BigTV English

Bigg Boss 8 Telugu: పెద్ద మనసుతో సెల్ఫ్ నామినేట్ చేసుకున్న చీఫ్.. నామినేషన్స్‌లో ఎనిమిది మంది కంటెస్టెంట్స్

Bigg Boss 8 Telugu: పెద్ద మనసుతో సెల్ఫ్ నామినేట్ చేసుకున్న చీఫ్.. నామినేషన్స్‌లో ఎనిమిది మంది కంటెస్టెంట్స్

Bigg Boss 8 Telugu Latest Updates: బిగ్ బాస్ సీజన్ 8లో వారం గడుస్తున్నకొద్దీ ముందు వారాల్లో జరిగిన గొడవలను, మనస్పర్థలను పెద్దగా చేసి చూస్తూ అవే కారణాలపై నామినేషన్స్ జరుగుతున్నాయి. అప్పటివరకు ఫ్రెండ్స్‌గా ఉన్నవారు కూడా నామినేషన్స్ అనగానే శత్రువుల్లాగా మారిపోతున్నారు. ఇక మూడో వారంలో హౌజ్‌లో పలు మార్పులు జరిగాయి. అందులో ఒకటి హౌజ్‌కు కొత్త చీఫ్ రావడం. ఇప్పుడు నిఖిల్‌తో పాటు అభయ్ కూడా చీఫ్ అయ్యాడు. నైనికా, యష్మీ.. చీఫ్స్‌గా తమ అర్హతను పోగొట్టుకొని నామినేషన్స్‌లోకి వచ్చారు. చాలామంది కంటెస్టెంట్స్ ఇతరులను పర్సనల్ అటాక్ చేస్తూ ప్రేక్షకుల దృష్టిలో వారిని నెగిటివ్ చేసే ప్రయత్నం చేశారు.


సపోర్ట్ చేయలేదు

మామూలుగా సమయాల్లో అందరితో బాగుండే ఆదిత్య ఓం అసలు రూపం తెలియాంటే నామినేషన్స్ సమయంలో చూడాల్సిందే. తాజాగా జరిగిన నామినేషన్స్‌లో విష్ణుప్రియాను, మణికంఠను నామినేట్ చేశాడు ఆదిత్య. ముందుగా చీఫ్ అయ్యే విషయంలో విష్ణుప్రియా తనకు సపోర్ట్ చేయలేదని కారణం చెప్పాడు. మణికంఠకు అయితే అసలు విశ్వాసం లేదని, ఎవరూ తనకు సపోర్ట్ చేయని సమయాల్లో కూడా తాను చేశానని, అయినా తను చీఫ్ అవ్వడానికి సపోర్ట్ చేయలేదని అన్నాడు. ఆదిత్య ఓం వ్యాఖ్యలు చూస్తుంటే తను చీఫ్ అవ్వడానికి సపోర్ట్ చేయని వాళ్లను టార్గెట్ చేసి నామినేట్ చేసినట్టు అనిపించింది. ఇక ఈవారం ప్రేరణను నామినేట్ చేసినవారి సంఖ్య కూడా ఎక్కువే ఉంది.


Also Read: ఛాన్స్ వస్తే మొహం పగలగొడతా, మా ఇంట్లో అలా ఫేక్‌గా పెంచలేదు.. ఆ కంటెస్టెంట్‌పై యష్మీ ఘాటు కామెంట్స్

సంచాలకురాలిగా ఫెయిల్

ప్రైజ్ మనీ కోసం జరిగిన టాస్క్‌లో ప్రేరణ సంచాలకురాలిగా వ్యవహరించి ఫెయిల్ అయ్యింది. దీంతో చాలామంది తనపై నెగిటివ్ అభిప్రాయంతో ఉన్నారు. ముందుగా వచ్చిన విష్ణుప్రియా.. సంచాలకురాలిగా ప్రేరణ అందరినీ సమానంగా చూసుంటే బాగుండేదని, టాస్క్ అనగానే తనలో మరో మనిషి కనిపిస్తుందని చెప్తూ ప్రేరణను నామినేట్ చేసింది. ఆ టాస్క్ విషయంలో సంచాలకురాలిగా ఉన్నా కూడా తనకు హెల్ప్ చేశానని ప్రేరణ గుర్తుచేసింది. నైనికా కూడా అదే కారణంతో ప్రేరణను నామినేట్ చేసింది. ప్రేరణ వల్లే తాను టాస్క్ ఓడిపోయాననే కోపంతో నబీల్ కూడా వచ్చి ప్రేరణను నామినేట్ చేయగా ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఎవరు గట్టిగా అరుస్తారో అన్నట్టుగా ఇద్దరు పోటీపడ్డారు.

ఎమోషన్స్ పనికిరావు

సోనియా, పృథ్వి, ప్రేరణ వచ్చి సీతను నామినేట్ చేశారు. సీత ఎమోషనల్‌గా ఉండడం గేమ్‌కు కరెక్ట్ కాదని, తను అసలు బిగ్ బాస్‌కే అర్హురాలు కాదని స్టేట్‌మెంట్ ఇచ్చారు. అయినా సీత.. ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా తాను ఎమోషనల్‌గానే ఆలోచించి గేమ్ ఆడతానని సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం హౌజ్‌కు అభయ్, నిఖిల్ చీఫ్స్ కావడంతో ముందుగా వారిద్దరినీ నామినేట్ చేసే అవకాశం లేదని బిగ్ బాస్ తెలిపారు. కానీ నామినేషన్స్ పూర్తయ్యే సమయానికి వారిద్దరిలో ఎవరో ఒకరు నామినేట్ అవ్వాల్సిందే అని, ఆ నామినేట్ అయ్యేది ఎవరో తమనే తేల్చుకోమని ఆదేశించారు. దీంతో నిఖిల్ ఇప్పటికే రెండుసార్లు నామినేషన్స్‌లోకి వెళ్లొచ్చాడని, తనను తాను నామినేట్ చేసుకున్నట్టు తెలిపాడు అభయ్. మూడోవారం బిగ్ బాస్ హౌజ్ నుండి వెళ్లడం కోసం అభయ్, ప్రేరణ, నైనికా, పృథ్వి, మణికంఠ, విష్ణుప్రియా, యష్మీ, సీత నామినేట్ అయ్యారు.

Related News

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Big Stories

×