Adani group warns Bangladesh government about power supply: మోదీ దేశంలో కొందరు పారిశ్రామిక వేత్తలకు మాత్రమే అండగా ఉంటున్నారని అందరూ విమర్శిస్తుంటారు. ప్రత్యేకంగా అంబానీ, ఆదానీల కోసమే ఆర్థిక పరమైన మార్పులు చేస్తుంటారని ప్రతిపక్ష నేతలు పనిగట్టుకుని విమర్శిస్తుంటారు. అయితే మోదీ అవేమీ పట్టించుకోకుండా తన పని తాను ప్రశాంతంగా చేసుకునిపోతుంటారు. అయితే కొంతకాలం క్రితం ఆదానీ కంపెనీలన్నీ ఆర్థికంగా నష్టపోయాయి. ప్రపంచ కుబేరుల లిస్టులో ఆదానీ వెనకబడిపోయారు. అయితే పడిలేచిన బంతిలా మళ్లీ ఆదానీ పుంజుకున్నారు. మళ్లీ తన పూర్వ వైభవం పొందారు.
ఆశాకిరణంగా మారిన ఆదానీ
ఆదానీ మళ్లీ పుంజుకోవడానికి పరోక్షంగా మోదీ కారణమంటూ విపక్షాలు ఆరోపణలు చేశాయి. మోదీకి ఆదానీ ఎన్నికల ఫండ్ భారీగా ముట్టజెప్పాడని..ఆర్థిక సరళీకరణ విధానాల ద్వారా ఆదానీకి లబ్ధి చేకూర్చారని దేశమంతటా మోదీని విమర్శిస్తూ వచ్చారు. ఇప్పటికీ ప్రతిపక్షాలకు సందర్భం దొరికితే మోదీ, ఆదానీ గురించే ఎక్కువగా మాట్లాడుతుంటారు. అయితే అన్ని విమర్శలు ఎదుర్కొన్న ఆదానీ ప్రస్తుతం భారత్ కు ఆశాకిరణంగా మారారు. బంగ్లాదేశ్ ను తన కనుసన్నలలో శాసించే స్థాయిలో ఉన్నారు. నమ్మలేని నిజమే అయినా ..తప్పనిసరిగా నమ్మాల్సి వస్తుంది. ఎందుకంటే దానికో బలమైన కారణం లేకపోలేదు.
పీకల్లోతు కష్టాలలో బంగ్లాదేశ్
బంగ్లాదేశ్ లో గత నెలలో రిజర్వేషన్ల నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ప్రాణభయంతో భారత్ కు తప్పించుకుని వచ్చారు. బంగ్లాదేశ్ ప్రస్తుతం పీకల్లోతు కష్టాలలో కూరుకుపోయింది. అయితే షేక్ హసీనా భారత్ తో సన్నిహిత సంబంధాలు కలిగివున్నారు. గత పదిహేనేళ్లుగా భారత్ ను మిత్ర దేశంగా భావించేవారు. ప్రస్తుతం బంగ్లాదేశ్ లో పరిస్థితులు భారత్ కు అనుకూలంగా లేవు. త్వరలో అక్కడ ఎన్నికలు జరిపించి ఖలీదా జియా బంగ్లాదేశ్ అధికార పీఠాన్ని అధిష్టించాలని భావిస్తున్నారు. ఖలీదా జియా భారత్ కు బద్ద శత్రువు. భారత్ కు వ్యతిరేకంగా చైనా, పాకిస్తాన్ లతో రహస్య ఒప్పందాలు కూడా చేసుకునే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం అక్కడ హిందువులకు కూడా రక్షణ లేకుండా పోయింది. భారత దౌత్య అధికారులు సంప్రదించి అక్కడి ప్రభుత్వాన్ని మన దేశానికి చెందిన హిందువులకు రక్షణ కల్పించాలని కోరడం జరిగింది. అయినా అడపాదడపా సంఘటనలు జరుగుతునే ఉన్నాయి. బంగ్లాదేశ్ ప్రధానిగా ఉన్న సమయంలో ఆదానీ సంస్థతో విద్యుత్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటికే అంతర్గత కలహాల నేపథ్యంలో పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయింది బంగ్లాదేశ్.
రూ.4 వేల కోట్ల అప్పు
ఇప్పుడు బంగ్లాదేశ్ తీవ్ర విద్యుత్ సంక్షోభం కూడా ఎదుర్కొంటోంది. ఆదానీ గ్రూప్ కు సంబంధించిన విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంలో ఇప్పటికే రూ.నాలుగువేల కోట్లు అప్పు తీర్చవలసి ఉంటుంది. ఇప్పటికిప్పుడు ప్రజలపై ఈ భారం మోపినా తీవ్ర వ్యతిరేకత వస్తుంది. అయితే తమకు రావలసిన బకాయిలపై బంగ్లాదేశ్ లో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వంపై ఆదానీ గ్రూప్ ఒత్తితడి తెస్తోంది. దాదాపు 25 సంవత్సరాలపాటు నిరవధికంగా కరెంట్ సరఫరా చేసేలా ఆదానీ గ్రూప్ తో ఆ దేశం ఒప్పందం చేసుకోవడం గమనార్హం. ప్రపంచ బ్యాంకు నుంచి కూడా ఆర్థిక సాయం అర్థిస్తోంది. దేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయింది. ఇలాంటి పరిస్థితిలో బంగ్లాదేశ్ ఏమైనా భారత్ కు వ్యతిరేకంగా మాట్లాడితే ఇక్కడ ఆదానీ, మోదీ కలిసి బంగ్లాదేశ్ తోకలు కట్ చేస్తారు. ఆదానీ ఎనర్జీ ఇప్పుడు భారత్ కు ఆశాకిరణంగా మారింది అని అందరూ కామెంట్స్ చేస్తున్నారు.