E-Paper
Advertisement

Bigg Boss 8 Telugu Promo: బిగ్ బాస్ హౌజ్‌లో ‘అడల్ట్ రేటెడ్’ కామెడీ.. ‘ఆమె మాత్రమే పుణ్యస్త్రీ, మేము మాత్రం అదో టైప్’ అంటూ విష్ణుప్రియా స్టేట్‌మెంట్

Bigg Boss 8 Telugu Promo: బిగ్ బాస్ హౌజ్‌లో ‘అడల్ట్ రేటెడ్’ కామెడీ.. ‘ఆమె మాత్రమే పుణ్యస్త్రీ, మేము మాత్రం అదో టైప్’ అంటూ విష్ణుప్రియా స్టేట్‌మెంట్
Advertisement

Bigg Boss 8 Telugu Latest Promo: వినాయక చవితి సందర్భంగా బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్స్ అంతా అందంగా రెడీ అయ్యి నాగార్జున కోసం ఎదురుచూడడం మొదలుపెట్టారు. దానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలయ్యింది. ప్రతీ బిగ్ బాస్ సీజన్‌లో శనివారం అనగానే నాగార్జున వచ్చి వారమంతా కంటెస్టెంట్స్ మధ్య జరిగిన గొడవలు, మనస్పర్థల గురించి మాట్లాడి ఆడియన్స్‌కు కూడా ఒక క్లారిటీ ఇస్తారు. కానీ ఈసారి అలా కాదని నాగార్జున చెప్పడంతోనే ప్రోమో ఇంట్రెస్టింగ్‌గా మారింది. ముందుగా వినాయక చవితి సందర్బంగా కంటెస్టెంట్స్ అందరికీ స్వీట్స్ పంపించిన నాగార్జున.. ఆ తర్వాత వారి పర్ఫార్మెన్స్‌ల గురించి మాట్లాడడం మొదలుపెట్టారు.

పాపం నిఖిల్

Advertisement

‘‘ముగ్గురు చీఫ్స్‌లో స్ట్రాంగ్‌గా ఉంటాడనుకున్న నిఖిల్.. నీ క్లాన్ చాలా చిన్నది కదా’’ అంటూ నిఖిల్‌తో మాట్లాడడం మొదలుపెట్టారు నాగార్జున. అన్నీ మారుతాయి అని నిఖిల్ పాజిటివ్‌గా సమాధానం ఇవ్వగా.. ఏం మారుస్తావు మావా అని నాగ్ సరదాగా అనగానే హౌజ్‌మేట్స్ అంతా నవ్వారు. ఆ తర్వాత కంటెస్టెంట్స్ అంతా వారమంతా హౌజ్‌లో జరిగిన విషయాలను పరిగణనలోకి తీసుకొని తమకు ఏ కంటెస్టెంట్ నచ్చలేదో, ఎందుకు నచ్చలేదో చెప్పమని నాగార్జున అన్నారు. ముందుగా శేఖర్ భాషా వచ్చి తనకు నాగ మణికంఠతో ఉన్న ప్రాబ్లమ్ చెప్పాడు. ‘‘తనతో తను మాట్లాడుకుంటున్నాడు’’ అని అన్నాడు. ‘‘తర్వాత నామినేషన్స్‌లో తను ఎందుకు అలా ఉన్నాడో వివరించాడు కదా’’ అని నాగార్జున గుర్తుచేయగా.. అది తనకు నమ్మేలాగా అనిపించలేదని శేఖర్ భాషా స్టేట్‌మెంట్ ఇచ్చాడు.

Also Read: డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు.. బిగ్ బాస్ 8 మొదటి ఎలిమినేషన్‌లో ఇంటికి వెళ్లేది వీరే!

Advertisement

హర్ట్ అయ్యాను

ఆ తర్వాత విష్ణుప్రియా వచ్చి ‘‘తనకు కోపం వచ్చినప్పుడు తనే మాట్లాడే మాటలు, వాడే పదాలు చాలా హర్టింగ్ ఉంటాయి’’ అని సోనియా గురించి చెప్పింది. దీంతో నాగార్జున.. అసలు విష్ణుప్రియా, సోనియా మధ్య ఏమైందో తెలియడం కోసం వీడియో చూపించారు. కొన్నిరోజుల క్రితం ముందుగా నిఖిల్‌తో తాను అంత బాగుండకపోయేదాని, ఇప్పుడెలా క్లోజ్ అయ్యావు అని సోనియాను విష్ణుప్రియా అడగగా.. తను ఏం సమాధానం చెప్పకుండా అక్కడి నుండి వెళ్లిపోయింది. తర్వాత మళ్లీ వచ్చి ‘‘నేను మీ అడల్ట్ రేటెడ్ కామెడీలో భాగం కాదు’’ అని స్టేట్‌మెంట్ ఇచ్చింది. ఇది విష్ణుప్రియాకు నచ్చలేదు. అందుకే తను తప్పుగా ఏమీ మాట్లాడలేదని సోనియాకు వివరించడానికి వెళ్లింది. అది పట్టించుకోని సోనియా.. బయట అందరి ముందు కూర్చొని ఏడవడం మొదలుపెట్టింది.

నువ్వు కూడా అమ్మాయివే

సోనియా ఏడుస్తున్నప్పుడు కూడా విష్ణుప్రియా వచ్చి.. ‘‘నేను కూడా ఏడుస్తా. నాకు కూడా ఎమోషన్స్ ఉన్నాయి. నన్ను కూడా అన్నారు. ఈమె ఒకత్తే పుణ్యస్త్రీ, మేము మాత్రం అలాంటివాళ్లం’’ అనుకుంటూ అక్కడి వెళ్లిపోయింది. అది చూసిన నాగార్జున.. సోనియాకు సపోర్ట్‌గా.. ‘‘నువ్వు బాధపడితే ఆ అమ్మాయిని గుచ్చుతావా? నువ్వు ఒక అమ్మాయివే కదా. నీకు అర్థమవుతుంది’’ అని విష్ణుప్రియాతో అన్నారు. ఆ తర్వాత ‘‘అన్ని కుక్కర్స్ ఒకేలాగా పనిచేయవు. అందరి ఎమోషన్స్ ఒకేలాగా ఉండవు’’ అంటూ సోనియాకు కూడా సర్దిచెప్పారు. సీత వచ్చి యష్మీ గురించి చెప్తూ.. ‘‘ఒక క్లాన్‌కు చీఫ్ ఎంత ముఖ్యమో.. హౌజ్‌కు ఒక పాజిటివ్ మనిషి కూడా అంతే ముఖ్యం’’ అని తన అభిప్రాయం వ్యక్తం చేసింది. ఆట అదేనంటూ సీతకు సమాధానమిచ్చారు నాగార్జున.

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×