Bigg Boss 8 Telugu Nominations: బిగ్ బాస్ సీజన్ 8లో రెండోవారం నామినేషన్స్ పూర్తయ్యే సమయానికి ఎనిమిది మంది కంటెస్టెంట్స్.. ఈ లిస్ట్‌లో ఉన్నారు. తాము నామినేట్ చేయాలనుకునే కంటెస్టెంట్‌పై పెయింట్ నీళ్లు పోసి వాళ్లను నామినేట్ చేయాలని చెప్పగానే దాదాపు ప్రతీ కంటెస్టెంట్ ఈ రంగులో నిండిపోయారు. ఎక్కువమంది టీమ్‌మేట్స్‌ను సంపాదించిన చీఫ్‌గా యష్మీ నామినేషన్స్‌లో ఉండదని బిగ్ బాస్ ముందే ప్రకటించారు. కానీ ఇతర చీఫ్స్ అయిన నిఖిల్, నైనికా మాత్రం నామినేషన్స్ నుండి తప్పించుకోలేకపోయారు. చీఫ్స్‌గా వారి ప్రవర్తన నచ్చని కొందరు కంటెస్టెంట్స్.. వారిని కూడా నామినేట్ చేశారు. అలా ఈవారం నామినేషన్స్‌లో ఎనిమిది మంది కంటెస్టెంట్స్ ఉన్నారు.
మణికంఠ ఎస్కేప్
శేఖర్ భాషా, పృథ్విరాజ్, నిఖిల్, ఆదిత్య ఓం, నాగ మణికంఠ, నైనికా, సీత, విష్ణుప్రియా.. వీరంతా బిగ్ బాస్ 8లో రెండోవారం నామినేషన్స్‌లో ఉన్నారు. మొదటి వారంలో బేబక్క ఎక్కువగా యాక్టివ్‌గా ఉండకపోవడం వల్ల తను ఎలిమినేట్ అయిపోయి బిగ్ బాస్ హౌజ్ నుండి బయటికి వెళ్లిపోయింది. అయితే తనతో పాటు నాగ మణికంఠ కూడా డేంజర్ జోన్‌లో ఉన్నాడని సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి. కానీ చివరికి బేబక్క ఎలిమినేట్ అవుతున్నట్టు నాగార్జున ప్రకటించారు. దీంతో తృటిలో మణికంఠ ఎలిమినేషన్ నుండి తప్పించుకున్నాడని ప్రేక్షకులు అనుకోవడం మొదలుపెట్టారు. తను ఎక్కువగా ఒంటరిగా ఉంటున్నాడనే కారణంతో చాలామంది హౌజ్‌మేట్స్.. ఈవారం కూడా తనను నామినేట్ చేశారు.
Also Read: సోనియా అయినా ఐ డోన్ట్ కేర్.. ఇలా షాకిచ్చేవంటి నిఖిల్ భయ్యా – రంగులు గట్టిగానే పడ్డాయిగా!
నామినేషన్స్‌లో చీఫ్స్
చీఫ్‌గా నిఖిల్ అందరితో బాగుండడానికి ట్రై చేసినా కూడా తను డామినేటింగ్‌గా ఉంటున్నాడని, చీఫ్‌గా తను ఫెయిల్ అయ్యాడనే కారణాలతో నామినేషన్స్ఋలోకి వచ్చాడు. నైనికాను కూడా అదే కారణంతో నామినేట్ చేశారు హౌజ్‌మేట్స్. ఒకవేళ యష్మీ ఇచ్చిన డ్యూటీస్ నైనికాకు నచ్చకపోయింటే కన్ఫెషన్ రూమ్‌లోనే మాట్లాడాల్సింది అని, అలా కాకుండా తను సైలెంట్‌గా బయటికి వచ్చేసి తన టీమ్‌మేట్స్ ఇబ్బంది పడడానికి కారణమయ్యిందని కారణాలు చెప్పారు. సీత, ప్రేరణ మధ్య చెత్తకుండి గొడవ ఇంకా తేలకపోవడంతో ఈసారి సీత నామినేషన్స్‌లోకి వచ్చింది. ప్రేరణతో పాటు సోనియా కూడా సీతను నామినేట్ చేసింది.
ఆదిత్య ఓం హైలెట్
బిగ్ బాస్ 8లో రెండోవారం నామినేషన్స్‌లో ఆదిత్య ఓం హైలెట్ అయ్యాడు. హౌజ్‌లోకి వచ్చినప్పటి నుండి అందరితో సరదాగా ఉంటూ, గొడవలకు దూరంగా ఉన్న హౌజ్‌మేట్స్‌లో తను కూడా ఒకడు. ఇంటిపనుల్లో కూడా యాక్టివ్‌గా ఉంటూ అందరికీ సాయం చేశాడు. అయితే ఆదిత్య ఓం ప్రవర్తన కొంతమందికి అనుమానాలు కలిగేలా చేసింది. తను కావాలనే అందరితో మంచిగా ఉంటున్నాడని, అసలైతే తన నిజస్వరూపం ఇది కాదనే కారణాలతో తనను శేఖర్ భాషా, నాగ మణికంఠ నామినేట్ చేశారు. పైగా హౌజ్‌లో టాస్కుల విషయంలో యాక్టివ్‌గా ఉండడం లేదనే కారణంతో తనను అభయ్ నామినేట్ చేశాడు. ఇప్పటికీ బిగ్ బాస్ నామినేషన్స్‌కు సంబంధించిన రెండో ఎపిసోడ్ ప్రసారం కాలేదు. ఒకవేళ అయితే మరికొందరు ఈ నామినేషన్స్ లిస్ట్‌లో ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.