BigTV English

Bigg Boss 8 Telugu: నీఛమైన మాటలు, చిన్నపిల్లల చేష్టలు.. ఇదెక్కడి ‘దండుపాళ్యం’ బ్యాచ్‌రా బాబు!

Bigg Boss 8 Telugu: నీఛమైన మాటలు, చిన్నపిల్లల చేష్టలు.. ఇదెక్కడి ‘దండుపాళ్యం’ బ్యాచ్‌రా బాబు!

Bigg Boss 8 Telugu Latest Updates: మామూలుగా బిగ్ బాస్ రియాలిటీ షోలో ప్రతీవారం కెప్టెన్స్ అనేవారు మారుతూ ఉంటారు. కానీ బిగ్ బాస్ 8లో మాత్రం హౌజ్‌కు చీఫ్స్ ఉన్నారు. వారెవరో మొదటి వారమే డిసైడ్ కూడా చేసేశారు బిగ్ బాస్. నిఖిల్, నైనికా, యష్మీ చీఫ్స్ అయ్యారు. కానీ యష్మీ మాత్రం లక్‌లో అతిపెద్ద టీమ్‌కు చీఫ్ అయ్యి అన్ని సౌకర్యాలను సొంతం చేసుకుంది. తను మోనార్క్‌లాగా మారి, తన టీమ్‌లోని ప్రతీ ఒక్కరిని రెచ్చగొడుతూ ప్రేక్షకుల ఓపికను పరీక్షిస్తోంది. తాజాగా ప్రసారమయిన ఎపిసోడ్‌లో యష్మీ అండ్ టీమ్ అరాచకాలకు ఆడియన్స్ సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రైజ్ మనీ కోసం మొదలయిన పోటీల్లో యష్మీ ప్రవర్తన శృతిమించిదని అంటున్నారు.


సోనియా ఓవరాక్షన్

ముందుగా ప్రైజ్ మనీ రూ.25 వేల కోసం మణికంఠ, సోనియా, విష్ణుప్రియా మధ్య పోటీ మొదలయ్యింది. టీవీలో వాళ్ల పేర్లు కనిపించగానే ముందుగా ఎవరు వెళ్లి స్విమ్మింగ్ పూల్‌లో దూకుతారో వాళ్లదే ప్రైజ్ మనీ అని బిగ్ బాస్ ప్రకటించారు. పేర్లు కనిపించగానే ఈ ముగ్గురు పరిగెత్తడం మొదలుపెట్టారు. కానీ పృథ్వి మధ్య వచ్చి మణికంఠను అడ్డుకున్నాడు. సోనియా గెలుస్తుంది అనుకున్నాడు కానీ తను బొక్కబోర్లా పడడంతో విష్ణుప్రియా గెలిచింది. టాస్క్ అయిపోయిన తర్వాత ఓవరాక్షన్ చేస్తూ స్విమ్మింగ్ పూల్‌లో దూకుతానని సోనియా ముందుకు రాగా వద్దంటూ తనను గట్టిగా పట్టుకున్నాడు పృథ్వి. పృథ్వి టాస్కులో అలా చేయడం కరెక్ట్ కాదని నిఖిల్.. యష్మీకి చెప్పడానికి ప్రయత్నించాడు.


Also Read: వాళ్లిద్దరితో అదే కనెక్షన్.. ప్లేట్ మార్చేసిన సోనియా.. షాక్‌లో పృథ్వి, నిఖిల్

వైలెన్స్ కావాలి

టాస్కుల్లో ఫిజికల్ అవ్వడం కరెక్ట్ కాదని యష్మీ అండ్ టీమ్‌తో నిఖిల్ చెప్పడానికి ప్రయత్నించాడు. ప్రతీసారి సెంటిమెంటల్‌గా మాట్లాడి తమ గేమ్ తమను ఆడనివ్వడం లేదని యష్మీ.. తనపై అరవడం మొదలుపెట్టింది. పృథ్వికి కూడా నచ్చజెప్పాలి అనుకున్న తను కూడా వైలెన్స్‌ను ఎంకరేజ్ చేసినట్టే మాట్లాడాడు. దీంతో తర్వాత టాస్క్‌లో నిఖిల్‌కు, పృథ్వికి టాస్క్ వచ్చినప్పుడు నిఖిల్ కూడా విచక్షణ లేకుండా ఆడి పృథ్వి చేతిలో నుండి లాక్కొని గెలిచాడు. దాంతో రూ.50 వేలు నిఖిల్ టీమ్‌కు దక్కింది. రూ.70 వేల కోసం నైనికా, యష్మీ, మణికంఠ మధ్య స్పెల్లింగ్స్ పోటీ జరిగింది. చిన్నపిల్లలు కూడా యష్మీకంటే స్పెల్లింగ్స్ విషయంలో షార్ప్ ఉంటారని ప్రేక్షకులు సైతం భావించేలా చేసింది తన ఆట.

సంచాలకురాలిగా ఫెయిల్

విష్ణుప్రియా.. తమ టీమ్‌కు చెందిన పాల ప్యాకెట్ తీసుకుందని యష్మీ వచ్చి తనతో గొడవ పెట్టుకుంది. అంతే కాకుండా తన టీమ్‌మేట్స్ దగ్గరకు వెళ్లి విష్ణుప్రియాకు, తన టీమ్‌కు మెచ్యురిటీ లేదని, స్కూల్‌లో తీసుకెళ్లి పడేయాలని వ్యాఖ్యలు చేసింది. ముఖ్యలు ఈరోజు ఫైనల్‌గా జరిగిన టాస్క్‌లో యష్మీ అండ్ టీమ్ వీరంగం సృష్టించింది. ప్రతీ టీమ్ నుండి ఇద్దరు వచ్చి చేతుల సాయం లేకుండా కాళ్లకు వేసుకున్న సాక్సులను తీసేయాలి. యష్మీ టీమ్ నుండి అభయ్, పృథ్వి రంగంలోకి దిగగా.. అదే టీమ్ నుండి ప్రేరణ సంచాలకురాలిగా వ్యవహరించింది. పృథ్వి ఔట్ అయిపోయినా కూడా యష్మీ అండ్ టీమ్ కలిసి తనను రింగ్‌లోని ఉండమని అరిచారు. అయినా సంచాలకురాలిగా ప్రేరణ తనను బయటికి వెళ్లమని చెప్పింది. మొత్తానికి సాక్స్ టాస్క్‌లో యష్మీ అండ్ టీమ్ ప్రవర్తన చూస్తే దండుపాళ్యం బ్యాచ్ గుర్తొచ్చిందని ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు.

Related News

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Big Stories

×