BigTV English
Advertisement

Bigg Boss 8 Telugu: అబ్బాయిల కోసం అమ్మాయిల లొల్లి.. మరోసారి మాట నెగ్గించుకున్న సోనియా, నారదుడిగా మారిన నిఖిల్

Bigg Boss 8 Telugu: అబ్బాయిల కోసం అమ్మాయిల లొల్లి.. మరోసారి మాట నెగ్గించుకున్న సోనియా, నారదుడిగా మారిన నిఖిల్

Bigg Boss 8 Telugu Latest Updates: తాజాగా బిగ్ బాస్ సీజన్ 8లో నాలుగోవారం నామినేషన్స్ ముగిశాయి. ఈ నామినేషన్స్‌లో యష్మీ.. సోనియాను నామినేట్ చేస్తూ నిఖిల్, పృథ్విలను ఆయుధాలుగా వాడుకుంటున్నావనే స్టేట్‌మెంట్ ఇచ్చింది. దీంతో నామినేషన్స్ ముగిసిన తర్వాత కూడా ఇద్దరి మధ్య దీని గురించి గొడవ సాగుతూనే ఉంది. ఆ గొడవ జరుగుతున్నంతసేపు నిఖిల్, పృథ్వి ఏం చేయాలో తెలియక పక్కకు వెళ్లిపోయారు. కానీ ఇద్దరు అబ్బాయిల కోసం మరీ విచక్షణ మర్చిపోయి కొట్టుకున్నారని ప్రేక్షకులు సైతం ఫీల్ అయ్యారు. ఎంత గొడవ జరిగినా కూడా చివరికి తన మాటే నెగ్గించుకుంది సోనియా. మరోసారి పృథ్విని కీలుబొమ్మను చేసి ఆడుకుంది.


ఫేక్ రిలేషన్స్

నామినేషన్స్‌లో పృథ్వి, నిఖిల్‌ను వాడుకుంటున్నావంటూ సోనియాపై ఆరోపణలు చేసింది యష్మీ. అయితే యష్మీ మాట నెగ్గకూడదు అనే ఉద్దేశ్యంతో తను కూడా నిఖిల్‌తో క్లోజ్‌గా ఉంటుంది కదా అనే పాయింట్ మాట్లాడింది సోనియా. అలా నామినేషన్స్ అంతా వాగ్దాదంలోనే ముగిసిపోయింది. నామినేషన్స్ ముగిసిన తర్వాత పృథ్వి దగ్గరకు వచ్చి ఈ విషయం గురించి మాట్లాడాలనుకుంది యష్మీ. కానీ సోనియా మధ్యలో వచ్చింది. దీంతో యష్మీకి కోపం వచ్చి తనలాగా అమ్మ, చెల్లి అంటూ ఫేక్ రిలేషన్స్ తాను కలపడం లేదని అరవడం మొదలుపెట్టారు. అలా ఒకరు తప్పంటే మరొకరు తప్పు అంటూ ఇద్దరి మధ్య చాలాసేపు వాగ్వాదం జరిగింది.


Also Read: కంటెస్టెంట్స్ ఫోకస్ అంతా ఆ ముగ్గురిపైనే.. నామినేషన్స్‌లో ఇదే హైలెట్, నిఖిల్‌తో పాటు తను కూడా సేఫ్

