Bigg Boss 8 Telugu Elimination: బిగ్ బాస్ సీజన్ 8లో మొదటివారం బేబక్క ఎలిమినేట్ అయ్యి హౌజ్ నుండి బయటికి వెళ్లిపోయింది. అసలు బేబక్క బయటికి వెళ్లిపోతుందని హౌజ్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌తో పాటు సోషల్ మీడియా ఫాలో అవ్వని ప్రేక్షకులు కూడా షాకయ్యారు. రెండోవారం ఎలిమినేషన్స్‌లో కూడా అదే విధంగా ఒక ఊహించని కంటెస్టెంట్ బయటికి వెళ్లిపోయాడు. తనే శేఖర్ భాషా. అసలు శేఖర్ భాషా ఇంత త్వరగా బయటికి వెళ్లిపోతాడని చాలామంది ఊహించలేదు. కానీ ఓటింగ్స్ విషయంలోనే తక్కువ ఓట్లు పడడం మాత్రమే కాదు.. ఫ్రెండ్సే వెన్నుపోటు పొడవడం కూడా తన ఎలిమినేషన్‌కు కారణమని ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు.
అవే కారణాలు
రెండోవారం నామినేషన్స్‌లో నాగ మణికంఠ, కిర్రాక్ సీత, పృథ్వి, నైనికా, విష్ణుప్రియా, శేఖర్ భాషా, ఆదిత్య ఓం, నిఖిల్ నామినేషన్స్‌లో ఉన్నారు. అందరికంటే ముందు నైనికాను సేవ్ చేశారు నాగార్జున. ఆ తర్వాత ఎవరు సేవ్ అయ్యారు, ఎవరు ఎలిమినేట్ అయ్యారు అనే విషయాన్ని ఆదివారం ఎపిసోడ్‌లో చెప్తానని చెప్పారు. కానీ సోషల్ మీడియా సమాచారం ప్రకారం శేఖర్ భాషా ఎలిమినేట్ అయ్యి హౌజ్ బయటికి వచ్చేశాడు. దీంతో శేఖర్ భాషా ఎలిమినేట్ అవ్వడమేంటి, అసలు తను ఎలిమినేట్ అవ్వడానికి కారణాలేంటి అని నెటిజన్లలో చర్చలు మొదలయ్యాయి. అసలు నామినేషన్స్‌లో జరిగిన సంఘటనలే తను ఎలిమినేట్ అవ్వడానికి ముఖ్య కారణమని తెలుస్తోంది.
Also Read: చీఫ్స్ స్థానాలను కాపాడుకోలేకపోయిన యష్మీ, నైనికా.. నిఖిల్‌తో పాటు అతడే కొత్త చీఫ్
కుళ్లు జోకులు
ఎలాంటి సందర్భం అయినా కూడా కుళ్లు జోకులు వేసుకుంటూ అందరినీ నవ్వించాలనే ప్రయత్నిస్తాడు శేఖర్ భాషా. అదే తనకు ప్లస్‌తో పాటు అతిపెద్ద మైనస్ కూడా అయ్యింది. సందర్భాన్ని పట్టించుకోకుండా, ఎవరు ఏ మూడ్‌లో ఉన్నారని చూడకుండా కుళ్లు జోకులు వేస్తాడంటూ తనపై పలువురు హౌజ్‌మేట్స్‌లో నెగిటివ్ అభిప్రాయం ఏర్పడింది. అసలు శేఖర్ భాషా కుళ్లు జోకులు ఎలా ఉంటాయనే విషయం ప్రేక్షకులకు పూర్తిగా తెలియదు. ఎందుకంటే గంట ఎపిసోడ్‌లో అవి మొత్తం టెలికాస్ట్ అవ్వడం చాలా కష్టం. కానీ హౌజ్‌మేట్స్ చెప్పినదాని ప్రకారం శేఖర్ భాషాపై పలువురు ప్రేక్షకుల్లో కూడా నెగిటివ్ అభిప్రాయం ఏర్పడినట్టు తెలుస్తోంది. అందుకే తన ఓటింగ్ శాతం పూర్తిగా తగ్గిపోయింది.
ఆ ఇద్దరి వల్లే
నాగ మణికంఠ, ఆదిత్య ఓం కలిసి ఈసారి శేఖర్ భాషాను నామినేట్ చేశారు. ముఖ్యంగా ఆదిత్య ఓం అయితే నామినేట్ చేస్తున్నప్పుడు శేఖర్ భాషాకు అసలు మెచ్యురిటీ లేదని, ఎప్పుడు ఏం చేయాలో తెలియదని, బాధ్యత లేదని.. ఇలా చాలా వ్యాఖ్యలు చేశాడు. దీంతో నిజంగానే శేఖర్ భాషా అలాగే ఉంటాడేమోనని చాలామంది ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు. నాగ మణికంఠ కూడా తాను ఎమోషనల్‌గా ఉన్నప్పుడు, సీరియస్‌గా ఫీలవుతున్నప్పుడు భాషా వచ్చి కుళ్లు జోకులు వేస్తాడని పలుమార్లు బయటపెట్టాడు. తనతో క్లోజ్‌గా హౌజ్‌మేట్సే తన గురించి అలా చెప్పడంతో ప్రేక్షకుల్లో కూడా తనపై నెగిటివ్ అభిప్రాయం ఏర్పడి శేఖర్ భాషా హౌజ్ నుండి బయటికి వెళ్లక తప్పలేదని సోషల్ మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి.