BigTV English

Bigg Boss 18 : బిగ్ బాస్ పై జాతీయ సంస్థ ఫైర్… ఆ కంటెస్టెంట్ ను బయటకు పంపాలంటూ డిమాండ్

Bigg Boss 18 : బిగ్ బాస్ పై జాతీయ సంస్థ ఫైర్… ఆ కంటెస్టెంట్ ను బయటకు పంపాలంటూ డిమాండ్

Bigg Boss 18 : తాజాగా మొదలైన హిందీ బిగ్ బాస్ 18 కు ఆదిలోనే ఆటంకం ఎదురైంది. ఈ షోలో ఒక కంటెస్టెంట్ ను బయటకు పంపించాలంటూ ఏకంగా జాతీయ సంస్థ నిర్వాహకులపై ఫైర్ కావడం గమనార్హం. అసలు ఆ కంటెస్టెంట్ ఎవరు? షోకు ఎదురైన అడ్డంకి ఏంటి? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.


కంటెస్టెంట్ గా గాడిద

బిగ్గెస్ట్ బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ కు ఎంతటి క్రేజ్ వుందో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ షో తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా సక్సెస్ ఫుల్ గా దూసుకెళ్తోంది. గత ఆదివారం హిందీ బిగ్ బాస్ సీజన్ 18 ఘనంగా మొదలైంది. అక్టోబర్ 6న సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరించగా, ఈ షోలో పాల్గొంటున్న కంటెస్టెంట్స్ ఒక్కొక్కరిని ప్రేక్షకులకు పరిచయం చేస్తూ సల్లూ భాయ్ హౌస్ లోకి పంపించారు. ఈ క్రమంలోనే ఊహించని విధంగా ఓ గాడిదను హౌస్ మేట్ గా పరిచయం చేస్తూ సల్మాన్ బిగ్ బాస్ హౌస్ లోకి పంపారు. ఈ స్టన్నింగ్ పరిణామంతో ప్రేక్షకులంతా నోర్లు వెళ్ళబెట్టారు. ఈ షాకింగ్ పరిణామం నుంచి తేరుకునే లోపే గాడిద లోపలికి వెళ్లడం, కంటెస్టెంట్స్ దాన్ని పలకరించడం కూడా జరిగిపోయింది. ఈ వీడియోను షోకు సంబంధించిన ఛానల్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయగా, క్షణాల్లో వైరల్ అయింది.


బిగ్ బాస్ నిర్వాహకులపై జాతీయ సంస్థ ఆగ్రహం 

ఈ నేపథ్యంలోనే వైరల్ అవుతున్న ఆ గాడిద వీడియో పై నెటిజెన్లు ఫైర్ అవుతున్నారు. నిజానికి బిగ్ బాస్  18లోకి కంటెస్టెంట్ గా వెళ్లిన అడ్వకేట్ గుణ రత్న సదావర్తే కు తోడుగా అతను పెంచుకుంటున్న గాడిదను లోపలికి పంపారు. కానీ ఇలా గాడిదను బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకురావడంపై నెటిజెన్లు ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. మామూలుగానే బిగ్ బాస్ అంటే కొంతమందికి అస్సలు నచ్చదు. ఓ వర్గం వారు ఇలా మనుషుల్ని ఓ బోనులో బంధించినట్టుగా బంధించి హింసిస్తున్నారు, వాళ్ళ ఎమోషన్స్ తో ఆడుకుంటున్నారు అంటూ ప్రతిసారి బిగ్ బాస్ షో ప్రారంభమయ్యే ముందు విమర్శిస్తారు. కానీ తాజాగా గాడిద ను బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకురావడంపై జంతు హక్కుల పరిరక్షణ సంస్థ ‘పెటా’ ఆగ్రహం వ్యక్తం చేసింది. సదరు రియాల్టీ షోకు లెటర్ ను రాస్తూ ఇలాంటి షోలలో జంతువులను ఉపయోగించడం తీవ్రమైన నేరమని తెలిపింది. అంతేకాకుండా జంతు ప్రేమికుల నుంచి అభ్యంతరాలు, ఫిర్యాదులు వస్తున్నాయని వాటిని పరిగణలోకి తీసుకుంటున్నామని, వెంటనే హౌస్ నుంచి జంతువును బయటకు పంపాలంటూ ఆ లేఖలో పెటా డిమాండ్ చేసింది. ఇక ఎంతో పేరు ఉన్న సల్మాన్ ఖాన్ మన సంతోషం కోసం జంతువులను ఇబ్బందులకు గురి చేయొద్దంటూ షో నిర్వాహకులకు చెప్పాలని రిక్వెస్ట్ చేసింది. లైట్, సౌండ్స్ కి గాడిదలు భయపడతాయని, వెంటనే షో నుంచి గాడిదను బయటకు పంపి, తమకు అప్పగించాలని ఆదేశించింది. కానీ ఆ లేఖపై సదరు రియాలిటీ షో మేకర్స్ ఇంకా స్పందించలేదు.

Related News

Bigg Boss 9: బిగ్ బాస్ ఎంట్రీ.. కంటెస్టెంట్స్ ని ఆటాడుకున్న బాస్, ఇదేవరూ ఊహించలేదు భయ్యా!

Bigg Boss 9 Promo: ఇట్స్ ఎమోషన్స్ టైం.. దుఃఖంలో కూడా త్యాగం చేసిన ఇమ్ము!

Bigg Boss 9 Promo: హౌస్ లో మరో కొత్త లవ్ ట్రాక్.. ఒక్కొక్కరు ఇద్దరేసి!

Bigg Boss 9: గౌతమి ఎఫెక్ట్.. రీతూపై భారీ వేటు పడనుందా?

Bigg Boss 9 Telugu: రీతూకి డిమోన్ వెన్నుపోటు.. ల*త్కో*ర్ పనులంటూ.. శ్రీజ సేవ్, నామినేషన్ లో ఉన్నదేవరంటే..

Divvela Madhuri: నా రాజాను వదిలి ఉండలేను.. కానీ, వైల్డ్ కార్డ్ ఎంట్రీ పై మాధురి క్లారిటీ!

Bigg Boss 9 wildcard : వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ వీళ్లే.. ఇక హౌస్‌లో రచ్చ రచ్చే!

Bigg Boss 9 Promo: నామినేషన్స్‌లో రచ్చ రచ్చ.. కోడిగుడ్డుపై ఈకలు పీకుతా.. శ్రీజపై మాస్క్ మ్యాన్ ఫైర్

Big Stories

×