BigTV English

Bigg Boss 8 Telugu: నబీల్ హీరో, నిఖిల్ జీరో.. డైరెక్ట్ డేంజర్‌లో పడిన మణికంఠ

Bigg Boss 8 Telugu: నబీల్ హీరో, నిఖిల్ జీరో.. డైరెక్ట్ డేంజర్‌లో పడిన మణికంఠ

Bigg Boss 8 Telugu Latest Updates: బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభమయ్యి దాదాపు నెలరోజులు పూర్తయ్యింది. కొందరు కంటెస్టెంట్స్ కొందరికే దగ్గరయ్యారు. మరికొందరికి తోటి కంటెస్టెంట్స్‌పై ద్వేషం పెరుగుతూ వచ్చింది. వాళ్ల మధ్య ఉన్న మనస్పర్థలు అన్నీ నామినేషన్స్ సమయంలోనే బయటపడతాయి. అంతే కాకుండా నాగార్జున వచ్చిన తర్వాత వీకెండ్ ఎపిసోడ్స్‌లో కూడా కంటెస్టెంట్స్ అందరికీ తెలియని కొన్ని విషయాలు బయటికొస్తాయి. తాజాగా ప్రసారమయిన ఎపిసోడ్‌లో అదే జరిగింది. కొందరు కంటెస్టెంట్స్‌పై మరికొందరు కంటెస్టెంట్స్‌కు అభిప్రాయం ఎలా ఉందో, వారిపై ప్రేక్షకుల అభిప్రాయం ఏంటో అన్నీ క్లియర్‌గా చెప్పారు నాగార్జున.


Also Read: బిగ్ బాస్ నుండి సోనియా ఔట్.. కారణాలు ఇవే అంటున్న ప్రేక్షకులు

నబీల్ హీరో


తాజాగా ప్రసారమయిన ఎపిసోడ్‌లో కంటెస్టెంట్స్ ప్రకారం హౌస్‌లో ఎవరు హీరో, ఎవరు జీరో అని చెప్పాలి. అనూహ్యంగా చాలామంది కంటెస్టెంట్స్.. నబీల్ తలపై కిరీటం పెట్టి తనను హీరో చేశారు. పృథ్వి వచ్చి నబీల్ తనకు సమానమైన పోటీ ఇస్తాడని స్టేట్‌మెంట్ కూడా ఇచ్చాడు. ప్రేరణకు కూడా నబీల్ ఆటతీరు చాలా నచ్చిందని చెప్పింది. సీత కూడా నబీల్ ఆటతీరును మెచ్చుకుంది. నబీల్ చేతికి సర్జరీ అయినా కూడా మూడు గంటల పాటు బెలూన్ పగలకుండా కాపాడాడని గుర్తుచేసుకుంది. ఇక నబీల్ తర్వాత ఎక్కువమంది కంటెస్టెంట్స్.. పృథ్విని హీరో చేశారు. ఒకప్పుడు పృథ్వికి చాలా కోపం అని, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు అని చెప్పినవాళ్లే ఇప్పుడు తనలో మార్పు వచ్చిందని చెప్తూ తనను హీరో అన్నారు.

ప్రభావితం చేస్తున్నారు

ఇక జీరో విషయానికొస్తే అందరికంటే ఎక్కువ జీరోలు.. మణికంఠ, నిఖిల్‌కే వచ్చాయి. సోనియా, పృథ్వి ఏం చెప్తే అది నిఖిల్ వింటాడని, వాళ్లు ముగ్గురు కలిసి తీసుకున్న నిర్ణయాలు హౌస్ మొత్తాన్ని ఎఫెక్ట్ చేసినా పర్వాలేదు అనే మనస్తత్వంలో ఉంటారని కంటెస్టెంట్స్ అంతా ఫీల్ అయ్యారు. అందుకే నిఖిల్‌కు జోరో ఇచ్చారు. ముఖ్యంగా ప్రేరణ అయితే నిఖిల్ చేసిన ప్రతీ తప్పును గుర్తుచేసి మరీ తనకు జీరో ఇచ్చింది. సీత వచ్చి సోనియా వల్ల నిఖిల్ ప్రభావితం అవుతున్నాడని కారణం చెప్పి జీరో అంటూ స్టాంప్ వేసింది. నిఖిల్ అలాగే ఉంటే తనను అందరూ నారదుడు అనుకుంటారని నాగార్జున సైతం తన ప్రవర్తనను మార్చుకోమని చెప్పారు.

మాట మార్చాడు

మొదటివారం తప్పా మిగతా అన్ని వారాల్లో టాస్కుల విషయంలో మణికంఠ చాలా బాగా ఆడుతున్నాడనే ఫీలింగ్ ప్రేక్షకుల్లో కలిగింది. కానీ తను శారీరికంగా బలహీనంగా ఉంటున్నాడనే కారణంతో కంటెస్టెంట్స్ అంతా తనను టాస్కుల నుండి దూరం పెడుతున్నారు. తాజాగా నిఖిల్ టీమ్ నుండి ఒకరు తప్పుకోవాలి అన్నప్పుడు మణికంఠ తనకు తానుగా తప్పుకుంటానని చెప్పాడు. కానీ తర్వాత మాట మార్చాడు. అందరూ కలిసి తనను తొలగించారని అన్నాడు. అలా ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కలాగా మాట్లాడడానికి కారణం ఏంటో కూడా తనకు తెలియడం లేదని చెప్పాడు. దీంతో మణికంఠకు అసలు క్లారిటీ లేదని తనను జీరో అంటూ ముద్రవేశారు హౌస్‌మేట్స్. దీంతో తను ఈవారం నేరుగా డేంజర్ జోన్‌లోకి వెళ్లిపోయాడు.

Related News

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Big Stories

×