Mirai Heroine : సాధారణంగా దర్శకులు కథలు రాసుకునేటప్పుడు పలానా పాత్రకు వీరు మాత్రమే సెట్ అవుతారు అని అనుకుంటారో ఏమో కానీ.. అందుకు తగ్గట్టుగానే ఆ పాత్రలకి కూడా కరెక్ట్ అయిన వ్యక్తులను దింపి.. సినిమాకి కొత్తదనాన్ని తీసుకువస్తూ ఉంటారు. ఇదంతా పక్కన పెడితే.. సాధారణంగా ఈ మధ్యకాలంలో హీరోయిన్లు రిస్కీ పాత్రలో చేయడానికి కూడా వెనుకడుగు వేయడం లేదు. కానీ తమ పాత్రకు, తమ నటనకు తగిన స్కోప్ ఉంటేనే నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఇక్కడ ఒక హీరోయిన్ కి మాత్రం అసలు సినిమాలో నటనే లేదు. కాకపోతే ఆమె రిస్కీ స్టెప్ తీసుకొని మరీ ఇందులో నటించి.. ఇప్పుడు ఊహించని పాపులారిటీని సొంతం చేసుకుంది. నటనే లేకపోయినా.. ఆ పాత్రకు పెద్దగా స్కోప్ లేకపోయినా.. చాలా సెటిల్డ్ గా నటించి ఊహించని పాపులారిటీని అందుకుంది రితిక నాయక్ (Ritika Nayak).
అసలు విషయంలోకి వెళ్తే.. కార్తీక్ ఘట్టమనేని (Karthik Ghattamaneni) దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్(TG Viswaprasad) నిర్మాణంలో పాన్ ఇండియా మూవీగా వచ్చిన చిత్రం ‘ మిరాయ్ ‘. హీరోగా తేజ సజ్జా (Teja sajja), మంచు మనోజ్(Manchu Manoj)విలన్ గా నటించిన ఈ సినిమా.. సెప్టెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ శ్రియా శరణ్ (Shriya Saran), సీనియర్ హీరో జగపతిబాబు(Jagapathi Babu) కీలక పాత్రలు పోషించారు. ఇందులో హీరోయిన్ గా ‘విభ’ అనే హిమాలయాల నుంచి వచ్చిన అమ్మాయి పాత్రలో నటించింది రితిక నాయక్.
నటనకు స్కోప్ లేదు.. కానీ..
హీరోయిన్ పాత్ర అంటే ఒక రేంజ్ లో అభిమానులు ఊహించుకున్నారు. కానీ ఇందులో ఈమె యాక్టింగ్ ఏం కనిపించలేదు. అసలు యాక్టింగ్ చేసే స్కోప్ కూడా అక్కడ లేదు. కానీ స్క్రీన్ పై చాలా నిండుగా కనిపించింది. థియేటర్లో చూస్తే ఈమె ఒక హీరోయిన్.. హీరోయిన్ అంటే ఇలాగే ఉండాలి.. పక్కా హీరోయిన్ మెటీరియల్ అని అనిపించుకుంది. వాస్తవానికి ఇలాంటి రోల్ చేయాలి అంటే ఎంతో ధైర్యం కావాలి. ఎందుకంటే ఈ సినిమాలో ఆమె కంటూ ఒక క్యారెక్టర్ డిసైడ్ చేయలేదు. డాన్స్ లేదు.. రొమాన్స్ లేదు.. అందాలను చూపించే అవకాశం అంతకంటే లేదు. ఒక ఉద్దేశం కోసం పద్ధతిగా తిరిగే పాత్రను ఆమె చేసింది. ఇలాంటి పాత్ర చేయడానికి హీరోయిన్లు సహజంగా ముందుకు రారు.. కానీ ఈమె ముందుకు వచ్చి సెటిల్డ్ యాక్టింగ్ తోనే భారీగా మార్కులు కొట్టేసింది అని చెప్పవచ్చు.
పక్కా హీరోయిన్ మెటీరియల్..
ఒక ఉద్దేశం కోసం మగాడిని నడిపించే మహిళ పాత్రలో చాలా అద్భుతంగా నటించింది రితిక. ఇక రితిక ఫేస్ కట్ కి ఆ పాత్రకు సరిగ్గా సరిపోయిందని.. ఇలాంటి పాత్రలతోనే పూర్తి న్యాయం చేయగలిగింది అంటే.. ఇక బలమైన పాత్ర తగిలితే ఇంకెంత న్యాయం చేస్తుందో అంటూ నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా రితికా నాయక్ ఈ సినిమా కోసం పెద్దగా కష్టపడినట్లు అనిపించకపోయినా..పైగా తన రియల్ క్యారెక్టర్ కు పూర్తిగా డిఫరెంట్ గా ఉండే పాత్రలో నటించి ఇంకెంత ఇబ్బంది పడిందో అని ఆమె అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా రితిక రిస్కీ క్యారెక్టర్ తో అందరి దృష్టిని ఆకట్టుకుంది అని చెప్పవచ్చు
రితిక నాయక్ సినిమాలు..
‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ అనే సినిమాలో నటించిన ఈమె.. నాని హీరోగా వచ్చిన ‘హాయ్ నాన్న’ సినిమాలో క్లైమాక్స్ లో కనిపించి ఆకట్టుకుంది. ప్రస్తుతం వరుణ్ తేజ్ 15వ చిత్రంలో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ.
also read:Manchu Manoj :అన్నదమ్ములు కలిసిపోయారు… మంచు వారి ఇంటి పొంగిపోతున్న ప్రేమలు!