E-Paper
Advertisement

Bigg Boss 8 Telugu: సోనియా పర్సనల్ అటాక్, మరోసారి మణికంఠ బలి.. వైల్డ్ కార్డ్‌కు సిద్ధం అవ్వాల్సిందే

Bigg Boss 8 Telugu: సోనియా పర్సనల్ అటాక్, మరోసారి మణికంఠ బలి.. వైల్డ్ కార్డ్‌కు సిద్ధం అవ్వాల్సిందే
Advertisement

Bigg Boss 8 Telugu Latest Updates: బిగ్ బాస్ సీజన్ 8లో కొత్త చీఫ్ వచ్చింది. మూడువారాల నుండి నిఖిలే తన చీఫ్ స్థానాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్తుండగా ఇప్పుడు తనకు తోడుగా సీత కూడా హౌస్‌కు కొత్త చీఫ్ అయ్యింది. ఇక కొత్త చీఫ్ వచ్చింది కాబట్టి మరోసారి టీమ్స్‌ను విభజించుకోమన్నారు బిగ్ బాస్. సోనియా, పృథ్వి తప్పా నిఖిల్ టీమ్‌లోకి వెళ్లడానికి ఎవరూ ఇష్టపడలేదు. అందరూ సీత టీమ్‌నే ఎంచుకున్నారు. దీంతో బిగ్ బాస్ ముందుకు పిలిచినవారంతా సీత టీమ్‌లోకి వెళ్లిపోయారు. చివరిగా మణికంఠ, ప్రేరణ మిగిలిపోయారు. మణికంఠకు కూడా సీత టీమ్‌లోకే రావాలని ఉందని, తన లీడర్‌షిప్‌ను చూడాలని ఉందని చెప్పినా చివరికి తనే బలైపోయారు.

వేరే దారిలేక

Advertisement

మణికంఠ ముందు నుండే నిఖిల్ టీమ్‌లోకి వెళ్లకూడదని నిర్ణయించుకున్నాడు. తనకు బదులుగా నిఖిల్ టీమ్‌లోకి ఎవరైనా వెళ్తే తను సీత టీమ్‌లోకి వస్తానని చెప్పినా ఎవరూ వినలేదు. దీంతో వేరే దారిలేక తనే నిఖిల్ టీమ్‌లోకి వెళ్లాల్సి వచ్చింది. ముందుగా సీత టీమ్‌ను ఎంచుకున్న యష్మీ.. ప్రేరణ కోసం నిఖిల్ టీమ్‌కు మారిపోయింది. అది చూసి మణి చాలా ఫీల్ అయ్యాడు. ఇదిలా ఉండగా తన కూతురు తిరిగొస్తే తాను ఎలా ఫీల్ అవుతాడో యాక్ట్ చేసి చూపించమని మణిని అడిగింది సోనియా. మణికంఠ మాత్రం నిజంగానే తన కూతురు ఎదురుగా ఉన్నట్టు ఫీల్ అయ్యి యాక్ట్ చేశాడు. కన్నీళ్లు కూడా పెట్టుకున్నాడు. కానీ కన్నీళ్లు రాకూడదు అంటూ మణికంఠ ఎమోషన్‌ను జోక్‌గా మార్చేసింది సోనియా.

Also Read: ప్రేరణ కోసం యష్మీ త్యాగం.. బాబోయ్ తన మాస్టర్ ప్లాన్ మైండ్ బ్లోయింగ్!

Advertisement

ఒక టాస్క్ విన్

బిగ్ బాస్ సీజన్ 8లో హౌస్‌లోకి రావడానికి 12 మంది వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ సిద్ధంగా ఉన్నారని, వారు రాకుండా ఉండాలంటే సర్వైవల్ టాస్కులు ఆడాలని బిగ్ బాస్ వివరించారు. దీంతో సీత, నిఖిల్ టీమ్స్ మధ్య పోటీ మొదలయ్యింది. తాజాగా ప్రసారమయిన ఎపిసోడ్‌లో రెండు టాస్కులు పూర్తయ్యాయి. మొదటి టాస్క్‌లో సీత టీమ్ విజయం సాధించి ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ హౌస్‌లోకి రాకుండా ఆపింది. నిఖిల్ టీమ్ ఓడిపోవడంతో అందులో నుండి ఒక సభ్యుడు ఇంకా ఏ సర్వైవల్ టాస్కులో ఆడకూడదని, ఆ సభ్యుడు ఎవరో వారినే డిసైడ్ చేసుకోమన్నారు. అందరూ ఊహించినట్టుగానే మణికంఠనే టార్గెట్ చేశారు నిఖిల్ టీమ్ సభ్యులు.

మళ్లీ అదే కారణం

మణికంఠ శారీరికంగా బలంగా లేడంటూ మళ్లీ మళ్లీ అదే కారణం చెప్తూ తనను తరువాతి టాస్కులు ఆడకుండా చేశారు. దానికి వాదించడానికి ప్రయత్నించినా కూడా అందరూ తనను టార్గెట్ చేయడంతో త్యాగం చేస్తున్నట్టు తెలిపాడు. కానీ తన టీమ్ టాస్కుల్లో ఓడిపోతే మాత్రం కచ్చితంగా ఇదే కారణం చెప్పి నామినేట్ చేస్తానని వార్నింగ్ కూడా ఇచ్చాడు. అయినా కూడా రెండో టాస్క్‌లో ఇరు టీమ్స్ ఓడిపోయాయి. ఒక మనిషి తినలేనంత ఆహారాన్ని పంపించి దానిని 40 నిమిషాల్లో పూర్తి చేయమని బిగ్ బాస్ టాస్క్ ఇచ్చారు. ఆ టాస్క్ ఆడడానికి నిఖిల్ టీమ్ నుండి సోనియా, యష్మీ వచ్చినా.. సీత టీమ్ నుండి నబీల్, ఆదిత్య ఓం వచ్చినా కూడా టాస్క్ ఓడిపోయారు. దీంతో ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీని వారు తొలగించలేకపోయారు.

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×