E-Paper
Advertisement

Bigg Boss 8 Telugu: ప్రేరణ కోసం యష్మీ త్యాగం.. బాబోయ్ తన మాస్టర్ ప్లాన్ మైండ్ బ్లోయింగ్!

Bigg Boss 8 Telugu: ప్రేరణ కోసం యష్మీ త్యాగం.. బాబోయ్ తన మాస్టర్ ప్లాన్ మైండ్ బ్లోయింగ్!

Bigg Boss 8 Telugu Latest Updates: బిగ్ బాస్ సీజన్ 8లో ప్రతీవారం ఒక కెప్టెన్ మారడం లాంటివి లేవు. కానీ దాని స్థానంలో ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌కు చీఫ్స్ ఉన్నారు. అంతే కాకుండా వారికి టీమ్స్ ఉన్నాయి. బిగ్ బాస్ 8 ప్రారంభం అయినప్పటి నుండి నిఖిలే చీఫ్‌గా వ్యవహరిస్తున్నాడు. ఎన్ని ఇబ్బందులు, అడ్డంకులు వచ్చినా కూడా తన చీఫ్ స్థానాన్ని మాత్రం కోల్పోలేదు. ఇప్పుడు నిఖిల్‌తో పాటు సీత కూడా బిగ్ బాస్ హౌస్‌కు చీఫ్‌గా మారింది. చాలామంది కంటెస్టెంట్స్ మద్దతుతోనే తను చీఫ్ అయ్యింది. ఇప్పుడ పాత చీఫ్ నిఖిల్, కొత్త చీఫ్ సీత.. తమ టీమ్స్‌ను సెలక్ట్ చేసుకునే టైమ్ వచ్చింది. అప్పుడే యష్మీ తన మాస్టర్ ప్లాన్ అమలు చేసింది.

అందరికీ సీతే కావాలి

చాలామంది మద్దతుతో చీఫ్ అయ్యింది కాబట్టి సీత టీమ్‌లోకి వెళ్లడానికి చాలామంది రెడీగా ఉన్నారు. ముందుగా విష్ణుప్రియా.. నిఖిల్ టీమ్‌లో తనకు అంతగా గుర్తింపు రాలేదని కారణం చెప్పి సీత టీమ్‌లోకి వెళ్లిపోయింది. ఆ తర్వాత వచ్చిన సీత.. నిఖిలే లీడర్‌గా కరెక్ట్ అని, బాండింగ్ లాంటివి హౌస్‌లో ముఖ్యం కాదని చెప్పి నిఖిల్ టీమ్‌లోకి వెళ్లింది. పృథ్వి కూడా నిఖిల్‌తో తన పార్ట్‌నర్‌షిప్ బాగుంటుందనే కారణంతో అదే టీమ్‌లోకి వెళ్లాడు. ఆపై నైనికాకు తాను చీఫ్ అవ్వలేదనే బాధ ఉన్నా, ఆ అవకాశం సీత వల్లే పోయిందని మనసులో ఉన్నా కూడా సీతకే సపోర్ట్ చేస్తానంటూ తన టీమ్‌లోకి వెళ్లింది. ఆపై నబీల్ వచ్చి సీతతో పాటు తన టీమ్‌లో ఉన్న సభ్యులు కూడా తప్పును తప్పులాగా, ఒప్పును ఒప్పులాగా చూస్తారని చెప్తూ తన టీమ్‌లోకి వెళ్లాడు.

Also Read: ఆమెను గెలిపించండి అంటూ వర్మ అభ్యర్థన..కప్పు గ్యారెంటీయేనా..?

యష్మీ త్యాగం

యష్మీ కూడా ఆటను ఆటలాగా చూసేవారు తనకు కావాలని, సీత టీమ్‌లో అందరు అలాంటివాళ్లు ఉన్నారని తన టీమ్‌లోకి వెళ్లడానికి సిద్ధపడింది. ఆదిత్య ఓం కూడా సీత టీమ్‌నే ఎంచుకున్నాడు. చివరిగా మణికంఠ, ప్రేరణ మిగిలారు. వారికి నిఖిల్ టీమ్‌లోకి వెళ్లాలని లేకపోతే సీత టీమ్‌లో ఉన్న ఎవరినైనా ఆ టీమ్‌లోకి పంపి.. వారు ఈ టీమ్‌లోకి రావచ్చని చెప్పారు. మణికంఠకు సీత టీమ్‌లోకి రావాలని ఉంది. అందుకే నిఖిల్ లీడర్‌షిప్ తాను ఆల్రెడీ చూశానని, సీత లీడర్‌షిప్ చూడాలని ఉందని చెప్పినా సీత మాత్రం తనను నమ్మి వచ్చిన సభ్యులను వేరే టీమ్‌కు పంపడానికి ఇష్టపడలేదు. కానీ ప్రేరణ అడిగినప్పుడు మాత్రం యష్మీ.. సీత టీమ్ నుండి నిఖిల్ టీమ్‌కు వెళ్లడానికి సిద్ధపడింది.

నామినేషన్స్‌లో సేఫ్

ఇది చూసిన కంటెస్టెంట్స్‌‌కు ప్రేరణ కోసం యష్మీ త్యాగం చేసిందనే ఫీలింగ్ వచ్చింది. కానీ అలా ఎందుకు చేసిందో తర్వాత బయటపెట్టింది. ప్రేరణకు విష్ణుప్రియా, సీత, నైనికాతో మనస్పర్థలు ఉన్నాయని, వారే తనను ఎక్కువగా నామినేట్ చేశారని, అందుకే వారితో సరిగా ఉంటే తను సేఫ్ అవుతుందని ప్రేరణతో చెప్పింది యష్మీ. ఇక నిఖిల్‌కు కూడా సందేహం మొదలయ్యింది. తన టీమ్‌లోని ఎత్తుజిత్తులు, సీక్రెట్స్‌ను తెలుసుకొని యష్మీ.. పక్క టీమ్‌కు వెళ్లి చెప్తుందేమో అని నిఖిల్ సందేహపడ్డాడు. అందుకే ఏ విషయమయినా తమ మధ్యలోనే ఉండాలని సోనియా, పృథ్విలకు చెప్పాడు. మొత్తానికి సోనియా వల్ల తమకు కూడా సపోర్ట్ దొరకడం లేదనే విషయం నిఖిల్, పృథ్విలకు స్పష్టంగా అర్థమయ్యింది.

Related News

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

ట్రోలర్స్ ఇనయా దిమ్మతిరిగే కౌంటర్.. కాన్ఫిడెంట్ కు మెచ్చుకోవాల్సిందే..!

Bigg Boss Soniya: గిన్నీస్ బుక్ లో సోనియా కూతురికి చోటు.. ఏం చేసిందో తెలుసా..?

Demon Pawan : వివాదంలో బిగ్ బాస్ కంటెస్టెంట్ డిమాన్.. ఆగని ట్రోల్స్..!

బిగ్ బాస్ నటితో సిరాజ్ డేటింగ్.. సంచలనం సృష్టిస్తున్న వీడియో!

Big Stories

×