అర్థం చేసుకుంటాడనుకున్నా

తప్పు చేసినా కూడా ఒప్పుకోదు అంటూ సోనియా గురించి మాట్లాడింది యష్మీ. తనకు హౌస్‌లో ఉన్న అబ్బాయిలపై దృష్టి ఉన్నా కూడా గేమ్ సమయం వచ్చేసరికి సరిగ్గా ఆడతానని చెప్పుకొచ్చింది. అలా కాసేపు సోనియా.. యష్మీపై అరిచిన తర్వాత అక్కడి నుండి వెళ్లిపోయింది. అప్పుడు నిఖిల్ అక్కడికి రావడంతో తన ముందు ఏడ్చేసింది యష్మీ. తర్వాత తన టీమ్ సభ్యులతో కలిసి ఈ విషయంపై చర్చించింది. బాధ కలిగినప్పుడు నిఖిల్ తనను అర్థం చేసుకుంటాడనే ఉద్దేశ్యంతో తన దగ్గరకు వెళ్లానని, కానీ నిఖిల్ ఇప్పుడు పూర్తిగా మారిపోయాడని చెప్పి బాధపడింది. హౌస్ మొత్తానికి కూడా నిఖిల్.. సోనియా చేతిలో కీలుబొమ్మగా మారుతున్నాడనే ఆలోచన స్ట్రాంగ్ అవుతూ వస్తోంది.

ఎమోషనల్ డ్రామా

సోనియా, యష్మీలకు మధ్య గొడవ జరుగుతున్నప్పుడు ముందుగా నిఖిల్.. యష్మీతో మాట్లాడడానికి వెళ్లాడు. దీంతో సోనియా హర్ట్ అయ్యింది. అంతే కాకుండా పృథ్వి దగ్గరకు వచ్చి యష్మీ కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందని మాట్లాడాడు. ఆ విషయం పృథ్వి నేరుగా సోనియాకు వచ్చి చెప్పాడు. ఈ విషయం క్లియర్ చేసుకోవడం కోసం అర్థరాత్రి నిఖిల్‌తో చర్చలు మొదలుపెట్టింది సోనియా. తన మనసు ముక్కలు చేశాడని మరోసారి ఎమోషనల్ డ్రామా మొదలుపెట్టింది. అయినా నిఖిల్ ఫీల్ అయ్యి తనకు సారీ చెప్పాడు. అది వినిపించుకోకుండా తాను గేమ్ ఆడడానికే వచ్చానని, ఇంట్లోవాళ్లు ఏమనుకుంటున్నారు అనేది ఆలోచించడానికి రాలేదని డైలాగులు కొట్టింది సోనియా. చివరికి నిఖిల్ ప్రవర్తన చూసి తనది నారదుడి మెంటాలిటీ అని స్టేట్‌మెంట్ ఇచ్చాడు పృథ్వి.

Related News

Bigg Boss 9 Telugu : గౌరవ్ కు గట్టిదెబ్బ… ఇదేందయ్యా ఇదీ… కట్టప్ప కన్నా తనూజా – ఇమ్మాన్యుయేల్ వెన్నుపోటే దారుణం

Bigg Boss 9 Telugu Day 60 : ఇమ్మూను బోల్తా కొట్టించిన రీతూ… తనూజా వల్ల గౌరవ్ కు తీరని అన్యాయం… దివ్య దిక్కుమాలిన ప్లాన్ సక్సెస్

Bigg Boss 9 Madhuri: వాళ్లు రెమ్యునరేషన్‌ ఇచ్చేదేంటి.. నాకే నెలకు కోటి వస్తుంది.. దివ్వెల మాధురి

Bigg Boss 9 Promo: కెప్టెన్సీ వార్‌.. హీటెక్కిన ఆరేంజ్‌ టీం డిస్కషన్‌, తగ్గేదే లే అంటున్న గౌరవ్!

Bigg Boss 9 Promo: సీక్రెట్ టాస్క్.. అడ్డంగా బుక్కైన ఇమ్మూ !

Bigg Boss 9 Telugu : దారుణంగా పడిపోయిన బిగ్ బాస్ ఓటింగ్ రిజల్ట్.. అతనే విన్నర్..?

Bigg Boss Telugu 9 : ఇమ్మూ బట్టతలపై బిగ్ బాస్ పంచులు… ఈ గుడ్డులో గోల ఏందయ్యా మాకు ?

Bigg Boss 9 : ఈ సీజన్ లో అలాంటి వాడు లేడు, కెప్టెన్ కి ఇచ్చి పడేసాడు 

Big Stories

×