E-Paper
Advertisement

Bigg Boss 8 Telugu Promo: సోనియా పోయి.. యష్మి వచ్చే.. బీబీ లవ్ స్టోరీలో కొత్త ట్విస్ట్, ఇదేం జంపింగ్‌రా బాబు!

Bigg Boss 8 Telugu Promo: సోనియా పోయి.. యష్మి వచ్చే.. బీబీ లవ్ స్టోరీలో కొత్త ట్విస్ట్, ఇదేం జంపింగ్‌రా బాబు!
Advertisement

Bigg Boss 8 Telugu Latest Promo: బిగ్ బాస్ సీజన్ 8లో కంటెస్టెంట్స్ అంతా చాలావరకు గొడవపడుతున్నట్టు అనిపించినా.. వారి మధ్య అప్పుడప్పుడు సరదా కబుర్లు కూడా సాగుతుంటాయి. తాజాగా విడుదలయిన ప్రోమో చూస్తే ఆ విషయంపై క్లారిటీ వస్తుంది. ఇప్పటివరకు బిగ్ బాస్ 8లో సోనియా, పృథ్వి, నిఖిల్ మధ్యే ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుందని అనుకున్నారు ప్రేక్షకులు. కానీ వారిద్దరినీ అన్నయ్యలు అంటూ రూటు మార్చింది సోనియా. దీంతో ఇక ట్రయాంగిల్ లవ్ స్టోరీ లేనట్టే అని చాలామంది ఫిక్స్ అయిపోయారు. ఇక తాజాగా విడుదలయిన ప్రోమోను బట్టి చూస్తే బిగ్ బాస్ హౌజ్‌లో కొత్త ట్రాయంగిల్ లవ్ స్టోరీ ప్రారంభం కానుందేమో అనే డౌట్ వస్తుంది.

ఫ్లర్ట్ ఎవరు

Advertisement

సీత, నాగ మణికంఠ, నిఖిల్ కలిసి సరదాగా కబుర్లు చెప్పుకోవడంతో ప్రోమో మొదలయ్యింది. మణికంఠ, యష్మీ మధ్య నామినేషన్స్‌లో చాలా గొడవ జరగడంతో దాని గురించి మాట్లాడడానికి నిఖిల్ వచ్చాడు. అప్పుడే ‘ఫ్లర్ట్’ అనే పదం వచ్చింది. దానికి నిఖిల్ సమర్ధించుకోవాలని అనుకున్నాడు. ‘‘నీతో కాకుండా ఇంకెవరితో మాట్లాడతాను?’’ అంటూ సీతను అడిగాడు నిఖిల్. ‘‘యష్మీతో ఫ్లర్ట్ చేస్తావు’’ అంటూ ఓపెన్‌గా చెప్పేసింది సీత. ‘‘యష్మీతో నేను అసలు సరిగా మాట్లాడను. ఇంక ఫ్లర్టింగ్ ఏం చేస్తాను’’ అని తప్పించుకోవాలని అనుకున్నాడు నిఖిల్. కానీ హౌజ్‌మేట్స్.. ఈ విషయాన్ని వదలకుండా యష్మీని పిలిచి అడుగుదామని పట్టుబట్టారు.

Also Read: మరోసారి రౌడీయిజం చూపించిన పృథ్వి.. అప్పుడు యష్మీ, ఇప్పుడు అభయ్.. ఏం మారలేదుగా!

Advertisement

మనసులో మాట

యష్మీ వచ్చి ‘‘నిఖిల్ నన్ను కొట్టాడు. నేను తనను కొట్టాను’’ అని చెప్పింది. దీంతో అందరూ నవ్వారు. ‘‘సీత కోసం తప్పా నేను ఇంకెవరి కోసం పాడలేదు’’ అని నిఖిల్ అన్నాడు. అది విన్న యష్మీ.. ‘‘నువ్వు హ్యాపీ కదా’’ అని సీతను అడిగా అక్కడి నుండి వెళ్లిపోయింది. ‘‘నీ మనసులో ఏముందో నువ్వు చెప్పడం లేదు’’ అని సీత అనగా.. ‘‘నువ్వు అడగడం లేదు’’ అని నిఖిల్ అన్నాడు. ఒకవైపు నిఖిల్.. యష్మీతో ఫ్లర్ట్ చేస్తున్నాడని ఒక గ్యాంగ్ అనుకుంటూ ఉండగా సోనియా మాత్రం పృథ్వికి, యష్మీకి మధ్యలో ఏదో ఉందని అనుకోవడం మొదలుపెట్టింది. ‘‘నీకు, యష్మీకి మధ్య ఏమవుతుంది’’ అని పృథ్విని డైరెక్ట్‌గా అడిగేసింది సోనియా. ఎందుకలా అడుగుతున్నావని అనగా.. ‘‘నీకు ఆమె అంటే ఇష్టమంట కదా’’ అని చెప్పింది.

తొక్కలో సంచాలక్

బిగ్ బాస్ హౌజ్‌లో రేషన్ కోసం మరోసారి పోటీ మొదలయ్యింది. ‘నత్తలా సాగకు.. ఒక్కటీ వదలకు’ అనే టాస్క్‌లో పోటీపడి రేషన్ గెలుచుకోమని అభయ్, నిఖిల్ టీమ్స్‌ను ఆదేశించారు బిగ్ బాస్. ఇందులో ఇద్దరు కంటెస్టెంట్స్ నత్తల్లాగా డ్రెస్ చేసుకొని కింద పడుకొని క్యాబేజ్‌ను తలతో కదిలిస్తూ మరోవైపుకు తీసుకెళ్లాలి. ఈ టాస్క్‌కు నాగ మణికంఠ సంచాలకుడిగా వ్యవహరించాడు. చివరికి అక్కడ క్యాబేజ్ అయిపోయాయని ప్రేరణ అరవడం మొదలుపెట్టింది. క్యాబేజ్ అయిపోతే టాస్క్ అయిపోయినట్టే అని క్లారిటీ ఇచ్చాడు మణికంఠ. నువ్వెవరు చెప్పడానికి అంటూ తనపై కూడా అరిచింది ప్రేరణ. నేను సంచాలక్‌ని అని మణికంఠ అనగానే తొక్కలో సంచాలక్ అంటూ అక్కడి నుండి వెళ్లిపోయింది.

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×