస్‌తో కలపగానే అది ఎవరికి ఇస్తాడా అని అందరూ ఇంట్రెస్టింగ్‌గా చూశారు. విష్ణుప్రియాకు ఇస్తాడనుకుంటే అవినాష్ పేరు పిలిచాడు. దానికి కారణం చెప్తుంటే అవినాష్ ఆపేశాడు. కానీ ఆ కారణమేంటో తెలుసుకోవాలని నాగార్జున అడిగారు. ‘‘జీబ్రా రూమ్‌లో దీపావళి బాంబులు వేసి టాక్సిసిటీ పెంచేస్తున్నాడు’’ అంటూ అవినాష్ సీక్రెట్ బయటపెట్టాడు నబీల్.


Also Read: సండే.. ఫన్ డే.. కొత్త టాస్క్ తో కొత్త రచ్చ..!

అమ్మాయిలే ఎలిమినేట్

మిగతా కంటెస్టెంట్స్‌కు కూడా అలాగే కారణాలు చెప్పి జ్యూస్‌లు ఇవ్వగా వారు అతికష్టంగా వాటిని తాగారు. ఆ తర్వాత మరొక సరదా ఆటకు టైమ్ అయ్యింది. ‘‘మీకోసం మ్యూజిక్ ప్లే అవుతుంది. సడెన్‌గా మ్యూజిక్ ఆగిపోతుంది. మీ ముందు ఉన్న ఆకాశం, కొండలు, సముద్రంలో నేను ఒక పేరు చెప్తాను. దానిపైకి లాస్ట్‌గా ఎవరు వెళ్తారో వారు ఎలిమినేట్’’ అంటూ ఈ ఆట గురించి వివరించారు నాగార్జున. ఈ ఆట నుండి బ్యాక్ టు బ్యాక్ అమ్మాయిలే ఎలిమినేట్ అయిపోయి బయటికి వచ్చేశారు. ముందుగా నయని పావని, ఆ తర్వాత యష్మీ, రోహిణి.. ఈ ఆట నుండి ఎలిమినేట్ అయ్యారు. ఆ తర్వాత అవినాష్ ట్రై చేసినా ఎలిమినేట్ అవ్వక తప్పలేదు.

డేంజర్ జోన్

ఫైనల్‌గా బిగ్ బాస్ 8లో మరొక ఎలిమినేషన్‌కు టైమ్ అయ్యింది. డేంజర్ జోన్‌లోకి నయని పావని, హరితేజ వచ్చినట్టుగా ఈ ప్రోమోలో చూపించారు. నాగార్జున చెప్పినప్పుడు సుత్తితో అక్కడ ఉన్న పలకను పగలగొడితే ఎవరు ఎలిమినేట్ అయ్యారు అనే విషయం తెలుస్తుందని చెప్పారు. దీంతో హరితేజ, నయని పావని పగలగొట్టడం మొదలుపెట్టారు. మొత్తానికి ఈవారం ఎవరు ఎలిమినేట్ అయ్యి బయటికి వెళ్తారు అనే విషయం తెలియాలంటే ఎపిసోడ్ చూడాల్సిందే. హరితేజ, నయని పావని.. ఇద్దరూ పోలిస్తే ఎంటర్‌టైన్మెంట్, టాస్కుల విషయంలో హరితేజ బాగా ఆడుతుందని, నయని పావని మాత్రం ప్రతీ విషయానికి ఏడుస్తుందని ప్రేక్షకులు ఫీలవుతున్నారు.

Related News

Bigg Boss 9 Promo: ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు.. సందిగ్ధంలో కంటెస్టెంట్స్!

Bigg Boss 9: బిగ్ బాస్ ఎంట్రీ.. కంటెస్టెంట్స్ ని ఆటాడుకున్న బాస్, ఇదేవరూ ఊహించలేదు భయ్యా!

Bigg Boss 9 Promo: ఇట్స్ ఎమోషన్స్ టైం.. దుఃఖంలో కూడా త్యాగం చేసిన ఇమ్ము!

Bigg Boss 9 Promo: హౌస్ లో మరో కొత్త లవ్ ట్రాక్.. ఒక్కొక్కరు ఇద్దరేసి!

Bigg Boss 9: గౌతమి ఎఫెక్ట్.. రీతూపై భారీ వేటు పడనుందా?

Bigg Boss 9 Telugu: రీతూకి డిమోన్ వెన్నుపోటు.. ల*త్కో*ర్ పనులంటూ.. శ్రీజ సేవ్, నామినేషన్ లో ఉన్నదేవరంటే..

Divvela Madhuri: నా రాజాను వదిలి ఉండలేను.. కానీ, వైల్డ్ కార్డ్ ఎంట్రీ పై మాధురి క్లారిటీ!

Bigg Boss 9 wildcard : వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ వీళ్లే.. ఇక హౌస్‌లో రచ్చ రచ్చే!

Big Stories

×