BigTV English

Bigg Boss 8 Telugu Promo: పరువు పోగొట్టుకుంటున్న ఓజీ టీమ్.. ‘సై’ సినిమా రేంజ్‌లో నిఖిల్ మోటివేషన్

Bigg Boss 8 Telugu Promo: పరువు పోగొట్టుకుంటున్న ఓజీ టీమ్.. ‘సై’ సినిమా రేంజ్‌లో నిఖిల్ మోటివేషన్

Bigg Boss 8 Telugu Latest Promo: బిగ్ బాస్ సీజన్ 8లో అప్పటికే ఎనిమిది కంటెస్టెంట్స్ ఉండగా.. అందులో మరొక ఎనిమిది మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా జాయిన్ అయ్యారు. పాత కంటెస్టెంట్స్ అంతా ఓజీగా.. కొత్త కంటెస్టెంట్స్ అంతా రాయల్స్‌గా మారారు. దీంతో ఈ రెండు టీమ్స్ మధ్య పోటీ మొదలయ్యింది. పాత కంటెస్టెంట్స్ కంటే కొత్త కంటెస్టెంట్స్ బాగా ఆడుతున్నామని నిరూపించుకుంటూ వస్తున్నారు. అంతే కాకుండా ప్రతీ టాస్కులో వారిదే అప్పర్ హ్యాండ్ ఉంటుంది. తాజాగా ‘బీబీ రాజ్యం’ అని వరుసగా రాయల్స్, ఓజీ టీమ్స్ మధ్య కొన్ని టాస్కుల పోటీ మొదలయ్యింది. ఇప్పటివరకు అందులో ఒక టాస్క్ మాత్రమే పూర్తిగా కాగా.. మిగతా టాస్కులకు సంబంధించిన ప్రోమో మొదలయ్యింది.


పొగరు తగ్గాలి

బిబీ రాజ్యంలో జరిగిన టాస్క్ కోసం రాయల్స్ టీమ్ నుండి గౌతమ్, అవినాష్, మెహబూబ్ రంగంలోకి దిగారు. ఓజీ టీమ్‌ను ఎదిరించి బలంగా నిలబడ్డారు. దీంతో వారంతా టాస్క్ పూర్తి చేసుకొని లోపలికి రాగానే వారి టీమ్ అంతా వారు బాగా ఆడారని ప్రశంసించింది. అదంతా చూసి ప్రేరణలో కుళ్లు మొదలయ్యింది. ‘‘వచ్చిన దగ్గర నుండి మేము ఎన్ని గెలిచామని వాళ్లంతా చెప్తూనే ఉన్నారు. ఆ పొగరు తగ్గాలి’’ అని నబీల్‌తో చెప్పుకొచ్చింది. ఇక టాస్క్ బాగా ఆడడంతో తనలో కూడా బలం ఉందని గ్రహించానని అవినాష్ చెప్పుకొని సంతోషపడ్డాడు. పృథ్వి ఆటతీరును రోహిణి, మెహబూబ్ ఇమిటేట్ చేశారు. దీంతో రాయల్స్ టీమ్ అంతా ఇది చూసి నవ్వుకుంది.


Also Read: పట్టుకో కార్ట్ లో పెట్టుకో.. కొత్త టాస్క్ తో కంటెస్టెంట్స్ మధ్య టఫ్ ఫైట్..!

మనవాడే అయ్యిండాలి

రాయల్స్ టీమ్ బ్యాక్ టు బ్యాక్ విన్ అవ్వడం.. ఓజీ టీమ్ సీరియస్‌గా తీసుకుంది. అందుకే అందరితో కలిసి నిఖిల్ సీరియస్ డిస్కషన్ మొదలుపెట్టింది. ‘‘చూడండి.. ఇది మన సీజన్. 8వ సీజన్ అనేది మనది. ఆ ట్రోఫీని పట్టుకొని ఎవరైనా నిలబడ్డారంటే మన 6 మందిలోనే ఎవరో ఒకరు అయ్యిండాలి’’ అని స్ట్రాంగ్‌గా చెప్పాడు. అది ఓజీ టీమ్ కూడా చాలా సీరియస్‌గా తీసుకుంది. ఆ తర్వాత బీబీ రాజ్యంలో మరొక టాస్క్ మొదలయ్యింది. అదే వైరస్ టాస్క్. ఈ టాస్క్‌లో గార్డెన్ ఏరియాలో ఉన్న బాల్స్‌ను నెట్స్‌లో పడేలా చేయాలి. అంటే ఇరు టీమ్స్ నుండి ఇద్దరు సభ్యులు వచ్చి ఈ టాస్క్ ఆడాలి. ఆ బాల్స్ వారి నెట్స్‌లో పడకుండా ఇరువురి టీమ్స్‌కు చెందిన సభ్యులు ఆడాలి.

తేజ స్ట్రాటజీ

వైరస్ టాస్క్‌ను ఆడడం కోసం ఓజీ టీమ్ నుండి నిఖిల్, నబీల్ రంగంలోకి దిగారు. రాయల్స్ టీమ్ నుండి గౌతమ్, తేజ వచ్చారు. నిఖిల్, గౌతమ్ బాల్స్ విసిరే ప్లేయర్స్‌గా ఉండగా.. తేజ, నబీల్.. గోల్ కీపర్స్‌గా ఉన్నారు. గౌతమ్‌ను ఎట్టి పరిస్థితుల్లో అయినా ఆపాలని గేమ్ గెలవాలని నబీల్ చాలానే ప్రయత్నించాడు. మధ్య టేస్టీ తేజ గేమ్ మార్చే ప్రయత్నం చేశాడు. తాను బాల్స్‌ను ఆపకుండా అవతలి వైపుకు వెళ్లి నెట్‌లో బాల్స్ వేయడం మొదలుపెట్టాడు. అందుకే ‘‘చివరి వరకు మనమే ఉన్నాం. చివరి 2 నిమిషాల్లో ఆట మొత్తం మారిపోయింది’’ అని స్టేట్‌మెంట్ ఇచ్చింది హరితేజ. మొత్తానికి కనీసం ఈ టాస్క్‌లో అయినా గెలిచి ఓజీ పరువు కాపాడుకుంటారో లేదో చూడాలి.

Related News

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Big Stories

×