BigTV English

Weight Gain Foods For Children: మీ పిల్లలు బరువు పెరగడం లేదా ? ఈ ఫుడ్స్ తినిపించండి

Weight Gain Foods For Children: మీ పిల్లలు బరువు పెరగడం లేదా ? ఈ ఫుడ్స్ తినిపించండి

Weight Gain Foods For Children: నేటి తరం పిల్లలు ఎక్కువగా జంక్ ఫుడ్ తినడానికి అలవాటు పడుతున్నారు. వాటిలో పోషకాలు లేకపోగా పిల్లలు వాటిని తినడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇదిలా ఉంటే పిల్లల శరీరానికి అవసరమైన పోషకాలు అందక పోతే వయస్సుకు తగ్గ బరువు పెరగరు. దీని వల్ల తరుచుగా అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అంతే కాకుండా రోగనిరోధక శక్తి కూడా తగ్గుతుంది. అందుకే పిల్లలు వయస్సుకు తగినంత బరువు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. .


పిల్లలు తక్కువ బరువుతో ఉంటే అలాంటి వారు బరువు పెరగడం కోసం వారి డైట్‌ల పోషక పదార్థాలను చేర్చాలని అంటున్నారు. మరి పిల్లలు వయస్సుకు తగ్గ బరువు ఉండాలంటే ఏ రకమైన పోషక పదార్థాలను అందించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

పిల్లలు ఎదిగే క్రమంలో వారికి సరైన పోషక ఆహారాన్ని అందించడం చాలా అవసరం. స్కూల్ కు వెళ్లే సమయంలోనే వారు శారీరకంగా, మానసికంగా ఎదుగుతారు. కాబట్టి పిల్లలు ఆరోగ్యంగా ఉండాలన్నా వయస్సుకు తగిన బరువు పెరగాలన్నా.. కొన్ని రకాల ఆహార పదార్థాలను అందించడం అవసరం. ఈ నేపథ్యలోనే పోషకాహారాన్ని వారి డైట్ లో భాగంగా చేయడం మంచిది.


చాలా మంది పిల్లలు స్కూల్ కు వెళ్లేటప్పుడు టైం అవుతుందనో లేక ఇంకేదైనా కారణం చేతనో టిఫిన్ తినడం మానేస్తూ ఉంటారు. కానీ వారి ఎదుగుదలకు ఇదే సరైన సమయం కాబట్టి పిల్లలు అల్పాహారం తీసుకోవడం చాలా అవసరం. శరీర ఎదుగుదలకు కావాల్సిన పోషకాలు, శక్తిని అల్పాహారం అందిస్తుంది. అందుకే పిల్లలు తిన టిఫిన్‌లో తగిన పోషకాలను ఉండేలా చూసుకోవాలి.

పిల్లలు ఎదిగే క్రమంలో వారికి సరైన పోషకాహారం ఇవ్వాలి. టిఫిన్‌గా ఇడ్లీ, దోశలు మీ పిల్లలకు పెడుతున్నట్లయితే గనక అలాంటి వారు వాటిలో క్యారెట్ తురుము, బటానీలను వాడితే మంచిది. దోశల పిండిలో కూడా కూరగాయలు ఆకుకూరలు వేస్తే వారి శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి. ఇవే కాకుండా పిల్లలకు టిఫిన్‌లో లో డైలీ పాలు, గుడ్లు ఇవ్వడం మంచిది. ప్రతీ రోజు ఒక్కో రకమైన సీజనల్ ఫూట్స్ కూడా ఇవ్వండి. వీలైనంతవరకు మోతాదుకు మించి మూడు పూటలా ఆహారం, రెండుసార్లు స్నాక్స్ అందేలా చూసుకోవాలి.

Also Read: బార్లీ వాటర్‌తో అనారోగ్య సమస్యలు దూరం !

పిల్లలకు మధ్యాహ్న భోజనంలో భాగంగా చపాతీ లేదా మిక్స్డ్ వెజిటేబుల్ రైస్ లేదా కిచిడి వంటివి పెడితే మంచిది. సాయంత్రం పూట ఫ్రూట్ మిల్క్ షేక్ ఇవ్వడం ద్వారా వారి శరీరానికి సరైన పోషకాలు అందుతాయి. వీటికి బదులుగా ఉడికించిన శనగలు , బొబ్బర్లు సలాడ్ వంటివి కూడా పెట్టొచ్చు. వీటితో అటుకు, మరమరాలు కూడా ఇవ్వొచ్చు.

పిల్లలకు రాత్రి భోజనంలో కూరగాయలతో పాటు పప్పు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. చిన్నారులకు మాంసాహారులైతే గనక చేపలు, గుడ్లు, చికెన్ వంటివి కూడా ఆహారంలో భాగంగా తినిపించాలి. వీటి వల్ల పిల్లల శరీరానికి కావలసిన ప్రోటీన్ అందుతుంది. ఇక్కడ గుర్తుంచుకోవాలని విషయం ఏంటంటే పిల్లలకి ఎంత మోతాదులో ఆహార అందించాలనేది మాత్రం వారి ప్రస్తుత బరువు మీద ఆధారపడి ఉంటుంది. ఇందుకోసం పోషకాహార నిపుణుల సంప్రదించి ఆహార నియమాలను పాటించండి.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Weight Loss: ఈ యోగాసనాలతో.. 10 రోజుల్లోనే వెయిట్ లాస్

Sugar: చక్కెర తినడం 30 రోజులు ఆపేస్తే.. ఏం జరుగుతుందో తెలుసా ?

Hair Care Tips: వర్షంలో జుట్టు తడిస్తే..… వెంటనే ఇలా చేయండి?

Paneer Effects: దే…వుడా.. పన్నీరు తింటే ప్రమాదమా?

Hair Growth Tips: ఈ టిప్స్ పాటిస్తే.. వారం రోజుల్లోనే ఒత్తైన జుట్టు !

Big Stories

×