E-Paper
Advertisement

Nagarjuna: నాగార్జున ఏంటి ఇంత సింపుల్ షర్ట్ వేశాడు అనుకుంటున్నారా? కానీ ధర మాత్రం సింపుల్ కాదండోయ్!

Nagarjuna: నాగార్జున ఏంటి ఇంత సింపుల్ షర్ట్ వేశాడు అనుకుంటున్నారా? కానీ ధర మాత్రం సింపుల్ కాదండోయ్!
Advertisement

Nagarjuna In Bigg Boss: బిగ్ బాస్ రియాలిటీ షో తెలుగులో ప్రారంభమయిన తర్వాత పలువురు హోస్టులు మారారు. కానీ మూడో సీజన్ నుండి మాత్రం నాగార్జుననే హోస్ట్‌‌గా వ్యవహరిస్తున్నారు. వీకెండ్ ఎపిసోడ్స్‌లో నాగార్జున రావడం, కంటెస్టెంట్స్‌తో మాట్లాడడం, వారి చేసిన తప్పుల గురించి చెప్పి వారిని మార్చడం.. ఇవన్నీ కామన్. కానీ ఈ వీకెండ్ ఎపిసోడ్స్‌లో ఆయన ధరించే షర్టులపై ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలయ్యింది. ఆ షర్ట్స్ అన్నీ చూడడానికి సింపుల్‌గా ఉన్నా వాటి ధర గురించి తెలిసి అందరూ షాకవుతున్నారు. తాజాగా ప్రసారమయిన ఆదివారం ఎపిసోడ్‌లో నాగార్జున ఒక బ్లూ షర్ట్‌లో కనిపించారు. అది చూడడానికి సింపుల్‌గా ఉన్నా.. దాని ధర తెలిస్తే మాత్రం ప్రేక్షకులు షాక్ అవ్వక తప్పదు.

లక్షల్లో ధర

Advertisement

నాగార్జున బ్లూ షర్ట్ ఏదో బాగుంది, మాకు కూడా ఇలాంటి షర్ట్ కావాలి అనుకున్న నెటిజన్లు.. దాని ధర ఎంతో సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. గూగుల్ చేస్తూ ఈ బ్లూ షర్ట్ ధర 1,842 డాలర్లు అనే విషయం బయటపడింది. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం చూస్తే ఈ షర్ట్ ధర రూ.1,54,209. ఈ ధర చూసిన తర్వాత షర్ట్ చూడడానికి సింపుల్‌గా ఉన్న కూడా దాని ధర లక్షన్నర రూపాయలా అని ప్రేక్షకులు ఫీలవుతున్నారు. అందుకే నాగార్జున స్టైలింగ్ చూసి ఇన్‌స్పైర్ అయినా కూడా అలాంటి బ్రాండ్స్ ధరించడం మన వల్ల కాదు అని మిడిల్ క్లాస్ అబ్బాయిలు అనుకుంటున్నారు.

Also Read: ‘బిగ్ బాస్’ ప్రేరణ ప్రేమకథ.. పాపం ఇంత బాధ భరించిందా!

Advertisement

స్టైలింగ్ ఇన్‌స్పిరేషన్

తాజాగా ప్రసారమయిన ఆదివారం ఎపిసోడ్‌లో మాత్రమే కాదు.. ప్రతీ ఎపిసోడ్‌లో నాగార్జున ధరించే డ్రెస్సులు సింపుల్‌గానే ఉన్నాయి కానీ వాటి ధరలు కూడా ఇలాగే ఉంటున్నాయి. ధర ఎలా ఉన్నా కూడా చాలామంది స్టైలింగ్ ప్రియులకు ఇన్‌స్పిరేషన్‌‌గా నిలుస్తున్నారు నాగ్. ఇప్పుడు మాత్రమే కాదు.. మునుపటి సీజన్స్‌లో కూడా నాగార్జున స్టైలింగ్‌కు ఫ్యాన్స్ ఉన్నారు. కానీ ఆయన హోస్టింగ్‌ గురించే బిగ్ బాస్ ప్రేక్షకులు మిక్స్‌డ్ రివ్యూలు ఇస్తుంటారు. హౌస్‌మేట్స్ ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని కాంట్రవర్సీలు క్రియేట్ చేసినా నాగార్జున మాత్రం వాటి గురించి మాట్లాడడం లేదు అని చాలామంది బిగ్ బాస్ ఆడియన్స్ ఫీలవుతున్నారు.

హోస్టింగ్‌పై ట్రోల్స్

బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభమయ్యి నాలుగు వారాలు అయ్యింది. కానీ ప్రేక్షకులు ఎక్కువగా ఎంజాయ్ చేసిన వీకెండ్ ఎపిసోడ్ ఇదే అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ సీజన్ ప్రారంభమయినప్పటి నుండి నిఖిల్, పృథ్వి, సోనియా మధ్య వ్యవహారం ఎలా శృతిమించుతుందో ప్రేక్షకులు చూస్తూనే ఉన్నారు. దానిపై ఎన్నో ట్రోల్స్ కూడా వస్తున్నాయి. కానీ నాగార్జున మాత్రం దీనిపై ఎందుకు రియాక్ట్ అవ్వడం లేదని చాలామంది ఫీలవుతున్నారు. మొత్తానికి ఈ వీకెండ్ ఎపిసోడ్‌లో వారి వ్యవహారం గురించి నాగ్ స్పందించడం కరెక్టే అని ఆడియన్స్ అనుకున్నారు. సోనియా కూడా బయటికి రావడంతో బిగ్ బాస్ హౌస్‌లో చాలా మార్పులు రానున్నాయని ఆడియన్స్ అంచనా వేస్తున్నారు.

Related News

బిగ్ బాస్10 హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ తనేనా?

బిగ్ బాస్ హౌస్ లోకి గుండెనిండా గుడి గంటలు హీరో.. ఈ ట్విస్ట్ ఏందీ బాలు..వీడియో వైరల్!

బిగ్ బాస్ 10 లాంచింగ్ ఎపిసోడ్… చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో!

న్యూ చాప్టర్ బిగిన్స్.. బిగ్ బాస్ 10 ఎంట్రీ పై జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ!

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

Big Stories

Advertisement
×