BigTV English

Bigg Boss 8 Telugu : బిగ్ బ్రేకింగ్.. బిగ్ బాస్ హౌస్ లోకి మణికంఠ భార్య.. ఇదేం ట్విస్ట్ మామా..

Bigg Boss 8 Telugu : బిగ్ బ్రేకింగ్.. బిగ్ బాస్ హౌస్ లోకి మణికంఠ భార్య.. ఇదేం ట్విస్ట్ మామా..

Bigg Boss 8 Telugu : బుల్లితెర పై టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న ఏకైక షో బిగ్ బాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. 8 వ సీజన్ ప్రేక్షకుల ప్రశంసల విమర్శలు అందుకుంటుంది. రెండువారాలు పూర్తి చేసుకుంది.. మొదటి వారంకు గాను బెజవాడ బేబక్క ఎలిమినేట్ అవ్వగా, రెండో వారంలో శేఖర్ భాష ఎలిమినేట్ అయ్యాడు. ఇక మూడో వారం నామినేషన్స్ రచ్చ రచ్చగా సాగుతున్నాయి. సోమవారం ఎపిసోడ్ లో నామినేషన్ ప్రక్రియ చెత్తగా ప్రారంభం అయ్యింది. ఎవరికీ వారే స్ట్రాంగ్ అనుకుంటూ అవతల వాళ్లను నామినేట్ చేసేసారు. ఈరోజు ఎపిసోడ్ తో నామినేషన్స్ ముగియనున్నాయి. అయితే తాజాగా రిలీజ్ చేసిన ప్రోమో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక ఈ వారం బిగ్ బాస్ హౌస్ లోకి మణికంఠ భార్య రాబోతుందనే వార్త లు నెట్టింట చక్కర్లు కొడుతుతున్నాయి..


హౌస్ లోకి వచ్చిన కంటెస్టెంట్స్ పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తి కర విషయాలు బయటకు వస్తున్నాయి. అందులో మణికంఠ గురించి ఆసక్తి కర విషయాలు వెలుగు చూసాయి. మొదటి నుంచి సోలోగా ఉంటూ ఎమోషనల్ గా విన్నర్ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడని, అందుకే తన పాస్ట్ గురించి పదే పదే ప్రస్తావిస్తున్నాడు. ఇటీవల సోషల్ మీడియాలో అతని పెళ్లి ఫోటోలు, వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో తాజాగా అతని వైఫ్ ప్రియా సోషల్ మీడియాలో ఓ షాకింగ్ పోస్ట్ షేర్ చేయడంతో.. మళ్ళీ ఈ మ్యాటర్ తెరపైకి వచ్చింది. అతను ఆమె గురించి చెప్పిన విషయాలు నిజమైనవో కాదో ఇప్పుడే తెలుసుకుందాం..

ఆ పోస్ట్ లో.. సమాజం కోసం వారితో కలిసి ఉండటం కంటే ఆ విషపూరిత సంబంధం నుంచి విడిపోవడమే మంచిది’. అలాగే భార్యాభర్తల మధ్య వచ్చే గొడవల వల్ల పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో.. అందరికి అర్థమయ్యేలా ఓ ఫోటోను షేర్ చేస్తూ ‘చిన్నపిల్లల అంతరంగాన్ని వినండి.. ఇది చాలా పవర్ ఫుల్ ఇమేజ్. భార్యాభర్తలు గొడవ పడటం వల్ల అది పిల్లల మానసిక స్థితిపై ప్రభావం చూపిస్తుంది అంటూ పోస్ట్ లో రాసుకొచ్చింది.. ఆ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..


Big breaking.. Manikantha's wife enters the Bigg Boss house..
Big breaking.. Manikantha’s wife enters the Bigg Boss house..

ఇక మణికంఠ పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. తల్లి మరణం తర్వాత తండ్రి కూడా లేడని ప్రియా అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.. అనుకున్నట్లుగానే వారికి ఒక పాప పుట్టింది. ఫ్యామిలీతో పాటు యుఎస్ లో ఉన్న మణికంఠకు సరైన సంపాదన లేకపోవడంతో అవమానాలు మొదలయ్యాయి. దీనితో అతని వైఫ్ ఇండియాకు వెళ్ళిపోమందని .. ఒంటరివాడినయ్యానని చెప్పాడు. ఇక తాజాగా ఓ వార్త ప్రచారంలో ఉంది.. మణికంఠ భార్యను బిగ్ బాస్ కు తీసుకొచ్చే పనిలో బిగ్ బాస్ ఉన్నట్లు తెలుస్తుంది. ఆమె వచ్చాక అసలు నిజాలు ఏంటో తెలియనున్నాయి. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఇక బిగ్ బాస్ లో ఈ వారం నామినేషన్ లో 8 మంది ఉన్నారు. హౌస్ నుంచి ఎవరు బయటకు వెళ్తారో చూడాలి..

Related News

Monal Gajjar : బిగ్ బాస్ బ్యూటీ మోనాల్ గుర్తుందా.? ఇప్పుడేం చేస్తుందో తెలుసా..?

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Big Stories

×