BigTV English

Bigg Boss 8 Telugu: నీకెప్పుడూ అబ్బాయిల మీదే ధ్యాస.. సోనియాపై యష్మీ పర్సనల్ అటాక్

Bigg Boss 8 Telugu: నీకెప్పుడూ అబ్బాయిల మీదే ధ్యాస.. సోనియాపై యష్మీ పర్సనల్ అటాక్

Bigg Boss 8 Telugu Latest Promo: బిగ్ బాస్ సీజన్ 8లో ప్రతీవారం నామినేషన్స్ మరింత ఇంట్రెస్టింగ్‌గా సాగుతున్నాయి. నామినేషన్స్‌లో జరిగే గొడవలు చాలామంది ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తున్నాయి. ఈసారి బిగ్ బాస్ హౌజ్‌లో ‘చెత్త’ నామినేషన్స్ జరగనున్నాయి. అంటే ప్రతీ కంటెస్టెంట్.. తాము నామినేట్ చేయాలనుకుంటున్న ఇద్దరి కంటెస్టెంట్స్ తలపై చెత్త వేసి వారిని నామినేట్ చేయాలి. ఈ నామినేషన్స్‌లో మరోసారి యష్మీ హైలెట్ అయ్యింది. తనతో పాటు మణికంఠ కూడా లోపల ఎమోషన్‌ను బయటపెట్టాడు. ప్రతీ వారం నామినేషన్స్‌లో మరింత గట్టిగా మాట్లాడుతూ కంటెస్టెంట్స్‌తో పాటు ఆడియన్స్‌ను కూడా ఆశ్చర్యపరుస్తున్నాడు మణికంఠ.


బుర్ర లేదు

ముందుగా సోనియా వచ్చి నైనికాను నామినేట్ చేసింది. తనకు ఓవర్ కాన్ఫిడెన్స్ అంటూ కారణం చెప్పింది. పృథ్విరాజ్ సైతం నైనికాను నామినేట్ చేయగా.. కొత్త పాయింట్స్ ఏమైనా ఉంటే చెప్పమని నైనికా అడిగింది. దానికి సమాధానంగా కొత్త పాయింట్స్ ఏమీ లేవని అన్నాడు పృథ్వి. నైనికా కూడా వచ్చి సోనియాను నామినేట్ చేసింది. ‘‘నాకు అసలు మీరు పోటీ అనే అనిపించడం లేదు’’ అని స్టేట్‌మెంట్ ఇచ్చింది. ‘‘నేను చూపిస్తున్న బలం అంతా ముందు నుండి నాలోనే ఉంది’’ అంటూ సోనియా కూడా పొగరుగా సమాధానమిచ్చింది. నైనికాతో పాటు యష్మీని కూడా నామినేట్ చేసింది సోనియా. ‘‘నిఖిల్, అభయ్, పృథ్వి మీద చూపించిన ఇంట్రెస్ట్ టీమ్‌పై చూపించలేదు. నీ కంఫర్ట్‌ను బట్టి ఆడడానికి నేను రాలేదు. నాకు బుర్ర లేదనుకున్నా పర్వాలేదు’’ అంటూ సోనియాపై ఫైర్ అయ్యింది యష్మీ.


Also Read: అన్యాయంగా ఎలిమినేట్ అయిన శేఖర్ భాషా.. ఎంత రెమ్యునరేషన్‌తో ఇంటికి వెళ్లాడంటే?

చాలా డేంజర్

ప్రేరణ వచ్చి విష్ణుప్రియాను నామినేట్ చేయగా.. ‘‘నీకు వివరణ ఇవ్వడం కూడా చాలా వేస్ట్’’ అంటూ సైలెంట్ అయిపోయింది విష్ణుప్రియా. నామినేట్ అయ్యాక ‘‘బ్రెయిన్‌లెస్ మనుషులు’’ అంది విష్ణుప్రియా. వెంటనే ప్రేరణ కూడా ‘‘యూజ్‌లెస్ మనుషులు’’ అంటూ కౌంటర్ ఇచ్చింది. ఆదిత్య ఓం వచ్చి మణికంఠను నామినేట్ చేసి.. ‘‘నేను కూడా హార్డ్‌గా ఉంటే ఈ హౌజ్‌లో ఒక్క మనిషి కూడా మీకు సపోర్ట్ చేయడు’’ అని అన్నాడు. ‘‘నేనెప్పుడూ మీ దగ్గరకు వచ్చి పొగడండి అని అడగలేదు’’ అని మణికంఠ క్లారిటీ ఇచ్చాడు. ‘‘ఈ హౌజ్‌లో నేను ఎన్నిరోజలు ఉంటానో ప్రతీ నామినేషన్స్‌లో నీ పేరు తీసుకుంటాను’’ అంటూ మణికంఠకు ఛాలెంజ్ చేసింది యష్మీ. ‘‘ఈ హౌజ్‌కు నువ్వు చాలా డేంజర్ అనిపిస్తుంది. నువ్వేం గేమ్ ఆడట్లేదు’’ అంటూ వ్యాఖ్యలు చేసింది.

గట్టిగా అరవగలను

సీత ఎమోషనల్ అంటూ ప్రేరణ, పృథ్వి కారణాలు చెప్పి తనను నామినేట్ చేశారు. ‘‘నీ కన్నీళ్లు ఎమోషన్ అయితే.. నా కోపం మోషనా’’ అంటూ వ్యంగ్యంగా మాట్లాడాడు పృథ్వి. ‘‘ముందు నుండి సంచాలకురాలిగా నీకొక క్లారిటీ ఉండుంటే ఆ గేమ్ వేరేలాగా ఉండేది’’ అంటూ ప్రేరణను నామినేట్ చేసింది నైనికా. నబీల్ వచ్చి ప్రేరణను నామినేట్ చేయగా తనపై అరవడం మొదలుపెట్టింది. ‘‘అరిస్తే గెలుస్తావంటే నీకంటే గట్టిగా అరవగలను’’ అంటూ అరిచాడు నబీల్. అరుచుకో అంటూ పొగరుగా సమాధానమిచ్చింది ప్రేరణ. ప్రేరణ చేసిన ఓవరాక్షన్ యష్మీకి నచ్చి తన బుగ్గ మీద ముద్దుపెట్టింది.

Related News

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Big Stories

×