Prostitution: ఆంధ్రప్రదేశ్‌లో పరమ పవిత్రంగా భావించే పుణ్యక్షేత్రం తిరుపతి. ఇక్కడా కొందరు దుర్మార్గులు తమ వక్రమార్గాలను వదులుకోలేదు. స్పా సెంటర్ల ముసుగులో వ్యభిచార కూపాన్ని నడిపిస్తున్నారు. ఏక కాలంలోనే మూడు స్పా అండ్ మసాజ్ సెంటర్లపై మెరుపు దాడులు చేశారు. స్పా అండ్ మసాజ్ సెంటర్ ముసుగులో అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. వ్యభిచారం చేస్తున్న వారిని పట్టుకున్నారు. నలుగురు మహిళలు, ముగ్గురు పురుషులు పక్క పక్క గదుల్లో వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డారు. నలుగురు బాధిత మహిళలను పోలీసులు రక్షించారు.
తిరుపతిలో డీబీఆర్ హాస్పిటల్ రోడ్డులో ఉన్న స్పా సెంటర్ పై దాడి చేసి ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బా రాయుడి ఆదేశాల మేరకు పోలీసులు నగరంలోని స్పా అండ్ మసాజ్ సెంటర్లపై ఆకస్మిక దాడులు చేపట్టారు. అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న స్పా సెంటర్ల నిర్వాహకులను అరెస్టు చేసి.. నలుగురు బాధితులను రక్షించారు.
Also Read: Traffic Restrictions: నిమజ్జనం రోజు ట్రాఫిక్ ఆంక్షలు.. వాహనదారులారా బీ అలర్ట్!
ఎస్పీ ఆదేశాల మేరకు పక్కా ప్లాన్‌తో మూడు స్పా అండ్ మసాజ్ సెంటర్లపై ఏకకాలంలో ఆకస్మిక దాడులు చేపట్టామని పోలీసులు వివరించారు. తిరుపతి ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రం అని, ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలను సహించబోమని హెచ్చరించారు. తిరుపతి ప్రతిష్టకు భంగం కలిగిస్తే ఎంతటి వారినైనా కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. డీబీఆర్ హాస్పిటల్ రోడ్డులోని గంగి రెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఉన్న బిల్డింగ్‌లో సీ-7 సెలూన్ అండ్ స్పా సెంటర్ పై దాడులు చేయగా.. అందులో నలుగురు మహిళలు, ముగ్గురు మగ వ్యక్తులు పక్క పక్క గదుల్లో వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డారు. ఈ స్పా సెంటర్ మేనేజర్‌గా మనీషా, ఆర్గనైజర్స్‌గా మహి, వారి భర్త అప్తాబ్ వ్యవహరాలను చూస్తున్నట్టు తెలిపారు. సీ-7 సెలూన్ పై ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.