BigTV English

Suriya: పవన్ కు కార్తీ క్షమాపణ.. ఎట్టకేలకు స్పందించిన సూర్య

Suriya: పవన్ కు కార్తీ క్షమాపణ.. ఎట్టకేలకు స్పందించిన సూర్య

Suriya: తిరుపతి లడ్డూ వివాదం రోజురోజుకు హీట్ ఎక్కిస్తుంది. ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారని ఆరోపించిన విషయం విదితమే. ఈ వివాదాన్ని ఎవరెంత సీరియస్ గా తీసుకున్నారో తెలియదు కానీ,  ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఇక స్వామివారి విషయంలో జరిగినదానికి ఆయన మనసు విరిగిపోయి ప్రాయశ్చిత్త దీక్షను కూడా మొదలుపెట్టారు.


నేడు తిరుమల స్వామివారి సన్నిధానంలో లడ్డూ వివాదం గురించి ఎవరు తప్పుగా మాట్లాడిన సహించేది లేదని తెలిపిన పవన్.. ఈ వివాదం గురించి అపహాస్యం చేసిన హీరో కార్తీకి కూడా వార్నింగ్ ఇచ్చారు. నటులుగా అందరిని గౌరవించినా .. సనాతన ధర్మం గురించి మాట్లాడే ముందు వందసార్లు ఆలోచించాలని తెలిపారు. ఇక  పవన్ వ్యాఖ్యలపై కార్తీ స్పందించాడు.

అనుకోకుండా  తప్పు  జరిగిందని, దానికి క్షమాపణలు కోరుతున్నట్లు తెలిపాడు. అంతేకాకుండా హిందూ ధర్మాలకు తాము కూడా కట్టుబడి ఉంటామని చెప్పుకొచ్చాడు. ఇక చెప్పిన వెంటనే.. కార్తీ  సనాతన  ధర్మాన్ని గౌరవిస్తున్నట్లు తెలుపడంతో పవన్.. కార్తీని ప్రశంసలతో ముంచెత్తారు.


“కార్తీ గారు ఈ వివాదం గురించి మీరు స్పందించిన తీరు ప్రశంసనీయం. హిందువుల మనోభావాలకు  సంబంధించిన విషయం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. దీని వెనుక ఎటువంటి ఉద్దేశ్యం లేకుండా నేను దీన్ని మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. ఈ పరిస్థితి అనుకూలంగా లేదని నేను అర్థం చేసుకున్నాను. సినిమా ద్వారా స్ఫూర్తిని పొందుతూనే ఈ విలువలను పెంపొందించడానికి ఎల్లప్పుడూ కృషి చేద్దాం. అంకితభావం, ప్రతిభ మన సినిమాని నిలకడగా సుసంపన్నం చేసిన గొప్ప నటుడిగా మీ పట్ల నా అభిమానాన్ని కూడా తెలియజేస్తున్నాను.

సూర్య, జ్యోతిక.. 2D  ఎంటర్ టైన్మెంట్ టీమ్ మొత్తానికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. సత్యం సుందరం సినిమా మంచి విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నాను” అంటూ తెలిపారు. ఇక  తాజాగా పవన్ ట్వీట్ కు హీరో సూర్య స్పందించాడు.  తమ సినిమాకు విషెస్ తెలిపినందుకు సూర్య, కార్తీ ఇద్దరు   ధన్యవాదాలు తెలిపారు. ” మీ హృదయపూర్వక శుభాకాంక్షలకు ధన్యవాదాలు సార్” అని సూర్య ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×