BigTV English

Pawan kalyan: రేపు, ఎల్లుండి పిఠాపురంలో పవన్..షెడ్యూల్ ఇదే.!

Pawan kalyan: రేపు, ఎల్లుండి పిఠాపురంలో పవన్..షెడ్యూల్ ఇదే.!

జ‌న‌సేన అధినేత, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ రేపు, ఎల్లుండి పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించ‌నున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో ప‌లు అభివృద్ధి ప‌నులకు ఆయ‌న శంకుస్థాప‌న చేయ‌నున్న‌ట్టు పార్టీ వ‌ర్గాలు తెలిపారు. రేపు ఉద‌యం 11 గంట‌ల‌కు ప‌వన్ రాజ‌మండ్రి ఎయిర్ పోర్టులో దిగ‌నున్నారు. అక్క‌డ నుండి రోడ్డు మార్గంలో గొల్ల‌ప్రోలు జిల్లా ప‌రిష‌త్ స్కూలుకు వెళ్ల‌నున్నారు. స్కూలులో సైన్స్ ల్యాబ్ ప్రారంభించి అనంత‌రం సూరంపేట హ్యాబిటేష‌న్ బ్రిడ్జ్ నిర్మాణానికి శంకుస్థాప‌న చేస్తారు. నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌పై అధికార‌ల‌తో స‌మీక్షిస్తారు.


ALSO READ:ఈ నెల 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు!

అనంత‌రం జ‌న‌సేన నేత‌ల‌తో ప‌వ‌న్ స‌మావేశం కానున్నారు. ఇక మ‌ధ్యాహ్నం 1 గంట నుండి 3 గంట‌ల వ‌ర‌కు చేబ్రోలులోని త‌న నివాసంలో విశ్రాంతి తీసుకోనున్నారు. మ‌ధ్యాహ్నం పిఠాపురంలో ఆర్ఆర్ బీహెచ్ఆర్ డిగ్రీ కాలేజీ, బాదం మాధ‌వ జిల్లా ప‌రిష‌త్ హైస్కూల్ ప్రారంభోత్సంలో పాల్గొంటారు. అదే విధంగా టీటీడీ క‌ల్యాణ మండపం, సోష‌ల్ వెల్ఫేర్ హాస్ట‌ల్ మ‌ర‌మ్మ‌త్తు ప‌నుల‌కు శంకుస్థాప‌న చేస్తారు.


ఇక రేపు రాత్రి చేబ్రోలులోనే బ‌స చేసి ఎల్లుండి ఉద‌యం కొత్తప‌ల్లి పీహెచ్సీలోని ఔట్ పేషెంట్ విభాగానికి శంకుస్థాప‌న చేస్తారు. అదేవిధంగా యు. కొత్త‌ప‌ల్లి మండ‌లంలోని ప‌లు పాఠశాల‌ల‌కు శంకుస్థాప‌న చేయ‌నున్నారు. మ‌ధ్యాహ్నం 1 గంట‌కు తిరిగి చేబ్రోలుకు చేరుకుని విశ్రాంతి తీసుకుంటారు. అక్క‌డ నుండి రోడ్డు మార్గంలో రాజ‌మండ్రి ఎయిర్ పోర్టుకు చేరుకుని, విమానంలో విజ‌య‌వాడ వెళ్ల‌నున్నారు. ఇదిలా ఉంటే పిఠాపురంలో శనివారం ఓ కార్యక్రమంలో కండువాల పంచాయితీ నెలకొంది. టీటీడీ, జనసేన నేతల మధ్య వివాదం చోటు చేసుకుంది. ఈ వివాదానికి కూడా పవన్ కల్యాణ్ చెక్ పెట్టే అవకాశం ఉంది.

Related News

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Big Stories

×