BigTV English

Shekar Basha Remuneration: అన్యాయంగా ఎలిమినేట్ అయిన శేఖర్ భాషా.. ఎంత రెమ్యునరేషన్‌తో ఇంటికి వెళ్లాడంటే?

Shekar Basha Remuneration: అన్యాయంగా ఎలిమినేట్ అయిన శేఖర్ భాషా.. ఎంత రెమ్యునరేషన్‌తో ఇంటికి వెళ్లాడంటే?

Shekar Basha Remuneration For Bigg Boss 8: బిగ్ బాస్ సీజన్ 8లో రెండోవారం శేఖర్ భాషా ఎలిమినేట్ అయిపోయాడు. కానీ ఇది బిగ్ బాస్ షోలో మునుపెన్నడూ చూడని ఎలిమినేషన్. ఎందుకంటే శేఖర్ భాషా.. ప్రేక్షకుల ఓటింగ్ వల్ల ఎలిమినేట్ అవ్వలేదు. తోటి హౌజ్‌మేట్స్ తనను వద్దనుకోవడం వల్ల ఎలిమినేట్ అయ్యాడు. దీంతో తనను ఇష్టపడే ప్రేక్షకులు.. ఇది చాలా అన్యాయంగా జరిగిన ఎలిమినేషన్ అని, తను మళ్లీ తిరిగొస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆర్జేగా పనిచేస్తున్న శేఖర్ భాషా.. తన రెగ్యులర్ షోలను పక్కన పెట్టుకొని వచ్చాడు కాబట్టి బిగ్ బాస్ కోసం రెమ్యునరేషన్ కూడా భారీగానే అందిందని సమాచారం.


డేంజర్ జోన్

మొదటినుండి శేఖర్ భాషా హౌజ్‌లో చాలా యాక్టివ్‌గానే ఉన్నాడు. పెద్దగా ఎవరితో గొడవపడలేదు కూడా. ఎవరితో గొడవలు లేకుండానే హౌజ్ నుండి బయటికి వచ్చేశాడు. కానీ హౌజ్‌లో చాలామంది శేఖర్ భాషావి కుళ్లు జోకులు అని, భరించడం చాలా కష్టమని అంటుండేవారు. దానిని కూడా తను అంత సీరియస్‌గా తీసుకోలేదు. అలాంటి మనస్థత్వం చాలామంది ప్రేక్షకులకు నచ్చింది. దీంతో తనకు ఓట్లు వేయడం మొదలుపెట్టారు. అయినా కూడా ఇతర కంటెస్టెంట్స్‌తో పోలిస్తే తనకు ఓటింగ్ శాతం తక్కువే ఉంది. బిగ్ బాస్ 8లో రెండోవారం డేంజర్ జోన్‌లో ఆదిత్య ఓం, సీత, శేఖర్ భాషా ఉండగా.. చివర్లో ఎలిమినేషన్ రేసులో ఆదిత్య ఓం, శేఖర్ భాషా నిలిచారు.


Also Read: అతడు తల్లి చావుతో లాభం పొందాలనుకున్నాడు.. శేఖర్ భాషా షాకింగ్ కామెంట్స్

సంతోషంగా బయటికి వచ్చేశాను

శేఖర్ భాషా భార్య ప్రెగ్నెంట్ అవ్వడంతో గత వారం రోజులుగా తను హౌజ్‌లో అంత యాక్టివ్‌గా ఉండడం లేదనే కారణంతో హౌజ్‌మేట్స్ అంతా కలిసి తనను ఎలిమినేట్ చేశారు. అయితే తనపై పగతో, కక్షతో ఎవరూ తనను ఎలిమినేట్ చేయలేదని, కొడుకును చూడాలని ఉందని హౌజ్‌మేట్స్‌తో చెప్పడంతో వారు ప్రేమతోనే తనను బయటికి పంపించారని హౌజ్‌మేట్స్ నిర్ణయాన్ని సమర్ధించాడు శేఖర్ భాషా. ఎవరో అన్యాయం చేయడం వల్ల తాను బయటికి రాలేదని పాజిటివ్‌గా మాట్లాడాడు. మొత్తానికి తన కొడుకు దగ్గరకు చేరుకోవడంతో సంతోషం వ్యక్తం చేశాడు. కానీ తనను ఇష్టపడి ఓట్లు వేసినా ప్రేక్షకులు మాత్రం తను తిరిగొస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు.

రెమ్యునరేషన్ ఎంతంటే

బిగ్ బాస్ షో నుండి ఎవరు ఎలిమినేట్ అయినా కూడా వారి రెమ్యునరేషన్ ఎంత అనే విషయం వైరల్‌గా మారుతుంది. అలాగే ఒక ఆర్జేగా హౌజ్‌లోకి అడుగుపెట్టిన శేఖర్ భాషాకు ఎంత రెమ్యునరేషన్ అంది ఉండవచ్చనే వార్త వైరల్‌గా మారింది. శేఖర్ భాషా మొత్తం 15 రోజులు బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్నాడు. తను రోజుకు రూ.2 లక్షలు పారితోషికం అనే అగ్రిమెంట్‌తో బిగ్ బాస్ షోలో అడుగుపెట్టాడట. అంటే మొత్తం 15 రోజులకు తనకు ర.30 లక్షలు రెమ్యునరేషన్ అందిందని తెలుస్తోంది. మొత్తానికి ఎవరితో గొడవపడకుండా సరదాగా ఉండే ఇలాంటి కంటెస్టెంట్‌ను త్వరగా పంపించేయడం అన్యాయమని చాలామంది నెటిజన్లు సోషల్ మీడియా ద్వారా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Related News

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Big Stories

×