Akkineni Nagarjuna: కింగ్ అక్కినేని నాగార్జున N కన్వెన్షన్ ను ఈ మధ్యనే తెలంగాణ ప్రభుత్వం కూల్చివేసిన విషయం తెలిసిందే. తుమ్మిడికుంట చెరువును ఆక్రమించి నాగార్జున N కన్వెన్షన్ ను నిర్మించాడని.. సీఎం రేవంత్ రెడ్డి దానిని కూల్చివేశారు. ఇక దీనిపై నాగ్ ఎక్కువ స్పందించింది లేదు. ఒక రెండు ట్వీట్స్ పెట్టి వదిలేశాడు. ఆ ట్వీట్స్ లోనే తాను ఆ భూమిని ఆక్రమించలేదని, దానికి డాక్యుమెంట్స్ ఉన్నాయని చెప్పుకొచ్చాడు.
” N-కన్వెన్షన్ కి సంబంధించి వస్తున్న వార్తల్లో వాస్తవాల కంటే, ఊహాగానాలు ఎక్కువ వినిపిస్తున్నాయి . కన్వెన్షన్ నిర్మించబడిన భూమి పట్టా డాక్యుమెంటెడ్ భూమి. ఒక్క సెంట్ భూమి కూడా ఆక్రమించింది కాదు. తుమ్మిడికుంట చెరువు ఆక్రమణకు గురి కాలేదని Special Court, AP Land Grabbing (Prohibition) Act, 24-02-2014న ఒక ఆర్డర్ Sr 3943/2011 ద్వారా జడ్జిమెంట్ ఇవ్వటం జరిగింది. ప్రస్తుతం , నిర్మాణం చట్టబద్ధతపై నిర్ణయాధికారం కోసం గౌరవ హైకోర్టుని ఆశ్రయించటం జరిగింది. న్యాయస్థానం తీర్పు కి నేను కట్టుబడి ఉంటాను. అప్పటి వరకు, ఊహాగానాలు, ఎలాంటి పుకార్లు, అవాస్తవాలు నమ్మవద్దని నేను మిమ్మల్ని సవినయంగా అభ్యర్ధిస్తున్నాను” అంటూ నాగ్ ట్వీట్ చేశాడు.
Devara: దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక ఫిక్స్.. చీఫ్ గెస్ట్ ఎవరంటే.. ?
ఇక దీని తరువాత N కన్వెన్షన్ గురించి ఎక్కడా మాట్లాడింది కూడా లేదు. నాగ్ మాత్రమే కాదు.. నాగ చైతన్య కూడా ఈ వివాదంపై.. నాన్న అంతా సోషల్ మీడియాలో చెప్పేశారు అంటూ తప్పించుకున్నాడు. అయితే.. అన్ని కోట్ల విలువ చేసే N కన్వెన్షన్ ను కూల్చినా నాగ్ ఎందుకు పట్టించుకోలేదు. ఎవరి మీద ఎందుకు ఫైర్ అవ్వలేదు.. ? అన్యాయం జరిగిందని ఎందుకు మాట్లాడలేదు.. ? ఇలాంటి అనుమానాలు అక్కినేని అభిమానులను తొలిచేస్తున్నాయి. తాజాగా ఈ అనుమానాలకు అక్కినేని నాగార్జున అన్నయ్య అక్కినేని వెంకట్ క్లియర్ చేశాడు. ఒక ఇంటర్వ్యూలో వెంకట్.. నాగార్జున వ్యక్తిత్వం గురించి మాట్లాడాడు .
” చిన్న చిన్న విషయాలకు చాలామంది డిస్టర్బ్ అయిపోతారు. నాగార్జున అలా కాదు. బయట పరిస్థితులకు అల్లాడిపోడు. చాలా స్ట్రాంగ్ గా నిలబడతాడు. ఈ మధ్య N కన్వెన్షన్ వివాదం వచ్చింది. చాలామంది చాలా రకాలుగా డిస్టర్బ్ అయ్యి, బ్యాడ్ గా రియాక్ట్ అయ్యి , పానిక్ అయిపోయి.. ఏదో ధర్నా చేసి, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి రచ్చ చేస్తారు. నాగ్ ఇలాంటివి ఏమి చేయకుండా కామ్ గా ఉన్నాడు. ఒక ట్వీట్ పెట్టి వదిలేశాడు. అదే మంచి పని. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక ఘటన జరుగుతూ ఉంటుంది. జీవితంలో ఇష్టం ఉన్నవి జరిగితే పర్లేదు కానీ , ఇష్టం లేనివి..జరిగినప్పుడు అది కూడా సెలబ్రిటీల జీవితంలో ఇలాంటివి జరిగినప్పుడు పదిరెట్లు వారిపైనే ఫోకస్ ఉంటుంది. చాలామందికి జరిగినా.. నాగార్జున విషయంలో అది ఫోకస్ అయ్యింది. కానీ, అతను అలా ఉండడం మంచి పని. ఇప్పుడు కనుక నాగార్జున ఎంటర్ అయితే ఇంకా కాంట్రవర్సీ అవుతూ ఉండేది. అందుకే నాగార్జున సైలెంట్ ఉన్నాడు” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.