E-Paper
Advertisement

Bigg Boss 8 Telugu: రాయల్స్ వర్సెస్ ఓజీ, ఒకరిపై ఒకరు చాడీలు.. అసలు నయని పావని ఏం చేసింది భయ్యా?

Bigg Boss 8 Telugu: రాయల్స్ వర్సెస్ ఓజీ, ఒకరిపై ఒకరు చాడీలు.. అసలు నయని పావని ఏం చేసింది భయ్యా?
Advertisement

Bigg Boss 8 Telugu Latest Updates: బిగ్ బాస్ 8లోకి రాయల్స్‌గా వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఎంటర్ అవ్వగానే పాత కంటెస్టెంట్స్‌లో జోష్ పెరిగింది. ఒకరితో ఒకరికి ముందు నుండి పరిచయాలు లేకపోయినా అందరూ బాగానే కలిసిపోయారు. కానీ అదంతా టాస్కులు వచ్చేవరకే. టాస్కుల విషయంలో ఒకరిపై మరొకరు పగ పెంచుకున్నట్టుగా ఆడుతున్నారు. ఫ్రెండ్‌షిప్‌ను మర్చిపోతున్నారు. ఇక తాజాగా జరిగిన వీకెండ్ ఎపిసోడ్‌లో నాగార్జునతో అందరూ చాడీలు చెప్పడమే సరిపోయింది. రాయల్స్ టీమ్‌లో ఓజీ టీమ్, ఓజీ టీమ్‌లో రాయల్స్ టీమ్ తప్పులు వెతకడమే పనిగా పెట్టుకున్నారు. వీటన్నింటి మధ్యలో నయని పావనిపై ప్రేక్షకుల్లో నెగిటివిటీ పెరిగిపోతోంది.

వారంతా ఫాలింగ్

Advertisement

తాజాగా జరిగిన వీకెండ్ ఎపిసోడ్‌లో కొందరికి రైజింగ్ స్టార్, కొందరికి ఫాలింగ్ స్టార్ అనే ట్యాగ్స్ ఇచ్చారు నాగార్జున. చాలావరకు ఓజీ టీమ్‌లోని కంటెస్టెంట్స్‌కు ఫాలింగ్ స్టారే వచ్చింది. కొత్తగా వచ్చిన రాయల్సే ఎంటర్‌టైన్మెంట్‌లో, టాస్కుల్లో అందరినీ ఆకట్టుకొని రైజింగ్ స్టార్లను గెలుచుకున్నారు. మెగా చీఫ్‌గా నబీల్ చాలా విషయాల్లో ఫెయిల్ అయ్యాడని నాగార్జున స్వయంగా చెప్పారు. అందుకే తనను ఫాలింగ్ స్టార్ కేటగిరిలో వేశారు. విష్ణుప్రియా, నిఖిల్, తేజ, పృథ్వి, గౌతమ్‌లకు కూడా ఫాలింగ్ స్టార్సే దక్కాయి. వీరందరూ కచ్చితంగా ఆటను ఇంప్రూవ్ చేసుకోవాలని సలహా ఇచ్చారు నాగ్. వీరు కాకుండా మిగతా అందరికీ రైజింగ్ స్టార్లే దక్కాయి.

Also Read: బిగ్ బాస్ బ్యూటీ ప్రైవేట్ వీడియో లీక్.. సోషల్ మీడియాలో వైరల్

Advertisement

అసలు ఏం చేసింది?

ముందుగా మెగా చీఫ్‌గా గెలిచినందుకు మెహబూబ్‌ను అభినందించారు నాగార్జున. అవినాష్, రోహిణి కలిసి టాస్కుల్లో ఎంటర్‌టైన్ చేశారని ప్రశంసించారు. హరితేజ, గంగవ్వ, యష్మీ, సీత.. వీరంతా బీబీ హోటల్ టాస్కులో వారి పాత్రల్లో ఉంటూనే అందరినీ ఎంటర్‌టైన్ చేశారని అన్నారు. అయితే వీరితో పాటు నయని పావనికి కూడా రైజింగ్ స్టారే ఇచ్చారు నాగార్జున. అదే ప్రేక్షకులను కాస్త షాక్‌కు గురిచేసింది. బీబీ హోటల్ టాస్క్‌లో మొదటిరోజు గంగవ్వకు అసిస్టెంట్‌గా వ్యవహరించమని నయని పావనని ఆదేశించారు బిగ్ బాస్. రెండోరోజు గౌతమ్ లవర్‌గా నటించమన్నారు. కానీ ఆ రెండు రోజులు తన పర్ఫార్మెన్స్ అంతగా కనిపించలేదు. అయినా నాగార్జున తనకు రైజింగ్ స్టార్ ఇవ్వడమేంటి అని ఫీలవుతున్నారు.

సిల్లీ కారణాలు

రైజింగ్ స్టార్, ఫాలింగ్ స్టార్ టాస్క్ అయిపోయిన తర్వాత రాయల్స్ టీమ్ నుండి హౌస్ నుండి బయటికి ఎవరు వెళ్తే బాగుంటుందని ఓజీ టీమ్‌ను అడిగారు నాగార్జున. అదే విధంగా ఓజీ టీమ్ నుండి ఎవరు బయటికి వెళ్లిపోవాలని రాయల్స్ టీమ్‌ను అడిగారు. ఇక ఇందులో కూడా ఎవరికి వారు చాడీలు చెప్తూ.. చాలా సిల్లీ కారణాలు చెప్పారు. ముఖ్యంగా నయని పావని, విష్ణుప్రియా అయితే మొదటి నుండే బద్ధ శత్రువులు అయిపోయినట్టు అనిపిస్తోంది. ముఖ్యంగా నయని.. పృథ్వితో క్లోజ్‌గా ఉండడం విష్ణు తట్టుకోలేకపోతోంది. అందుకే తను అంత యాక్టివ్‌గా లేదని, తను హౌస్ నుండి బయటికి వెళ్లిపోవాలని స్టేట్‌మెంట్ ఇచ్చింది. నయని పావని కూడా విష్ణుప్రియా పేరే చెప్పింది.

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×