BigTV English

Bigg Boss 8 Promo: ‘చీటర్’ అంటూ తిట్టేసుకున్నారు.. అమ్మాయిల మధ్య ఈగో స్టార్ట్ అయిందిగా!

Bigg Boss 8 Promo: ‘చీటర్’ అంటూ తిట్టేసుకున్నారు.. అమ్మాయిల మధ్య ఈగో స్టార్ట్ అయిందిగా!

Bigg Boss 8 Telugu Latest Promo: బిగ్ బాస్ సీజన్ 8లో రేషన్ కోసం ప్రతీవారం జరుగుతున్న టాస్కులు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేస్తున్నాయి. ఈ టాస్కుల వల్ల కంటెస్టెంట్స్ మధ్య గొడవలు కూడా పెరుగుతున్నాయి. ఇప్పటికే రేషన్ కోసం రెండు టాస్కులు జరిగాయని ఇప్పటివరకు విడుదలయిన రెండు ప్రోమోలతో క్లారిటీ వచ్చింది. తాజాగా దీనికి సంబంధించిన మూడో ప్రోమో కూడా విడుదలయ్యింది. ఈ మూడో ప్రోమోలో రేషన్ టాస్క్ కోసం ఇద్దరు చీఫ్స్ అయిన అభయ్, నిఖిల్ రంగంలోకి దిగారు . ఇప్పటికే తన ఫ్రెండ్ అయిన పృథ్వి.. యష్మీతో క్లోజ్‌గా ఉండడంతో సోనియాలో కుళ్లు మొదలయ్యింది. దీంతో మొత్తానికి అమ్మాయిల మధ్య ఈగో చిచ్చు మొదలయ్యిందని అర్థమవుతోంది.


బూరను కొట్టాలి

‘‘తమ మనసుకు నచ్చిన ఆహారాన్ని గెలుచుకోవడానికి ఇరు టీమ్స్‌కు బిగ్ బాస్ ఇస్తున్న ఆఖరి ఛాలెంజ్ బూరను కొట్టు, రేషన్ పట్టు’’ అంటూ టాస్క్ గురించి బిగ్ బాస్ ఇచ్చే వివరణతో ఈ ప్రోమో మొదలవుతుంది. ఇందులో ఇద్దరు చీఫ్స్ అయిన అభయ్, నిఖిల్.. తమ బట్టలకు బెలూన్స్‌ను అంటించుకొని ఉండాలి. ఒకరి బెలూన్స్‌ను మరొకరు పగలగొట్టే ప్రయత్నం చేయాలి. ఈ టాస్కుకు సోనియా సంచాలకురాలిగా వ్యవహరిస్తోంది. అయితే నిఖిల్, అభయ్.. ఒక బాక్స్‌లో నిలబడి మాత్రమే ఈ టాస్క్‌ను పూర్తిచేయాలి. కానీ సంచాలకురాలు అయిన సోనియా మాట కూడా వినకుండా అభయ్.. బాక్స్ నుండి బయటికి వెళ్లి మరీ ఆడాడు. అక్కడే రచ్చ మొదలయ్యింది.


Also Read: సోనియా పోయి.. యష్మి వచ్చే.. బీబీ లవ్ స్టోరీలో కొత్త ట్విస్ట్, ఇదేం జంపింగ్‌రా బాబు!

టాస్కులు ఆడను

‘‘బాక్స్ నుండి బయటికి వస్తే గేమ్ నుండి బయటికి పంపేస్తా’’ అని అభయ్‌కు వార్నింగ్ ఇచ్చింది సోనియా. అయినా సోనియా మాటలను అభయ్ పట్టించుకోలేదు. పదేపదే బాక్స్ నుండి బయటికి వచ్చి ఆటను పూర్తిచేశాడు. మొత్తానికి టాస్క్ పూర్తయిన తర్వాత సంచాలకురాలు అయిన సోనియా.. విన్నర్ ఎవరో బిగ్ బాస్‌కు చెప్పమని కోరాడు. ‘‘నేను గేమ్ చూసినదాని ప్రకారం ఆలోచించి తీసుకుంటాను’’ అంటూ నిఖిల్‌ను విన్నర్ చేసినట్టుగా ప్రోమో చూస్తే అర్థమవుతోంది. దీంతో అభయ్‌కు కోపమొచ్చింది. ‘‘ఆమె సంచాలకురాలిగా నిర్ణయం తీసుకుంది. ఆమె నిర్ణయమే ఫైనల్. నాకు ఆమెతో ఎలాంటి సమస్య లేదు. నేను మాత్రం ఇప్పటినుండి ఏ గేమ్ ఆడను. మీరు నన్ను బయటికి పంపించినా ఓకే’’ అని స్టేట్‌మెంట్ ఇచ్చాడు అభయ్.

సోనియాతో గొడవ

ఇదే విషయంపై అభయ్ ఓడిపోలేదంటూ తన టీమ్ సభ్యులు సైతం సోనియాతో గొడవపడడం మొదలుపెట్టారు. అలా ఇరు టీమ్స్‌కు మధ్య పెద్ద వాగ్వాదమే జరిగింది. ‘‘బాక్స్ లోపలికి రా అన్నప్పుడు నా ఇష్టం అని ఎలా అంటారు’’ అంటూ టాస్క్ రూల్స్‌ను మరోసారి అందిరికీ వివరించింది సోనియా. ‘‘సంచాలక్‌గా కూడా మళ్లీ నిరూపించావు నువ్వు ఒక చీటర్ అని’’ అంటూ సోనియాపై పర్సనల్ అటాక్ మొదలుపెట్టింది యష్మీ. తాజాగా జరిగిన నామినేషన్స్‌లోనే సోనియాపై కోపం పెంచుకుంది. అలాగే సోనియా కూడా పృథ్వి తనతో కాకుండా సోనియాతో క్లోజ్‌గా ఉంటున్నాడని ఫీల్ అయ్యింది. దీంతో యష్మీ, సోనియా మధ్య ఈగో గొడవలు మొదలయ్యాయని ప్రేక్షకులు భావిస్తున్నారు.

Related News

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Big Stories

×