BigTV English

Bigg Boss 8 Telugu Elimination: సోనియాతో పాటు మరొక కంటెస్టెంట్ ఔట్.. ఇదేంటి కంటెస్టెంట్స్ అంతా కలిసి ఇలా చేశారు?

Bigg Boss 8 Telugu Elimination: సోనియాతో పాటు మరొక కంటెస్టెంట్ ఔట్.. ఇదేంటి కంటెస్టెంట్స్ అంతా కలిసి ఇలా చేశారు?

Bigg Boss 8 Telugu Elimination: బిగ్ బాస్ సీజన్ 8 నుండి సోనియా ఎలిమినేట్ అవుతుందనే వార్త ముందుగానే బయటికొచ్చేసింది. దీంతో నిఖిల్, పృథ్విలపై తప్పా గేమ్ మీద దృష్టిపెట్టని సోనియా.. బిగ్ బాస్ హౌస్‌లో ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి అనే ఫీలింగ్‌కు వచ్చేశారు ప్రేక్షకులు. కానీ మొత్తం ఎపిసోడ్ ప్రసారమయిన తర్వాత అసలు సోనియా వెనక పెద్ద ట్విస్టే ఉంది. శనివారం ప్రసారమయిన ఎపిసోడ్‌లో కంటెస్టెంట్స్ అంతా కలిసి మణికంఠను జీరో అని స్టాంప్ వేయడం వల్ల తను డైరెక్ట్‌గా డేంజర్ జోన్‌లో వెళ్లి పడ్డాడు. ఫైనల్‌‌గా సోనియా, మణికంఠ డేంజర్ జోన్‌లోకి వచ్చినప్పుడు వాళ్లలో ఎవరు ఎలిమినేట్ అవ్వాలని కంటెస్టెంట్స్‌ను అడిగారు నాగార్జున.


జైలుకు వెళ్లిన మణికంఠ

యాక్షన్ ఏరియాలో మణికంఠ, సోనియా ఉన్నప్పుడు వాళ్లిద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవ్వాలని కంటెస్టెంట్స్ నిర్ణయాన్ని అడిగి తెలుసుకున్నారు నాగార్జున. ఎవరికి ఎక్కువ సపోర్ట్ ఉంటుందో వారు హౌస్‌లో ఉంటారని మిగిలినవారు ఎలిమినేట్ అవుతారని అన్నారు. మణికంఠకు ఎక్కువ సపోర్ట్ రావడంతో తను హౌస్‌లో ఉండిపోయాడు. కానీ బిగ్ బాస్ చెప్పేంత వరకు తను జైలులో ఉండాల్సి వస్తుందని చెప్పారు నాగార్జున. సోనియా ఎలిమినేట్ అయ్యి వెళ్లిపోయింది. ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ స్టేజ్‌పైకి వచ్చిన తర్వాత తను ఎలిమినేషన్‌కే సిద్ధంగా ఉన్నానని చెప్పుకొచ్చింది సోనియా. అంతే కాకుండా నిఖిల్, పృథ్వి అసలు తన మాట వినరు అని, హౌస్‌లో ఉన్న అమ్మాయిలే అనవసరంగా అలా అనుకుంటారని చెప్పింది.


Also Read: సోనియా ఆకుల నాలుగు వారాలకు ఎన్ని లక్షలు తీసుకుందంటే..?

అటెన్షన్ కావాలి

ఆఖరికి హౌస్‌మేట్స్‌తో కూడా సోనియా అదే చెప్పింది. హౌస్‌లో ఉన్న అమ్మాయిలంతా ఒకవైపు అయిపోయారని, తన వెనుక మాట్లాడుకుంటూ ఉండేవారని, అందుకే తనకు ఒంటరి అనే ఫీలింగ్ వచ్చిందని అందరిపై ఆరోపణలు చేసింది. యష్మీ తప్పా అమ్మాయిలు అందరూ ఒకరు చెప్పే మాటలకు మరొకరు ప్రభావితం అవుతారని చెప్పింది సోనియా. అమ్మాయిలు అందరికీ నిఖిల్, పృథ్వి నుండి అటెన్షన్ కావాలని కానీ వాళ్లిద్దరూ తన వెంటే ఉండడంతో అందరికీ కుళ్లు అని స్టేట్‌మెంట్ కూడా ఇచ్చింది. దీంతో అందరూ హర్ట్ అయినట్టు అనిపించినా ఎవరూ ఏం మాట్లాడలేదు. సోనియా ఏం చెప్తున్నా కూడా అందరూ సైలెంట్‌గా ఉండిపోయారు.

అదే బుద్ధి

సోనియా ఎలిమినేట్ అని నాగార్జున అనౌన్స్ చేయగానే పృథ్వి ఏడుపు మొదలుపెట్టాడు. కానీ స్టేజ్‌పై తనను చూసిన తర్వాత మాత్రం ఏడవకుండా ధైర్యంగానే ఉన్నాడు. సోనియా వెళ్లిపోతుంది అనగానే నిఖిల్ మాత్రమే బాగా ఏడ్చాడు. నిఖిల్‌ను అన్నంతో పోలుస్తూ తను లేకపోతే హౌస్ అంతా వేస్ట్ అని కూడా స్టేట్‌మెంట్ ఇచ్చింది. పృథ్విని పాయసంతో పోల్చింది. సీత, విష్ణుప్రియా గురించి కూడా అంత పాజిటివ్‌గా ఏం మాట్లాడలేదు. దీంతో సోనియా వెళ్లే ముందు కూడా అలాగే ఉంది అని, తన బుద్ధి ఎప్పటికీ మారదని ప్రేక్షకులు అనుకుంటున్నారు. ఇక ఎపిసోడ్ చివర్లో మరొక ట్విస్ట్ కూడా ఇచ్చారు నాగార్జున. ఈవారం మధ్యలో కూడా ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతారని ప్రకటించి షాకిచ్చారు.

Related News

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Mallika Sherawat: బిగ్ బాస్‌లోకి హాట్ బ్యూటి మల్లికా షెరావత్.. అబ్బాయిలు ఇక టీవీ వదలరేమో!

Big Stories

×