BigTV English

Vande Bharat: ఒకే రోజు 10 వందే భారత్ రైళ్లకు మోడీ పచ్చజెండా.. తెలుగు రాష్ట్రాల్లో పరుగులు తీసే ట్రైన్స్ ఇవే!

Vande Bharat: ఒకే రోజు 10 వందే భారత్ రైళ్లకు మోడీ పచ్చజెండా.. తెలుగు రాష్ట్రాల్లో పరుగులు తీసే ట్రైన్స్ ఇవే!

PM Narendra Modi: భారత రైల్వే శాఖ ఒకేసారి కొత్తగా పది వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రవేశపెట్టడానికి సర్వం సిద్ధం చేసుకుంది. భారత రైల్వే వ్యవస్థను ఆధునీకరించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ వందే భారత్ రైళ్లను తెచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలుమార్గాల్లో ఈ రైళ్లు శరవేగంగా దూసుకెళ్లుతూ ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని అందిస్తున్నాయి. వీటికితోడు డిమాండ్ ఉన్న రూట్‌లలో అదనంగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లను అందుబాటులోకి తెస్తున్నారు. ఈ నెల 16వ తేదీన ఇలాగే కొత్తగా మరో పది వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పచ్చజెండా ఊపి పరుగులు పెట్టించనున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లోనూ కొత్తగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్లు సేవలు అందించనున్నాయి.


దీంతో ఆగస్టు 31వ తేదీ నుంచి రైల్వే వ్యవస్థలో వందే భారత్ ట్రైన్ల చేరిక ప్రక్రియ కొనసాగుతున్నట్టవుతుంది. గత నెల 31వ తేదీన ప్రధాని మోదీ మూడు వందే భారత్ ట్రైన్లను ప్రారంభించారు. మీరట్ నుంచి లక్నో, మదురై నుంచి బెంగళూరు, చెన్నై నుంచి నాగర్‌కోయిల్ రూట్‌లలో మూడు వందే భారత్ రైళ్లు పరుగుతీస్తున్నాయి. ఈ చేరికలకు కొనసాగింపుగానే ఈ నెల 16వ తేదీన మరో పది వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్లను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు.

కొత్తగా ఈ రూట్‌లలో


ఈ ట్రైన్లతో సుదూర పట్టణాలకు ప్రయాణికులు సులువుగా, వేగంగా చేరుకునే వెసులుబాటు ఏర్పడుతుంది. ఇందులో నాగ్‌పూర్-సికింద్రాబాద్ (578 కిలోమీటర్లు) రూట్ ఉన్నది. ఈ రూట్‌లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అందుబాటులోకి రానుంది. పూణె-హుబ్బలి రూట్‌లోనూ వందే భారత్ పరుగులు పెట్టనుంది.

Also Read: Sitaram Yechury: ఏచూరి వామపక్ష నేత అయినా ‘మేమిద్దరం స్నేహంగానే ఉండేవాళ్లం’: వెంకయ్యనాయుడు

వీటితోపాటు విశాఖపట్నం నుంచి దుర్గ్, తాతానగర్ నుంచి బెర్హంపూర్, రూర్కెలా నుంచి హౌరా, హౌరా నుంచి గయా, ఆగ్రా నుంచి వారణాసి, తాతా నగర్ నుంచి పాట్నా, వారణాసి నుంచి దియోగర్, రాంచి నుంచి గొడ్డా రూట్‌లలో కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లు అందుబాటులోకి రానున్నాయి.

సెంట్రల్ రైల్వే పరిధిలో ఆరు వందే భారత్ ట్రైన్లు నడుస్తున్నాయి. సీఎస్ఎంటీ – షిర్డీ, సీఎస్ఎంటీ – షోలాపూర్, నాగ్‌పూర్ – ఇందోర్ రూట్‌లలో వందే భారత్‌లు సేవలు అందిస్తున్నాయి. కొత్త వందే భారత్ ట్రైన్‌లతో మహారాష్ట్రలో మొత్తం ఎనిమిది వందే భారత్ ట్రైన్లు సేవలు అందిస్తాయి.

Also Read: Sitaram Yechury: ఇందిరా గాంధీతో రాజీనామా చేయించిన సీతారాం ఏచూరి.. మరిన్ని ఆసక్తికర విషయాలివే!

దుర్గ్ – విశాఖపట్నం రూట్‌లో నడిచే వందే భారత్ షెడ్యూల్ ఇలా ఉన్నది. విశాఖపట్నం నుంచి 20829 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఉదయం 05.45 గంటలకు బయల్దేరుతుంది. అది రాయ్‌పూర్, మహాసమంద్, ఖరియర్ రోడ్, కంటాబంజీ, తితలాగడ్, కేసింగ, రాయగడ, విజయనగరం మీదుగా.. మధ్యహ్నం 1.45 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.

ఇక విశాఖపట్నం నుంచి 20830 వందే భారత్ ట్రైన్ మధ్యాహ్నం 2.50 గంటలకు బయల్దేరుతుంది. పైన పేర్కొన్న స్టేషన్ల మీదుగా రాత్రి 10.50 గంటలకు దుర్గ్ చేరుకుంటుంది.

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×